స్వీట్ కార్న్ స్టఫ్ చేసిన పరోటా

ఈ రెసిపిలో పరోటా పగిలిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి లాంటి టిప్స్తో పాటు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో వీడియోతో వివరంగా ఉంది చూడండి.

పరాటా రెసిపీ లంచ్ బాక్సులకి డిన్నర్లకి పర్ఫెక్ట్. జస్ట్ కమ్మని పెరుగు కాస్త పచ్చడి ఉంటే చాలు. ఏ స్పెషల్ కూరలు అవసరం లేదు. టిప్స్ పాటిస్తూ పరాట చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గంటల తరువాత కూడా రెండు వేళ్ళతో తుంచి తినేంత మెత్తగా ఉంటాయ్.

స్టఫ్ చేసి చేసే పరోటా అందరికీ ఎంతో ఇష్టం, ఎన్నో రకాలుగా స్టఫ్ చేసి పరోటాలు చేస్తుంటాం, అలాగే స్వీట్ కార్న్ పరోటా కూడా. స్వీట్ కార్న్ పరోటా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీలో సహజంగా పరోటాలు ఎందుకు విరుగుతాయ్, స్టఫ్ఫింగ్ బయటకి రాకుండా ఎలా చేయాలి లాంటి టిప్స్ అన్నీ ఉన్నాయ్ చూడండి.

Sweet corn Parotta | Stuffed Paratha | How to make Soft layered Parota

టిప్స్

  1. గోధుమ పిండి: పరోటాలు గోధుమపిండి మైదా పిండి రెండింటితోనూ చేయవచ్చు. కమర్షియల్గా చేసే వారు రుచి కోసం మైదా వాడతారు. వేడి మీద చాలా రుచిగా ఉంటాయ్ మైదా వాడితే. ఆరోగ్యంగా కావాలంటే గోధుమ పిండి వాడుకోవచ్చు. గోధుమపిండి వాడితే చల్లరినా మెత్తగా ఉంటాయి, అదే మైదాతో చేసిన పరోటా సాగుతుంది.

  2. పరోటా పగలకుండా ఉండాలంటే: పరోటా పిండి తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా వత్తుకోవాలి. పిండి పగుళ్లు లేకుండా మృదువుగా అయ్యేదాక ఎక్కువ సేపు వత్తుకోవాలి. గోధుమ పిండి గట్టిగా ఉంటే పరోటా వత్తుతున్నప్పుడు లోపలి స్టఫ్ఫింగ్ పగిలి బయటకి వచ్చేస్తుంది.

  3. పరోటా వేడి పెనం మీద వేసి రెండు వైపులా కాస్త కాలనిచ్చి ఆ తరువాత నూనె వేసి కాలిస్తే పర్ఫెక్ట్గా కాలతాయ్.

స్వీట్ కార్న్ స్టఫ్ చేసిన పరోటా - రెసిపీ వీడియో

Sweet corn Parotta | Stuffed Paratha | How to make Soft layered Parota

Rotis Paratha | vegetarian

కావాల్సిన పదార్ధాలు

  • స్టాఫ్ఫింగ్ కోసం
  • 1 cup స్వీట్ కార్న్
  • 3 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • చిన్న కట్ట కొత్తిమీర
  • 1/4 tsp వాము
  • 1/2 అల్లం
  • 3 వెల్లూలీ (ఆప్షనల్)
  • 2 tsp ఉల్లిపాయ
  • 2 tsp నూనె
  • 1/2 tsp జీలకర్ర
  • ఇంగువా – చిటికెడు
  • 1 tsp నిమ్మకాయ రసం
  • పిండి కోసం
  • 2 cups గోధుమ పిండి
  • 2 tsp నూనె
  • ఉప్పు
  • నీళ్ళు తగినన్ని
  • నూనె పరాటాలు కాల్చుకోడానికి

విధానం

  1. గోధుమ పిండిలో మిగిలిన సామానంతా వేసి పిండిని మెత్తగా ఎక్కువసేపు వత్తుకుని సమానంగా బాల్స్ చేసి తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నానాబెట్టాలి.
  2. మిక్సీలో స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లులి, వాము వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. పాన్లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఇంగువ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా ఫ్రై చేసుకోవాలి.
  4. మెత్తబడిన ఉల్లిపాయాలో స్వీట్ కార్న్ పేస్ట్ వేసి చెమ్మారే దాకా కలుపుతూ ముద్ద చేసుకుని తీసి పూర్తిగా చల్లార్చుకోవాలి.
  5. నానిన పిండి ముద్దని మళ్ళీ వత్తుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత స్వీట్ కార్న్ ముద్ద ఉంచి అంచులని సీల్ చేసుకోవాలి.
  6. స్టఫ్ చేసిన పిండి ముద్ద పైన కాస్త పొడి గోధుమపిండి చల్లి లోపలి స్టఫ్ఫింగ్ని ముందు వేళ్ళతో అన్నీ వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి, తరువాత అప్పడాల కర్రతో నిదానంగా అన్నీ వైపులా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా రోల్ చేసుకుంటే పరాటాలు పగలకుండా వస్తాయ్.
  7. పెనం బాగా వేడెక్కిన తరువాత పరాట వేసి రెండు వైపులా కాలనిచ్చి పైన నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
  8. క్రిస్పీగా కాలిన పరాటాలు వేడిగా చల్లని పెరుగు, ఆవకాయ పచ్చడితో చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • M
    Mounika
    Recipe Rating:
    Fabulous..
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Swargam lo unna feeling in every bite.
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Amogham! Vanta gurunchi basics teliyani person ni nenu. Inta adnhutamga nenu chesanante i can’t believe it myself. Thanks allots Mr. TEJA for your sharing and continuous efforts the styles of cooking methods also researches.
Sweet corn Parotta | Stuffed Paratha | How to make Soft layered Parota