కొర్రల పొంగలి | అందరికి ఆరోగ్యకరమైన కట్టే పొంగలి
సంప్రదాయమైన పద్ధతిలో మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కొర్ర పొంగల్. పోషకాలతో నిండిన చిరుధాన్యాలతో చేసే సింపుల్ పొంగల్ రెసిపీ కొర్రా పొంగల్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
ఆరోగ్యానికి ఎన్నో పోషకాలతో కూడుకున్న చిరుధాన్యాలు మేలు అంతా ఇంతా కాదు. ఈ మధ్య back to basics అని వెనుకటి రుచులని వెతుక్కుంటున్నారు. అలా ప్రస్తుతం బియ్యంతో, మైదా తో తింటున్న ప్రతీ రెసిపీ మిల్లెట్స్ లోకి మారిపోయింది.
కొర్ర పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. బియ్యంతో చేసే పొంగల్ రుచికి ఎంత మాత్రం తక్కువ కాదు. ఇంకా ఆరోగ్యం కూడా. పసి పిల్లల దగ్గరనుండి పెద్ద వారి వరకు మంచిది ఎంతో మేలు చేస్తుంది.
బియ్యం తో వండే పొంగల్ తిన్నక కాస్త మత్తుగా అనిపిస్తుంది. కానీ కొర్రలతో చేసే పొంగల్ తిన్నాక మత్తుగా అనిపించదు, పొట్టకి హాయిగా ఉంటుంది. డిన్నర్ గా, లంచ్ కి, బ్రేక్ ఫాస్ట్ కి ఎలాగైనా తినొచ్చు చాలా బావుంటుంది.
బెస్ట్ పొంగల్ కి ఈ సింపుల్ టిప్స్ తెలియడం అవసరం:

టిప్స్
కొర్రలు:
-
వీటినే ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు. కొర్రలని వండడానికి కనీసం మూడు గంటలు నానాబెట్టాలి. అప్పుడే గింజ లోపలి దాకా ఉడికి మృదువుగా ఉంటుంది పొంగల్.
-
కొర్రలలో పీచు పదార్ధం చాలా ఎక్కువ ఇంకా గ్లూటెన్ ఫ్రీ కూడా. అందుకే కొర్రలు చల్లారే కొద్దీ బిరుసుగా అయిపోతుంది. కాబట్టి కొర్రల పొంగల్ వండేప్పుడు ఎసరు కాస్త ఎక్కువ పోసుకోండి
-
కొర్ర పొంగల్ వేడి మీద చాలా రుచిగా ఉంటుంది. చల్లారే కొలది బిరుసుగా అవుతుంది. కానీ కనీసం 6 గంటలు లేదా రాత్రంతా నానిన కొర్రలతో వండిన పదార్ధాలు గంటల తరువాత కూడా మృదువుగా ఉంటాయ్.
-
లంచ్ బాక్సులకి తీసుకెళ్ళే వారు కాస్త పలుచుగా చేసుకుంటే లంచ్ టైమ్ కి కూడా మెత్తగానే ఉంటుంది.
నెయ్యి:
నెయ్యి నేను పరిమితంగా వేశాను, మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు.
పెసరపప్పు:
నేను పొట్టు తీసిన పెసరపప్పు వాడాను, కావాలనుకుంటే నానబెట్టిన పెసలు కూడా వాడుకోవచ్చు.
ఎసరు:
పొంగల్లో కాస్త నీరు ఎక్కువగా అనిపిస్తే హై ఫ్లేమ్ మీద మూత తీసి వండితే దగ్గర పడుతుంది.
కొర్రల పొంగలి | అందరికి ఆరోగ్యకరమైన కట్టే పొంగలి - రెసిపీ వీడియో
Foxtail Millet Pongal | Korra Pongal | Millet Pongal | Thinai Pongal Recipe | Korra Biyyam Pongal Recipe | Healthy Recipe
Prep Time 2 mins
Cook Time 30 mins
Total Time 32 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1 cup కొర్రలు
- 1 cup పెసరపప్పు
- 1 tsp మిరియాలు
- 2 రెబ్బలు కరివేపాకు
- 1/4 spoon ఇంగువ
- 1 tsp జీలకర్ర
- 10 - 15 జీడిపప్పు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 1/4 cup నెయ్యి
- ఉప్పు- తగినంత
విధానం
-
పెసరప్పు ని లో ఫ్లేం మీద మంచి సువాసనోచ్చెంత వరకు వేపుకుని చల్లార్చి, తరువాత నీళ్ళలో వేసి కడుక్కోండి. (ఇవి మంచి సువసనోచ్చెంత వరకు వేగడానికి 15 నిమిషాల టైం పడుతుంది).
-
ప్రెషర్ కుక్కర్ లో రాత్రంతా నానబెట్టిన కొర్రలు, పెసరప్పు, ఉప్పు వేసి, 5 కప్స్ నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4 విసిల్స్ రానివ్వండి.
-
4 విసిల్స్ తరువాతా ఇంకా పొంగల్ లో కాస్త నీరుంటుంది అది చల్లరేపాటికి గట్టి పడుతుంది.
-
ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకుని జీడిపప్పు తో పాటు మిగిలిన సామానంతా వేసి మంచి సువాసనోచ్చేదాక వేపుకుని పొంగల్ లో కలుపుకోండి.

Leave a comment ×
3 comments