“కేరళ స్పెషల్ అప్పం” రెసిపి అందరికీ ఎంతో ఇష్టం. ఇదే అప్పం రెసిపి కేరళ నుండి ఇతర దక్షిణ భారత రాష్ట్రాలన్నింటికి చేరింది. ఎవరి ప్రేత్యేకత వారిదే. అలాగే ఈ అప్పం రెసిపి కూడా నా పద్ధతి.

బెస్ట్ అప్పం అంటే అంచులు క్రిస్పీగా లోపల మృదువుగా మెత్తగా స్పాంజ్లా ఉండాలి. అప్పం ప్లేట్లో ఉంచితే బుట్టాలా నిలిచి ఉండాలి, అది పర్ఫెక్ట్ అప్పం. ఆలాంటి పర్ఫెక్ట్ అప్పంకి అడుగడుగునా చిట్టి చిట్కాలున్నాయ్. సహజంగా అప్పం కాస్ట్ ఐరన్ ముకుళ్లలో చేస్తే అంచులు కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఆలాంటి ముకుళ్ళు లేనట్లైతే స్టీల్ కొట్లలో నాన్ స్టిక్ అప్పం చట్టి దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు. నాన్-స్టిక్ అప్పం చట్టితో ఎంతో సులభంగా అంటుకోకుండా వచ్చేస్తాయ్ అప్పం. నేను ఈ రెసిపిలో ఈ రెండూ కాకుండా హార్డ్ ఆనాడైసడ్ తాళింపుల చట్టితో చేశాను. అందులో కూడా పర్ఫెక్ట్ బుట్టాలా వచ్చింది అప్పం.

అప్పం రకకాలుగా చేస్తారు, కొందరు పిండిలో బియ్యం గంజి పోసి పులియబెట్టి చేస్తారు, ఇంకొందరు ఈస్ట్ వేస్తారు, కేరళలో కల్లుతో చేయడం కూడా చూశాను. వేసే పదార్ధాలు, పులియబెట్టే తీరు, వాతావరణం వీటన్నింటి బట్టే అప్పం రుచి ఆధారపది ఉంది.

ఈ రెసిపిలో పిండి రుబ్బడం దగ్గరనుండి, పులియబెట్టడం దాకా అన్నీ ఎంతో వివరంగా ఎన్నో టిప్స్ ఉన్నాయ్.

అప్పం పలుచని కొబ్బరి పాలుతో , ఘాటైన కుర్మాతో ఇంకా వెజిటేబుల్ స్టుయుతో ఇంకా బాగుంటుంది.

Best Appam recipe |  Appam batter recipe | 100 % Best Kerala Appam

టిప్స్

పర్ఫెక్ట్ అప్పం పిండి:

  1. బియ్యాన్ని బాగా కడిగి నిదానంగా మెత్తగా వెన్నలా రుబ్బుకోవాలి. మిక్సీలో అయితే 2-3 సార్లుగా పప్పు వేసుకుంటూ మెత్తగా ఎక్కువ సేపు రుబ్బుకోవాలి. పిండి ఎంత మెత్తగా మెదిగితే అంత పర్ఫెక్ట్ అప్పం వస్తుంది.

  2. అప్పం స్టోన్ గ్రైండర్లో రుబ్బితే మిక్సీలో రుబ్బిన దానికంటే చాలా బాగా వస్తుంది.

  3. పిండిని కావాలంటే కొబ్బరి పాలు పోసి కూడా రుబ్బుకోవచ్చు, కానీ దానికి కొద్దిగా అనుభవం అవసరం. అందుకే ముందు నేను నీళ్ళతో రుబ్బి తరువాత కొబ్బరి పాలు పోసి పలుచన చేశాను.

పిండి పులియబెట్టడానికి టిప్స్:

  1. అప్పం పిండి కనీసం 16 గంటలు పులవాలి. చలికాలంలో అయితే ఇంకాస్త ఎక్కువగా పులవాలి. సమయం అన్నది చలి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

  2. చలి ప్రేదేశాల్లో ఉండే వారు 20 గంటలు అంతా కంటే ఎక్కువగా పులియబెట్టాల్సి రావొచ్చు.

  3. పిండి పులిశాక వంట సోడా ఇంకా తాగే సోడా కలిపి పలుచన చేసుకుంటే అప్పం చక్కగా పొంగుతుంది.

  4. అప్పంకి పిండి జారు చాలా ముఖ్యమైనది, వేలు పిండి లో ముంచి పైకి లేపితే 1-10 అంకెలు లెక్కబెట్టేలోగా ఆఖరి బొట్టు వెలునుండి జారాలి.

