రాగి ఇడియప్పం | ఇడ్లీ కంటే ఎన్నో రేట్లు మేలుచేసే రాగి ఇడియాప్పం

మీ ఉదయాన్ని ఆరోగ్యకరమైన ఆహారంతో మొదలెట్టాలంటే తమిళనాడు కేరళ స్పెషల్ “రాగి ఇడియప్పం” బెస్ట్! బెస్ట్ ఇంకా హెల్తీ టిఫిన్ “రాగి ఇడియాప్పం” రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది.

ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, తిన్న తరువాత పొట్టకి తేలికగా హాయినిచ్చే ఆహారం కావాలని అందరూ కోరుకుంటారు, ఆలాంటి వారికి రాగి ఇడియాప్పం సరైనది. పిల్లలకి నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో మంచిది.

తమిళనాడు, కేరళ ప్రాంతంలో దాదాపుగా ప్రతీ వీధిలో ఉండే బండ్ల దగ్గర ఇడ్లీ అట్టుతో పాటు ఇడియప్పం దొరుకుతుంది. నిజానికి దక్షిణభారత దేశ వాతావరణానికి సరైన ఆహారం “ఇడియప్పం”. అందరూ ఇడ్లీ ఎంతో తేలికైన ఆహారం అంటుంటారు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ, ఇడ్లీలో ముప్పావు భాగం పాలిష్ చేసిన బియ్యం ఉంది. దానితో పోలిస్తే రాగి ఇడియప్పం ఎన్నో రేట్లు మేలు చేస్తుంది.

ఎక్కువగా అందరూ ఇష్టపడేది, దొరికేది బియ్యం పిండితో చేసే ఇడియప్పం రెసిపీ. ఆ రెసిపీ నేను త్వరలో పోస్ట్ చేస్తా. కానీ రాగి పిండితో చేసే ఇడియప్పం బియ్యం పిండితో చేసే ఇడియప్పం కంటే ఎంతో మేలు.

రాగి ఇడియప్పం నేను చేసిన దానికంటే ఇంకా సులభమైన విధానాలతో చేయవచ్చు, కానీ ఎందుకో ఈసీ విధానాలతో నాకు సంప్రదాయ పద్ధతిలో చేసిన రుచి రాలేదు. అందుకే నేను వెనుకటి కోయంబత్తూర్లో నేను తిన్న నాకు ఎంతో నచ్చిన పద్ధతిలోనే చేస్తున్నాను.

ఇడియప్పంతో కమ్మని కొబ్బరి పాలు యాలకలపొడి వేసి కాచిన పాలు, లేదా మామూలు పాలతో సరైన జోడీ. నచ్చితే మసాలా కూర్మాలతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్

రాగి పిండి:

నేను మామూలు రాగి పిండి వాడాను, నచ్చితే మొలకకట్టిన రాగి పిండి కూడా వాడుకోవచ్చు.

నీళ్ళు:

రాగి పిండి- నీళ్ళు సమానం. వేడి నీళ్ళు పోస్తే పిండి త్వరగా ఉడుకుతుంది.

వత్తుకోవడం: ఉడికిన రాగి పిండి ముద్దని చేతులకి నూనె రాసుకుని ఎక్కువసేపు వత్తితేనే జిగురు ఉండని రాగిపిండిలో జిగురు ఏర్పడి, ఇడియప్పం విరగదు.

పాలు:

నేను పాలలో పంచదార యాలకలపొడి వేసి ఇడియప్పంలో పోసి తినడానికి ఇష్టపడతాను, మీరు కావలంటే కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు.

స్టీమ్:

  1. నేను అరిటాకు మీద స్టీమ్ చేశాను, ఉంటే చిల్లులుండే ఇడియప్పం ప్లేట్స్ మీద స్టీమ్ చేసుకోవచ్చు లేదా తడిపిన కాటన్ క్లాత్ మీద కూడా స్టీమ్ చేసుకోవచ్చు, ఇవేవీ లేకపోయినా ఇడ్లీ ప్లేట్స్లో చిన్న చిన్న ఇడ్లీల మాదిరి వత్తుకుని కూడా చేసుకోవచ్చు.

  2. రాగి ఇడియప్పం ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమ్ పడుతుంది. ఇంకా వేడి కడిపితే మీద విరిగిపోతుంది. కాబట్టి స్టీమ్ అయిన 5 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోండి.

రాగి ఇడియప్పం | ఇడ్లీ కంటే ఎన్నో రేట్లు మేలుచేసే రాగి ఇడియాప్పం - రెసిపీ వీడియో

Finger Millet Idiyappam | Ragi idiyappam | How to make Ragi Idiyappam | Ragi Nool Puttu | Ragi Noolappam

Breakfast Recipes | vegetarian
  • Prep Time 30 mins
  • Total Time 30 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 2 cups రాగి పిండి
  • 2 cups వేడి నీళ్ళు
  • 1.5 tbsp నెయ్యి
  • 1/4 tsp ఉప్పు
  • 1/2 liter పాలు
  • 3 tbsp పంచదార
  • 1/4 tsp యాలకలపొడి

విధానం

  1. రాగి పిండిలో నెయ్యి ఉప్పు వేసి వేళ్ళతో బ్రెడ్ పొడిలా అయ్యేదాక మర్దన చేయాలి.
  2. వేడి నీళ్ళు పోసి అట్ల పిండి జారుగా కలుపుకోవాలి
  3. కలుపుకున్న పిండిని పాన్లో పోసి కలుపుతూ ఉంటే ఉప్మాలా తయారవుతుంది.
  4. రాగి ముద్దని 5 నిమిషాలు చల్లార్చి, తరువాత చేతికి నూనె రాసుకుని 4-5 నిమిషాలు బాగా వత్తుకోవాలి. తరువాత చిన్న ఉండాలు చేసుకోవాలి
  5. కారప్పూస గిద్దకి నూనె రాసి అందులో సన్న కారప్పూస ప్లేట్ ఉంచి అందులో రాగి ముద్ద పెట్టి అరిటాకు లేదా నూనె రాసిన ప్లేట్ మీద ఒక చుట్టు చుట్టుకోండి.
  6. చుట్టుకున్న ఇడియప్పంని స్టీమ్ మీద 5 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద 3 నిమిషాలు లో-ఫ్లేమ్ మీద 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
  7. గిన్నెలో పాలు పోసి అందులో పంచదార వేసి ఒక పొంగు రానివ్వాలి, ఆఖరున ¼ tsp యాలకలపొడి వేసి కలిపి దింపేసుకోవాలి
  8. కాస్త చల్లారిన ఇడియప్పం ప్లేట్లోకి తీసుకుని వేడి పాలు 100 ml దాకా ఇడియప్పం అంతా పోసి తడుపుకోవాలి.
  9. పైన కొద్దిగా పంచదార, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము చల్లుకుని ఆనందించండి. నచ్చితే పాలకి బదులు కూర్మతో కూడా తినవచ్చు.
  10. పొద్దు పొద్దున్నే కమ్మని పాలతో రాగి ఇడియప్పం రుచి చాలా బాగుంటుంది. సాయంత్రాలు కుర్మాతో ఇంకా బాగుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • K
    Khyathi
    Recipe Rating:
    Chala bagundhi mee recipe Thank you ❤️😊