అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం

ఈ ప్రసాదం చేయడం చాలా తేలిక. కానీ వేసే పదార్ధాలు, వండే తీరు మీదే ఆధారపడి ఉంది అసలు రుచి రంగు సువాసన. గోధుమ నూక, బెల్లం, పంచదార కలిపి చేసే ఈ ప్రసాదం రుచి ఎంత చెప్పినా తక్కువే, వందే తీరులో వండితే.

నన్ను ఈ ప్రసాదం రెసిపీ చెప్పమని చాలా మంది అడుగుతూనే ఉన్నారు, కానీ నాకు నిజమైన రెసిపీ తెలిసిన రోజున చెప్పాలని టైం తీసుకున్నా. నిజానికి చాలా కష్టపడ్డాను అన్నవరం గోధుమ నూక ప్రసాదం రెసిపీ తెలుసుకోడానికి. అదృష్టం కొద్దీ నిజమైన రెసిపీతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అవే మీకు వివరంగా ఈ రెసిపీలో ఉంచాను.

అన్నవరం ప్రసాదం లో ఇవి కలుపుతారట కదా?

సత్యదేవుని ప్రసాదంలో వెనుకటికి తాటి బెల్లం వాడేవారని, ఇంకా పాత బెల్లం కూడా వాడతారని, ఇంకా కాస్త తేనే కూడా కలుపుతారని చాలా చెప్తారు! నేను అదే విషయాన్నీ ఆలయంలోని ప్రసాదం తయారీ దారులని అడిగాను, వారు అదేమీ లేదండి వెనుకటికి ఏమో తెలియదండి నేను కనీసం 50 సంవత్సరాలుగా చేస్తున్నా నేను మాత్రం ఇలాగే చేస్తా అని ఆలయం లో చేసే తీరుని నేర్పారు. అదే తీరులో నేను చేస్తే నాకు చక్కని పహలితం వచ్చింది. సరిగ్గా అన్నవరం ప్రసాదం రుచి వచ్చింది.

ఈ రెసిపీ లో అడుగడుగునా ఎన్నో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయ్ అవి జాగ్రత్తగా పాటిస్తే కచ్చితంగా అన్నవరం ప్రసాదం మీరు ఏ పండుగకైనా చక్కగా చేసుకోవచ్చు.

Annavaram Prasadam Recipe | Real Annavaram Prasadam Recipe | Sri Swamy Vari Prasadam

టిప్స్

  1. ఎర్ర గోధుమ నూకని మాత్రమే వాడాలి.

  2. కప్ గోధుమ రవ్వకి కప్ పంచదార, కప్ బెల్లం తురుము, 3-4 కప్స్ నీళ్ళు

  3. సహజంగా పంచదార, బెల్లం రెండూ వాడతారు ప్రసాదం లో, నచ్చితే అచ్చంగా బెల్లం కూడా వాడుకోవచ్చు పంచాదారకి బదులు.

  4. సహజంగా ప్రసాదాల్లో డ్రై ఫ్రూట్స్ వేస్తారు, కానీ అన్నవరం ప్రసాదంలో వేయరు.

  5. ప్రసాదంలో వేసే సుగంధ ద్రవయాల్లో "పటిక" చాలా ముఖ్యమైనది. పటిక ప్రసాదాన్ని చల్లారాక కూడా మృదువుగా, తేమగా ఉంచేందుకు దోహదం చేస్తుంది

  6. పటిక అంటే నీటిని శుభ్రపరచడానికి, ఇంకా ఇంటికి దృష్టి దోషం పోవడానికి కడతారు. దీన్నే ఇంగ్లిష్ లో alum అంటారు.

  7. రవ్వ ఉడికి...పంచదార, బెల్లంలో కరిగి ఆ తరువాత పాకం లో మరిగి మరిగి మాంచి రంగు తిరుగుతుంది, దానితో మాంచి రంగు రుచి వస్తుంది.

Annavaram Prasadam Recipe | Real Annavaram Prasadam Recipe | Sri Swamy Vari Prasadam Annavaram Prasadam Recipe

అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం - రెసిపీ వీడియో

Annavaram Prasadam Recipe | Real Annavaram Prasadam Recipe | Sri Swamy Vari Prasadam | How to Make Annavaram Prasadam

Prasadam | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 45 mins
  • Total Time 55 mins
  • Servings 15

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup ఎర్ర గోధుమ రవ్వ
  • 1 cup పంచదార
  • 1 cup బెల్లం తురుము
  • 1/3 cup నెయ్యి
  • సెనగబద్దంత జాజికాయ ముక్క
  • 1/4 tsp పటిక
  • 4-5 యాలకలు
  • 2 చిటికెళ్ళ కుంకుమపువ్వు
  • 3 నీళ్ళు

విధానం

  1. జాజికాయ, పటిక, యాలకలు, కుంకుమపువ్వు వేసి బాగా దంచి పక్కనుంచుకోండి.
  2. అడుగు మందంగా ఉన్న మూకుడులో గోధుమ నూక వేసి సన్నని సెగ మీద కలుపుతూ నూక తెల్లగా అయ్యేదాకా వేపుకుని పక్కనుంచుకోవాలి.
  3. అదే మూకుడు లో 3 కప్పుల నీరు పోసి హై-ఫ్లేం మీద ఎసరుని తెర్ల కాగనివ్వాలి.
  4. ఎసరు మరుగుతుండగా వేపుకున్న రవ్వ వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేం మీద రవ్వని మెత్తగా ఉడకనివ్వాలి
  5. ఉడికిన రవ్వలో పంచదార పోసి కరిగించి మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాలు ఉడికిస్తే మంచి రంగులోకి వస్తుంది, అప్పుడు బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి.
  6. బెల్లం పూర్తిగా కరిగి పాకం పైకి తేలి ప్రసాదం కుతకుతలాడుతూ ఉడుకుతుంది, అప్పుడు నెయ్యి పోసి కదపకుండా మూతపెట్టి 5-6 నిమిషాలు వదిలేయాలి.
  7. 5-6 నిమిషాలకి నెయ్యిలో మరిగి మాంచి బంగారులోకి వస్తుంది ప్రసాదం, అప్పుడు దంచుకున్న సుగంధద్రవ్యలన్నీ వేసి బాగా కలిపి చిక్కబడేదాక ఉంచి దిమ్పెసుకోండి.
  8. వేడి మీదే విస్తరాకులో చుట్టి ఉంచితే ఆకు పరిమళం ప్రసాదానికి పట్టి అన్నవరం ప్రసాదం రుచి వస్తుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

11 comments

Annavaram Prasadam Recipe | Real Annavaram Prasadam Recipe | Sri Swamy Vari Prasadam