ఇడ్లీ అనగానే మినపప్పు, ఇడ్లీ రవ్వ లేదా బియ్యం నానబెట్టి చేస్తాము. ఆ ఇడ్లీ తయారీ విధానం అందరికీ తెలిసినదే. ఈ ఇడ్లీ బియ్యం రవ్వతో చేస్తాము, మామూలు ఇడ్లీ మాదిరి మెత్తగా వెన్నలా ఉంటాయ్. చాలా తక్కువ సమయం తయారావుతాయ్.

ఒక్కోరోజు పొద్దున్నే ఏమి టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తుంటారు అప్పుడు ఈ ఇస్టంట్ ఇడ్లీ రెసిపి చేయండి చాలా బాగుంటుంది.

Instant Spongy Idli Recipe (no soaking-no fermentation) | How to make Spongy Idly

టిప్స్

  1. బియ్యం రవ్వ: బియ్యం రవ్వ కాస్త సన్నని రవ్వ ఉంటే ఇడ్లీ బాగుంటుంది. మార్కెట్స్ లో రవ్వ కాస్త లావుగా ఉంటుంది. అలా లావుగా ఉండే రవ్వ దొరికితే మిక్సీ చేసి బొంబాయ్ రవ్వ కంటే కాస్త లావుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది

  2. పుల్లని మజ్జిగ: మజ్జిగ పుల్లగా ఉంటే ఇడ్లీ రుచి బాగుంటుంది. పుల్లని మజ్జిగ లేనట్లైతే మజ్జిగలో కాస్త నిమ్మరసం పిండుకోండి

  3. పల్చని అటుకులు: పల్చని అటుకులు మజ్జిగలో బాగా నాని మెత్తని గుజ్జులా అవ్వాలి. అవసరమైతే మిక్సీ వేసుకోండి.

  4. పిండి వేసిన ఇడ్లీ స్టాండ్ మరుగుతున్న నీళ్ళలో ఉంచి మూతపెట్టి 5 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద 2 నిమిషాలు లో-ఫ్లేమ్ మీద స్టీమ్ చేసి 2 నిమిషాలు స్టవ్ ఆపేసి ఆ తరువాత తీసుకుంటే విరగకుండా వస్తాయ్.

  5. ఈ ఇడ్లీ వేడి మీద రుచిగా ఉంటాయ్

స్పాంజి రైస్ ఇడ్లి - రెసిపీ వీడియో

Instant Spongy Idli Recipe (no soaking-no fermentation) | How to make Spongy Idly

Breakfast Recipes | vegetarian
  • Prep Time 3 mins
  • Cook Time 15 mins
  • Resting Time 45 mins
  • Total Time 1 hr 3 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup పల్చని అటుకులు
  • 1.5 cup బియ్యం రవ్వ
  • 1 liter పుల్లని మజ్జిగ
  • 1/2 tsp వంట సోడా
  • ఉప్పు

విధానం

  1. పల్చని అటుకులలో పుల్లని మజ్జిగ పోసి 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత మెత్తగా మెదుపుకోవాలి లేదా మిక్సీ వేసుకోండి .
  2. మెత్తగా గుజ్జులా మెదుపుకున్న అటుకులలో బియ్యం రవ్వ, సోడా, ఉప్పు తగినంత పుల్లని మజ్జిగ పోసి ఇడ్లీ పిండి అంత గట్టిగా కలుపుకుని పక్కనుంచుకోండి .
  3. 30 నిమిషాల తరువాత మజ్జిగలో నానిన రవ్వని పుల్లని మజ్జిగతో ఇడ్లీ పిండి మాదిరి పలుచన చేసుకోండి .
  4. ఇడ్లీ ప్లేట్స్ లో కాస్త నెయ్యి రాసి పిండి వేసి 5 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద 2 నిమిషాలు లో- ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసి 3 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి . ఆ తరువాత ఇడ్లీ తీసుకోండి.
  5. ఈ ఇడ్లీ పల్లీల చట్నీ, సాంబార్, అల్లం పచ్చడి దేనితో అయినా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

Instant Spongy Idli Recipe (no soaking-no fermentation) | How to make Spongy Idly