అప్పాలు / సజ్జ అప్పలు | చాలా త్వరగా కరకరలాడే అప్పాలు | రవ్వ అప్పాలు

తీపి తినాలనిపించినప్పుడు లేదా ప్రసాదంగా ఈ రవ్వ అప్పాలు పర్ఫెక్ట్. దక్షిణ భారతం స్పెషల్ ప్రసాదం అప్పాలు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

“రవ్వ అప్పాలు” దక్షిణా భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు. ఈ అప్పాలనే సజ్జ అప్పాలు అని కూడా అంటారు. ఈ రవ్వ అప్పాలు బయట కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయ్.

“అప్పాలు” పండుగలకి ప్రసాదంగా ఇంకా ఎక్కువగా హనుమంతుడికి ప్రేత్యేకంగా నివేదిస్తారు ఆంధ్రులు. అప్పలు 3-4 తీరుల్లో చేస్తారు అందులో ఇదొకటి.

అప్పాలు చేయడం చాలా తేలిక. రవ్వ, పంచదార ఉడికించి ముద్దలు చేసి వేపి తీసుకోవడమే. ఇవి కనీసం 3-4 రోజులు నిలవ కూడా ఉంటాయ్.

Appams / Sojja Appams | Rava Appam |  How to make Sooji Appam | Suji Appam Recipe | Quick and Easy Recipes

టిప్స్

  1. అప్పాలు వేడి నూనెలో వేసినప్పుడు బరువుగా ఉండే అప్పాలు ముకుడు అడుగుకి చేరి ముకుడుని పట్టుకుంటాయ్. కాస్త వేగాక గరిట పెట్టి కడిపితే వచ్చేస్తాయ్. అప్పాలు వేసిన వెంటనే గరిటతో కదిపితే పగిలిపోతాయ్.

  2. అప్పలు అడుగు పట్టకుండా ఉండాలంటే చిల్లుల గారెల గరిట వేడి నూనె ఉంచి దాని మీద అప్పాలు 5-6 వేసి కాసేపు వదిలేస్తే వేగుతాయ్. ఆ తరువాత గరిట తీసి నూనెలోకి వదిలితే చక్కగా వేగుతాయ్.

Appams / Sojja Appams | Rava Appam |  How to make Sooji Appam | Suji Appam Recipe | Quick and Easy Recipes

అప్పాలు / సజ్జ అప్పలు | చాలా త్వరగా కరకరలాడే అప్పాలు | రవ్వ అప్పాలు - రెసిపీ వీడియో

Appams / Sojja Appams | Rava Appam | How to make Sooji Appam | Suji Appam Recipe | Quick and Easy Recipes

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 25 mins
  • Resting Time 15 mins
  • Total Time 41 mins
  • Servings 15

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బొంబాయ్ రవ్వ
  • 1 cup పంచదార
  • 1/2 tsp యాలకల పొడి
  • 1 cup నీళ్ళు
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. రవ్వలో పంచదార యాలకలపొడి వేసి కలిపి పక్కనుంచుకోండి.
  2. గిన్నెలో కప్పు నీళ్ళు పోసి తెర్ల కాగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో రవ్వ పోస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి లేదంటే గడ్డలు కట్టేస్తుంది.
  3. రవ్వ బాగా కలిశాక మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి దింపి పూర్తిగా చల్లారచాలి.
  4. చల్లారిన రవ్వ ముద్దని చేతికి నూనె రాసుకుని చిట్టి గారెలా మాదిరి వత్తుకోవాలి.
  5. వత్తుకున్న అప్పాలని వేడి నూనెలో వేసి మీడియం – హై ఫ్లేమ్ మీద ఎర్రగా బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  6. వేగిన అప్పాలని గరిటతో నొక్కితే పీల్చిన నూనె అప్పాలు వదులుతాయ్.
  7. వత్తుకున్న అప్పాలని గాలికి ఆరానిచ్చి ఆరగించండి. (వేడి మీద అప్పాలు లోపల ముద్దగా ఉంటాయ్ , చల్లారాక బిరుసుగా అవుతాయ్)
Appams / Sojja Appams | Rava Appam |  How to make Sooji Appam | Suji Appam Recipe | Quick and Easy Recipes