ప్రసాదం పులిహోర

పులిహోర అనగానే ఏదో తెలియని అనుబంధం ముడిపడి ఉంటుంది ప్రతీ ఒక్కరికి. అందులోనూ దక్షిణ భారత దేశంలోని వారికైతే ఏ శుభకార్యానికైనా పులిహోర ముందుంటుంది. పులిహోరలు ఎన్నో రకాలున్నాయ్.

పులిహోర ప్రతీ ఊరికి ప్రాంతానికి, చేతికి, ఇంటికి రుచి మారుతూనే ఉంటుంది. దేని ప్రేత్యేకత దానికుంది. తమిళులు ఒకలా తెలుగువారు మరోలా, వైష్ణవ ఆలయాల్లో ఇంకోలా ఇంకా పుణ్యక్షేత్రాలలో ఇంకోలా. ఈ పులిహోర నేను సహజంగా ఆలయాల్లో ఇచ్చే తీరులో చేస్తున్నా.

పులిహోరలు ఎన్నో రకాలున్నాయి, మెంతి పులిహోరా, ఆవ పులిహోర, గోంగూర పులిహోరా, ఇంకా నిమ్మ, దబ్బకాయ, మామిడికాయ ఇలా ఎన్నో.

సహజంగా ఇళ్ళలో చేసే పులిహోరకి ఆలయాల్లో ఇచ్చే పులిహోరకి కచ్చితంగా రుచి లో తేడా ఉంటుంది. ఆలయాల్లో ఇచ్చ్చే పులిహోరలో తెలియని రుచి దాగుంటుంది. పెట్టేది పిడికెడు ప్రసాదమే అయినా ఎంతో రుచి. అలాంటి కమ్మటి అమృతం లాంటి ప్రసాదం పులిహోరకి ఈ రెసిపీ లో చెప్పేవి పక్కా కొలతలు.

ఎప్పుడు చేసినా చాలా కమ్మటి పులిహోర వస్తుంది. అలా రావాలంటే ఎంచుకునే పధార్ధలు వాటి కొలతలు ఎంతో ముఖ్యం. అవన్నీ వివరంగా ఈ రెసిపి లో ఉంది.

Tamarind Rice | Prasadam Style Recipe | Prasadam Pulihora

టిప్స్

• కమ్మని ఆలయాల పులిహోరకి కాస్త నూనె ఉండాలి. నూనె ఉంటేనే రుచి. నూనె తక్కువగా వేస్తే నోరు చుట్టుకుపోవడమే కాక అంత రుచిగా కూడా ఉండదు.

తాలింపుకి ఈ నూనె బెస్ట్:

• పులిహొరకి నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది. లేని వారు రిఫైండ్ నూనె వాడుకోవచ్చు.

• ఈ పులిహొరకి రెండు తాలింపులు ప్రేత్యేకమైన గుభాళింపుని ఇస్తుంది. ప్రతీ తాళింపులోనూ ఆవాలు వేస్తాము కాబట్టి ఆవాలు కొద్దిగా వేసుకోండి.

ఆలయాల్లోని పులిహోరకి అంత రంగు ఎలా వస్తుంది?

• పులిహోరకి మాంచి రంగు మాంచి పసుపు ఇంకా పాత చింతపండు నుండి వస్తుంది. కొత్త చింతపండు వాడితే పసుపు పచ్చగా ఉంటుంది. పాత చింతపండు వాడితే ముదురు ఎరుపు రంగులోకి వస్తుంది.

ఇలా కూడా మార్పు చేసుకోవచ్చు!

• ఈ పులిహోరా ఆవ పులిహోర. అంటే ఆవాల ఘాటు ఎక్కువగా, చింతపండు పులుపు కొద్దిగా ఉంటుంది. ఆవాల ఘాటు కొందరికి నచ్చదు అలాంటి వారు నేను వేసిన మోతాదుకి తగ్గించి వేసుకోండి.

• ఆవాలు గ్రైండ్ చేసేప్పుడు కొద్దిగా అల్లం ముక్క వేసి రుబ్బితే ఆవాల వగరు తగ్గుతుంది. లేదంటే ఒక్కోసారి ఘాటుగా చేదుగా అవుతుంది.