అప్పం కాల్చే తీరు:

  1. అప్పం చట్టి బాగా వేడి చేయాలి, బాగా వేడెక్కిన తరువాత పెద్ద గరిటెడు పిండి పోసి చట్టి అంచుల దాకా నిదానంగా తిప్పుతూ, మొదటికి తీసుకొచ్చి కలిపి వదిలేస్తే, మిగిలిన పిండి చట్టి మధ్యకి చేరి ముద్దగా అవుతుంది. ఆ ముద్ద రుచి చాలా రుచిగా ఉంటుంది.

  2. చట్టీ బాగా వేడిగా ఉంటే పిండి తిప్పుతున్నప్పుడు చుయ్ మని అంటుకుంటుంది. వేడిగా లేకపోతే పిండి జారిపోయి సరైన షేప్ రాదు

  3. చట్టిలో పోసిన పిండి చుట్టూ ఒకేసారి తిప్పాలి .

  4. పిండి తిప్పాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు కాలనిస్తే అంచులు విడిపడి అప్పం చేత్తో లాగినా వచ్చేస్తుంది.

  5. రెండో అప్పం వేసేప్పుడు నూనె రాసిన గుడ్డతో రుద్ది అప్పం వేసుకోవచ్చు.

  6. హార్డ్ ఆనాడైసడ్ తాళింపుల చట్టీలో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. కానీ, మొదటి సారి చేస్తున్నప్పుడు మూడవ అప్పం సరిగా రావొచ్చు. కొత్త తాళింపుల చట్టీ అయితే బాగా సీసన్ చేశాక తప్పక వస్తుంది.

Best Appam recipe |  Appam batter recipe | 100 % Best Kerala Appam

అప్పం రెసిపి - రెసిపీ వీడియో

Best Appam recipe | Appam batter recipe | 100 % Best Kerala Appam | How to Make Appam

Breakfast Recipes | vegetarian
  • Prep Time 30 mins
  • Cook Time 30 mins
  • Total Time 1 hr
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup ఉప్పుడు బియ్యం /ఇడ్లీ బియ్యం
  • 2 cup దోసల బియ్యం / రేషన్ బియ్యం
  • 1 tbsp మినపప్పు
  • 1/2 tsp మెంతులు
  • 1/2 cup పచ్చి కొబ్బరి
  • 80 ml కొబ్బరి పాలు
  • 1 tbsp పంచదార
  • ఉప్పు
  • 1/2 tsp బేకింగ్ సోడా / వంట సోడా
  • 100 ml తాగే సోడా

విధానం

  1. దోశల బియ్యం , ఉప్పుడు బియ్యం, మినపప్పు , మెంతులు వేసి బాగా కడిగి ఐదు గంటలు నానబెట్టుకోండి .
  2. నీళ్ళని వడకట్టుకుని బియ్యాన్ని వేసి నీళ్ళతో మెత్తగా వెన్నలా రుబ్బుకోవాలి (రుబ్బుకోవడం టిప్స్ చూడగలరు ).
  3. రుబ్బుకున్న పిండిలో పంచదార, ఉప్పు , కొబ్బరి పాలు పోసి కలిపి 16 గంటలు పులియబెట్టాలి .
  4. గ్లాస్లో వంట సోడా, తాగే సోడా పోసి కలపాలి.
  5. పులిసిన పిండిలో సగం పిండి తీసుకోండి. అందులో సోడా పోసి కలపాలి. పిండిలో వేలు ముంచి పైకి లేపితే 1-10 లెక్కపెట్టేలోగా ఆఖరి బొట్టు జారాలి .
  6. పిండిని బాగా వేడెక్కిన చట్టిలో పోసి నిదానంగా అంచులదాక తిప్పి మూతపెట్టి మీడియం- ఫ్లేమ్ మీద కుక్ చేయాలి (పిండి చట్టిలో తిప్పే టిప్స్ చూడగలరు).
  7. 3 నిమిషాలకి అప్పం చట్టి నుండి వచ్చేస్తుంది.
  8. వేదివేడిగా పంచదార కలిపిన పలుచని కొబ్బరి పాలతో లేదా కారం కరంగా ఉండే కుర్మాతో తృప్తిగా తినండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • H
    Hemasundara
    Recipe Rating:
    Nice recipe
  • V
    Veena Kasu
    Recipe Rating:
    Lovely Teja garu !🙏I am biggest fan of your recipes .. thank you very much
  • K
    Kasu Veena
    Recipe Rating:
    Lovely Teja garu ! I am biggest fan of your recipes 🙏👏👏👏👏👍
  • J
    Janani muthukrishnan
    చాలా బాగా ఉన్నారు
  • S
    SEETHASELVAN
    Recipe Rating:
    Good receipe....
Best Appam recipe |  Appam batter recipe | 100 % Best Kerala Appam