“పరమాన్నం” దీన్నే “పాయసం” అని కూడా అంటారు. పయస్సు అంటే పాలు సంస్కృతంలో, పాలతో తయారయ్యింది కాబట్టి పాయసం అయ్యింది. ప్రసాదంగా నివేదించాక గొప్పది అవుతుంది కాబట్టి పరమాన్నం అయ్యింది. “పరమన్నం” అనే మాట ఎక్కువగా తెలుగు వారు వాడతారు.

దక్షిణాదిన పాయసం సాధారణంగా బియ్యంతోనే చేస్తారు, నేను గోధుమ రవ్వ వాడి చేశాను. ఈ గోధుమ పరమాన్నం ఏదైనా పండుగలప్పుడు, వ్రతాలకి, శుభకార్యానికి సులభంగా చేసుకోవచ్చు. ఈ గోధుమ నూక ప్రసాదం నేను రథసప్తమి కోసం కొంచెం మార్చి సూర్యునికి ప్రీతి అయిన పదార్ధాలని చేర్చి చేశాను. ఈ పరమాన్నం రంగు రుచి రూపం అన్నీ ఎంతో గొప్పగా ఉంటాయ్.

గోధుమ పాయసం/పరమన్నం రెసిపి చేసే ముందు కింద టిప్స్ ఒక సారి చదివి చేయండి.

Wheat Kheer recipe | Paramannam | Godhuma payasam | Payasam Recipe

టిప్స్

గోధుమ రవ్వ:

• తెలుగు రాష్ట్రాలలో గోధుమ రవ్వ పేరుతో కార్న్ రవ్వ అమ్ముతుంటారు, దానికన్నా నిజమైన గోధుమ రవ్వ ఎంతో రుచిగా ఉంటుంది. గోధుమ రవ్వ అంటే ఎర్రగా ఉండాలి. ఎర్ర గోధుమ రవ్వ అని అడిగితే ఇస్తారు.

బెల్లం:

• ఒకటికి 2 బెల్లం సరిపోతుంది నచ్చితే ఇంకొంచెం పెంచుకోవచ్చు. నేను ¾ కప్పు కి 1.5 కప్పు బెల్లం ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేశాను.

పాయసం విరిగిపోకుండా ఉండాలంటే?

• ముందు పాలల్లో గోధుమ పూర్తిగా మెత్తగా ఉడికిపోవాలి అప్పుడు బెల్లం వేసినా పాయసం విరగదు.

కుంకుమపువ్వు:

• ఈ రెసిపీలో నేను సువాసన మాంచి రంగు కోసం కుంకుమపువ్వు వాడాను, నచ్చితే కుంకుమపువ్వు కి బదులు పచ్చకర్పూరం కూడా వాడుకోవచ్చు.

పాయసం/పరమాన్నం రుచిగా రావాలంటే?

• పరమాన్నం నెయ్యిలో నిదానంగా సన్నని సెగ మీద ఉడికితే, బెల్లంతో కలిసిన నెయ్యి మాంచి రంగు రుచినిస్తుంది.

Wheat Kheer recipe | Paramannam | Godhuma payasam | Payasam Recipe

గోధుమ పరమాన్నం - రెసిపీ వీడియో

Wheat Kheer recipe | Paramannam | Godhuma payasam | Payasam Recipe

Prasadam | vegetarian
  • Soaking Time 30 mins
  • Cook Time 40 mins
  • Total Time 1 hr 10 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 3/4 cup గోధుమ రవ్వ
  • 1.5 cups + 2 tsp బెల్లం
  • 1/4 cup నీళ్ళు (పాకం కరిగించడానికి)
  • 1/2 liter పాలు
  • 1 1/2 cup నీళ్ళు
  • కుంకుమ పువ్వు – చిటికెడు
  • 4 దంచిన యాలకలు
  • 1/4 tsp జాజికాయ పొడి
  • 4 పండు/ ఎండు ఖర్జూరం
  • 2 tbsp జీడిపప్పు/బాదం పలుకులు
  • 6 tbsps నెయ్యి

విధానం

  1. గోధుమ నూకని కడిగి 30 నిమిషాలు నానాబెట్టాలి .
  2. బెల్లం లో కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం కరిగి ఒక పొంగువచ్చాక దింపి చల్లారబెట్టాలి .
  3. పాలు పోసి ఒక పొంగురానిచ్చి, 30 నిమిషాలు నానబెట్టిన గోధుమ నూక వేసి, నీళ్ళు పోసి బాగా కలిపి మూతపెట్టి మెత్తగా ఉడికించాలి.
  4. గోధుమ నూక మెత్తగా ఉడికిన తరువాత అందులో పండిన ఖర్జూరం, బాదాం పలుకులు, యాలకలు, జాజికాయ పొడి వేసి 3-4 నిమిషాలు ఉడికిస్తే పూర్తిగా దగ్గరపడుతుంది.
  5. ఉడికిన గోధుమ నూకలో బెల్లం పాకాన్ని వడకట్టి పాయసంలో కలిపి కొద్దిగా నెయ్యి కుంకుమపువ్వు వేసి బాగా కలిపి నెయ్యి పైకి తేలేదాకా ఉడికించాలి
  6. నెయ్యి పైకి తేలాక మళ్ళీ 2 tbsp నెయ్యి వేసి కలిపితే 4-5 నిమిషాలకి నెయ్యి పైకి తేలుతుంది. ఆఖరుగా మళ్ళీ మిగిలిన నెయ్యి వేసి కలిపి 3 నిమిషాలు ఉడికిస్తే నెయ్యి పైకి తేలుతుంది అప్పుడు దించేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • B
    Bhuvana
    Recipe Rating:
    Haiii teja garu I am huge fan of you.i like your all recepies and very easy and super taste.iam made it when your all repepies. And all the best for made by so many items.
Wheat Kheer recipe | Paramannam | Godhuma payasam | Payasam Recipe