పులిహోర పొడి పొడిగా రావాలంటే:

• బియ్యాన్ని కడిగి నానబెట్టకుండా కప్ కి రెండు కప్పులు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి హై- ఫ్లేమ్ మీద మాత్రమే 3 కూతలు రానిచ్చి స్టవ్ ఆపేయాలి. ఆ తరువాత స్టీమ్ అంతా పూర్తిగా పోయాక గరిటతో నిదానంగా మెతుకు విరగకుండా కలుపుకోవాలి.

Tamarind Rice | Prasadam Style Recipe | Prasadam Pulihora

ప్రసాదం పులిహోర - రెసిపీ వీడియో

Tamarind Rice | Prasadam Style Recipe | Prasadam Pulihora

Prasadam | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Resting Time 15 mins
  • Total Time 50 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms బియ్యం
  • 1/4 cup నూనె
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 3 పచ్చిమిర్చి
  • 1 tsp పసుపు
  • ఉప్పు
  • 50 gms చింతపండు
  • మొదటి తాలింపు
  • 2 tsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1 tsp మెంతులు
  • 1 కరివేపాకు
  • 1/2 tsp ఇంగువ
  • రెండో తాలిమ్పుకి
  • 1/4 cup నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/4 cup వేరు సెనగపప్పు
  • 1 tbsp సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 5 ఎండు మిర్చి
  • 1 రెబ్బ కరివేపాకు
  • ఆవాల ముద్దకి
  • 2 tsp ఆవాలు
  • 1 ఎండు మిర్చి
  • 1 inch అల్లం
  • ఉప్పు – కొద్దిగా

విధానం

  1. చింతపండుని వేడి నీటిలో నానా బెట్టి 250ml చింతపండు పులుసు తీయండి.
  2. బియ్యాన్ని కడిగి కప్ కి రెండు కప్పుల నీళ్ళు పోసి మూడు విసిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి.
  3. ఆవిరి పోయాక వేడి మీదే పసుపు, నూనె, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు ఉప్పు వేసి నిదానంగా పట్టించి చల్లారనివ్వండి.
  4. ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, అల్లం వేసి మెత్తగా పేస్టు చేసుకోండి(గ్రైండ్ చేసే ముందు టిప్స్ చూడండి).
  5. 2 tsps నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రగా వేపుకోండి, తరువాత కరివేపాకు వేసి వేపుకోండి.
  6. తరువాత చింతపండు పులుసు పోసి అందులో బెల్లం తరుగు వేసి పులుసు చిక్కటి గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోండి.
  7. చింతపండు పులుసు చిక్కగా అయ్యాక ఆవాల పేస్టు వేసి ఓ ఉడుకు రానివ్వండి, ఓ ఉడుకు వచ్చాకా స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే అన్నాన్ని వేసి బాగా పట్టించండి.
  8. రెండో తాలిమ్పుకి ¼ కప్ నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటమనిపించి వేరుసెనగపప్పులు వేసి ఎర్రగా వేపి తరువాత సెనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి.
  9. ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలు వేసి వేపుకుని పులిహోరలో వేసి కలుపుకోండి అంతే ప్రసాదం పులిహోరా తయార్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

9 comments

  • L
    Lohith
    Recipe Rating:
    adbutanga vachindi taste tirumala la acha atlage undi
  • V
    VASUDHA
    Recipe Rating:
    I have tried this recipe , i followed every Measurement and the taste and flavours were soo good👌👌👌. Loved it 😊
  • R
    Ramya
    Recipe Rating:
    I have tried the recipe 👌👌 ga vachindi
  • J
    Jaya reddy
    Recipe Rating:
    I have tried this temple style prasadam and it came out well. Intha manchi taste vastundi ani anukoledu first time chesinapude. Tq vismai food
  • S
    Sudha sri
    Temple style Prasadam pulihora nenu try chesa andi chalaaa baga vachindi... Nenu aa pandaga vachinaa e pulihora aa chesta everytime that taste was awesome😊...
  • S
    Sai Kiran
    Recipe Rating:
    Nowadays tamarind paste makes our life easy to cook any dish early. anyway, it's a time-saving process. Thank you and your team for the best recipe and Have you tried Tamarind paste at Laddu Express order now.!
  • M
    Mangalagouri
    Recipe Rating:
    Super
  • S
    suryaprakash madeti
    We have done according to measurements given in the video but the taste is not at all good..
  • V
    Vani
    Recipe Rating:
    Super sir
Tamarind Rice | Prasadam Style Recipe | Prasadam Pulihora