హోటల్ స్టైల్ పూరీ కర్రీ

పూరీకి కూర అంటూ ప్రేత్యేకంగా దక్షిణ భారత దేశమంతటా ఉన్నా, రాష్ట్రానికి ఒక్కో తీరుగా చేస్తారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే భిన్నంగా చేస్తారు. తెలంగాణాలో గరం మసాలా, అల్లం వెల్లులి వేస్తారు. ఆంధ్రులు వేయారు. ఇలా చిన్న మార్పులతోనే ఎన్నో రకాలుగా ఉన్నాయ్ పూరీ కూరలు.

నేను ఆంధ్రా స్టైల్ పూరీ కూర చెప్తున్నా. ఇది పక్కా హోటల్ స్టైల్. ఈ స్టైల్లో చేసే పూరీ కూర చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్

ఉల్లిపాయలు:

  1. పూరీ కూరకి ఉల్లిపాయలు పొడవుగా చీరుకోవాలి. సన్నగా తరిగితే కూరలో కలిసిపోతాయ్.
  2. ఉల్లిపాయలు కూరలో కొద్దిగా మెత్తబడేదాకా మగ్గించాలి. మరీ మెత్తగా ఉడికిస్తే తినేప్పుడు రుచిగా ఉండదు.

బంగాళాదుంప:

నేను ఈ కూరలో ఆఖరున ఉడికించిన బంగాళాదుంప చిదిమి వేశాను. ఇది ఆప్షనల్. దుంప వేస్తే ఒక రుచి వేయకపోతే మరో రుచి.

నిమ్మరసం:

కూర పూర్తిగా తయారయ్యాక 1 tsp నిమ్మరసం వేశాను. ఇది ఆప్షనల్. నిమ్మరసం చాలా కొద్దిగా వేయాలి, ఏ మాత్రం ఎక్కువైనా ఫ్లేవర్స్ని డామినేట్ చేస్తుంది.

కొత్తిమీర:

సహజంగా నేను కొత్తిమీర వేయను, నచ్చితే మీరు వేసుకోవచ్చు.

శెనగపిండి:

శెనగపిండి గడ్డలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఆ తరువాత కూరలో వేసి బాగా కలిసే దాకా కలపాలి. శెనగపిండి పల్చగా లేకపోతే ఉడుకుతున్న కూరలో గడ్డలుగా ఉండిపోతుంది.

కూర చిక్కగా అయిపోతే:

శెనగపిండి కారణంగా కూర చిక్కబడిపోతుంది. కూర కాస్త పల్చగా ఉండగానే దింపేసుకోవాలి. ఒకవేళ కూర చిక్కగా అనిపిస్తే ఎప్పుడైనా వేడి నీళ్ళు పోసి సరిచేసుకోవచ్చు.

హోటల్ స్టైల్ పూరీ కర్రీ - రెసిపీ వీడియో

Hotel Style PURI CURRY | Poori Masala Recipe | How to make Poori Curry

Breakfast Recipes | vegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 2 tsps నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1 tsp శెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1 రెబ్బ కరివేపాకు
  • 2 ఎండు మిర్చి
  • 250 gms పొడవుగా చీరుకున్న ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిర్చి
  • ఉడికించిన చిన్న బంగాళా దుంప
  • 1 tsp అల్లం తరుగు
  • 1 tsp నిమ్మరసం
  • 2 tsp శెనగపిండి
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • 1/2 cup నీళ్ళు
  • 1/2 liter కూర ఉడికించడానికి నీళ్ళు

విధానం

  1. ముకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒక దాని వెంట మరొకటి వేస్తూ ఎర్రగా వేపుకోవాలి.
  2. పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు , పసుపు వేసి ఉల్లిపాయాలని 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద వేపుకోండి.
  3. ½ లీటర్ నీళ్ళు ఉప్పు వేసి మూతపెట్టి ఉల్లిపాయ మెత్తబడే దాకా ఉడకనివ్వాలి.
  4. మెత్తబడిన ఉల్లిపాయాల్లో శెనగపిండి లో గడ్డలు లేకుండా నీళ్ళు పోసుకుంటూ కలిపి కూరలో పోసుకోవాలి, ఇంకా అల్లం తరుగు కూడా వేసి కలుపుకోవాలి.
  5. శెనగపిండి కూరలో కలిసిపోయాక, ఒక బంగాళా దుంప కూరలో చిదిమి వేసుకోవాలి.
  6. 2 నిమిషాలు కూర ఉడికాక స్టవ్ ఆపేసి నిమ్మరసం వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

8 comments

  • R
    Rama
    Recipe Rating:
    Super recipe
  • H
    Hemanth
    Recipe Rating:
    Corrections and Suggestions: Black pepper, incorrectly translated for urad dal during the tempering stage. Like in the video, it would be appreciated if ingredients are added in a particular order and at a particular time. For example "after sauteing for 2 mins, add curry leaves" instead of merely saying "one after the other".
  • C
    C veena
    Recipe Rating:
    Your recipies are too good sir thank you for everything yesterday I made coriander chicken curry I turned out very well so delicious....I like your food recepies a lot...
  • A
    AHALYA
    Recipe Rating:
    IN 5 YEARS BACK I KNOW COOKING BUT I DONT KNOW HOW TO COOK VERY TASTY . FROM LOCKDOWN TIME ONWARDS I AM WATCHING YOUR VIDEOS BEFORE COOKING FOR TIPS . NOW I AM PERFECT IN COOKNG THANK U TEJA GARU
  • T
    Triveni
    Recipe Rating:
    Nenu me recipes anni chustanu... Chesi tinamu kuda.... And anna me recipes amrutham la untaie ♥😋
  • B
    Bethu Manjusha
    Recipe Rating:
    Mee style curry super. Nenu yeppudu chesina perfect ga vasthundhi. Thanks for the easy recipe
  • P
    Pranu
    Recipe Rating:
    Good recipe
  • S
    sooria
    thank you for guiding me.