మెత్తగా ఉడికించిన పప్పుతో లేదా మిగిలిపోయిన పప్పులో గోధుమపిండి కలిపి చేసే పరాటా టిఫిన్కి లంచ్కి డిన్నర్కి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్. ఈ సింపుల్ దాల్ పరాటా లంచ్ బాక్సులకి, బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్.

ఈ సింపుల్ దాల్ పరాటా రెసిపీకి కమ్మని చల్లని పెరుగు ఆవకాయ లేదా పుదీనా పచ్చడి నంజుకుంటూ తింటే చాలా రుచిగా ఉంటుంది.

సాధారణంగా దాల్ పోరాట అంటే పచ్చిశెనగపప్పుని ఉడికించి మసాలాలు కలిపి గోధుమ పిండిలో స్టఫ్ చేసి చేసే పరాటా. కానీ పప్పుని గోధుమ పిండిని పప్పులో కలిపి చేసే పరాటా గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తుంటారు. నేను వారి దాల్ పరాటా ఇన్స్పిరేషన్తో చేస్తున్న రెసిపీ ఇది.

నేను చేస్తున్న దాల్ పరాటా దక్షిణాది వారికి నచ్చే తీరులో ఉంటుంది. దాల్ పరాటా రెండు తిన్నా చాలు పొట్ట నిండిపోతుంది.

దాల్ పరాటా రెసిపీ నేను చేస్తున్న తీరుతో పాటు మరెన్నో తీరులో చేసుకోవచ్చు అవన్నీ నేను కింద టిప్స్లో రాసి ఉంచాను చుడండి.

Dal Parata recipe with Leftover dal | Dal Paratha | Dal Chapathi

టిప్స్

పప్పు:

నేను ¼ కప్పు కందిపప్పు ని మెత్తగా ఉడికించి నీటిని వడకట్టి ఎనిపిన పప్పు సుమారుగా 1. కప్పులు అవుతుంది అది వాడాను. మీరు ఇక్కడ కందిపప్పుకి బదులు ముడిపెసలు, పెసరపప్పు, పచ్చిశెనగపప్పు కూడా ఉడికించి ఎనిపి వాడుకోవచ్చు.

మిగిలిపోయిన పప్పుని ఎలా వాడాలి:

  1. చాలా సార్లు ఏ కాయా కూరో వేసి చేసిన పప్పు మిగిలిపోతుంది. అలాంటప్పుడు పప్పులో ఉండే తాళింపులు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు తీసేసి వాడుకోవచ్చు.

  2. పప్పు గోధుమపిండిలో వేసాక పిండికి సరిపోను ఉప్పుతో పాటు తిన్నది త్వరగా తిరగడానికి కొద్దిగా వాము వేసుకోండి.

ఇంకొన్ని టిప్స్:

  1. ఉడికించిన పప్పులోని నీరు ని వడకట్టి పప్పుని ఎండుపుకుంటే పిండిలో కలిపాక ఎంత నీరు అవసరం అవుతుంది అనేది అర్ధమవుతుంది. నీరుతో సహా పోస్తే నీటికి తగినట్టుగా గోధుమపిండి కలుపుకోవాల్సి వస్తుంది.

  2. ఈ పరాటా పొరలు వేసి చేస్తే చాలా బాగుంటుంది. అందుకే పొరపొరలోను నూనె పూసుకుంటూ మడతలు వేసి చతురస్రాకారంలోకి లేదా మీకు నచ్చిన తీరులో వత్తుకోవచ్చు.

  3. అల్లం వెల్లూలి పూర్తిగా ఆప్షనల్

దాల్ పరాటా - రెసిపీ వీడియో

Dal Parata recipe with Leftover dal | Dal Paratha | Dal Chapathi

Breakfast Recipes | vegetarian
  • Prep Time 20 mins
  • Cook Time 30 mins
  • Resting Time 15 mins
  • Total Time 1 hr 5 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/4 cup మెత్తగా ఉడికించిన కందిపప్పు - 1.5 కప్పులు అవుతుంది సుమారుగా
  • 2 cups గోధుమపిండి
  • ఉప్పు
  • పసుపు
  • 1/4 tsp నలిపిన వాము
  • 1/4 tsp నిలిపిన జీలకర్ర
  • 1/2 tsp కారం
  • 1/2 tsp వేపిన జీలకర్ర పొడి
  • 1 tsp సన్నని అల్లం తురుము
  • 1 tsp సన్నని వెల్లులి తరుగు
  • 1 tsp నూనె
  • కొత్తిమీర - కొద్దిగా
  • 1 tsp పచ్చిమిర్చి పేస్ట్
  • నీళ్లు తగినన్ని
  • నూనె పరోటా కాల్చుకోడానికి

విధానం

  1. గోధుమ పిండిలో పదార్ధాలన్నీ వేసి మెత్తగా వత్తి 15 నిమిషాలు పక్కనుంచుకోండి.
  2. నానిన పిండి ముద్దని సమానంగా ఉండలు చేసుకోండి.
  3. చేసుకున్న ఉండలని కాస్త మందంగా వత్తి పైన కొద్దిగా నూనె పూసి మడతలు వేసి చతురస్రాకారంలోకి వత్తుకోండి.
  4. వత్తుకున్న రోటీని వేడి పెనం మీద వేసి ముందు రెండు వైపులా కాలనివ్వాలి. రెండు వైపులా కాలిన తరువాత రెండు వైపులా నూనె వేస్తూ ఎర్రగా కాల్చి తీసుకోవాలి.
  5. ఈ దాల్ పరోటా కమ్మని చల్లని పెరుగు పుదీనా పచ్చడి లేదా ఆవకాయతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Dal Parata recipe with Leftover dal | Dal Paratha | Dal Chapathi