యెర్ర బియ్యం మిల్లెట్స్ అడై.

యెర్ర బియ్యం మిల్లెట్స్ నానబెట్టి ఎండుమిర్చి ఉప్పు వెల్లులి అల్లం వేసి బరకగా రుబ్బి మందంగా కారకరలాడేట్టు కాల్చి వేడి వేడిగా చట్నీ సాంబార్తో సర్వ్ చేస్తారు తమిళనాడు స్పెషల్ అడై.

చూడ్డానికి దోశ మాదిరి కనిపిస్తుంది కానీ రుచిలో చేసే తీరులో భిన్నత్వం ఉంది. అడైలు మందంగా పిండి ఇడ్లీ పిండి మాదిరి బరకగా ఉంటుంది, కాలాక కారకరలాడుతజూ ఉంటుంది. వేడి మీదే రుచిగా ఉంటుంది.

పదార్ధాలు మార్చి మార్చి అడైలు అనేక తీరుల్లో చేసుకోవచ్చు. ఒక్కో అడైకి ఒక్కో రుచి. ఏది ఏమైనా ప్రోటీన్ రుచి రెసిపీ. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో మాత్రమే ఎక్కువగా అడైలు చేసుకుంటారు. ఇవి మీకు తమిళనాడు గ్రామాలు టౌన్స్ వైపు వెళితే బండ్ల మీద అమ్మడం కనిపిస్తుంది. ఇంకా అడైల పిండి పులియబెట్టరు. పప్పు నానబెట్టి అప్పటికప్పుడే రుబ్బి పెనం మీద పోసి కాలుస్తారు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుమల్టీ గ్రైన్ అడై కారం పొడితో

ఈ సింపుల్ రెడ్ రైస్ మిల్లెట్ అడై పర్ఫెక్ట్గా రావడానికి ఇంకా ఏ తీరులో చేసుకోవచ్చో తెలియాలంటే కింద టిప్స్ చుడండి.

టిప్స్

పిండి:

  1. అడైల కోసం పిండి ఎప్పుడు కాసంత బరకగా చిక్కగా ఉండాలి. అట్టు పిండిలా మృదువుగా జారుగా ఉండరాదు. బరకగా ఉండే పిండి కాలిన తరువాత కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది.

పిండి నిల్వ ఉంచుకోవచ్చా:

  1. అడైల పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రెండో రోజుకే ఫ్రిజ్లో పెట్టినా పిండి పులిసిపోతుంది. కాబట్టి తక్కువగా రుబ్బుకుని ఏ రోజు పిండి ఆ రోజు ఆవఁజేసుకోవడం మేలు.

  2. పిండి మిగిలితే గుంట పుణుకులు వేసుకోవచ్చు. ఏది వేసినా వేడి వేడిగా వడ్డించాలి.

అడైల పిండి ఈ తీరులో చేసుకోవచ్చు:

  1. నేను ఈ అడై పిండి రెడ్ రైస్ కందిపప్పు కొర్రలు వేసి చేశాను, ఇదే పిండి మీరు రెడ్ రైస్కి బదులు బ్రౌన్ రైస్, కనిపప్పుకి బదులు అలసందలు రాగులు ఇంకేవైనా వాడుకోవచ్చు. మిల్లెట్స్ మీకు నచ్చినవి అందుబాటులో ఉన్నవి వాడుకోవచ్చు.

  2. మీరు ఏ పదార్ధం వాడుకుని అడై చేసినా బియ్యంకి మిగిలిన పదార్ధాలు ఎన్ని వేసినా అవన్నీ బియ్యంకి సమానంగా ఉండాలి.

పప్పులు ఇలా నానబెట్టుకోవాలి:

  1. సాధారణంగా అడైలకి 4-5 గంటలు పప్పు నానితే చాలు, అప్పుడు పప్పుని రుబ్బినా గట్టి రవ్వగా ఉంటుంది, అడైలు కరకరలాడుతూ వస్తాయ్. నేను రాత్రంతా నానబెట్టాను, బరకగా గ్రైండ్ చేసుకున్నాను.

యెర్ర బియ్యం మిల్లెట్స్ అడై. - రెసిపీ వీడియో

Red Rice Millet Adai

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 4 hrs
  • Cook Time 20 mins
  • Total Time 4 hrs 21 mins
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • 1/4 Cup రాత్రంతా నానబెట్టిన కందిపప్పు
  • 1/2 Cup రాత్రంతా నానబెట్టినఏర్ర బియ్యం
  • 1/4 Cup రాత్రంతా నానబెట్టిన కొర్రలు
  • 6-7 ఎండుమిర్చి
  • 1 Inch అల్లం
  • 12-15 వెల్లులి (చిన్నవి అయితే)
  • 2 Sprigs కరివేపాకు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1/2 tbsp సోంపు
  • 1 ఉల్లిపాయ
  • నూనె (అడై కాల్చడానికి)
  • నీళ్లు పిండి రుబ్బుకోడానికి

విధానం

  1. మిక్సీలో అడైకి కావలసిన పదార్ధాలన్నీ వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి
  2. రుబ్బుకున్న పిండిని అవసరమైతే కాస్త పలుచన చేసుకోండి
  3. పెనం వేడి చేసి అడై పిండిని కాస్త మందంగా పోసుకోండి
  4. పిండి పోసిన వెంటనే ఉల్లి పచ్చిమిర్చి సన్నని తరుగు చల్లుకోండి, అంచుల వెంట నూనె లేదా నెయ్యి వేసి కాల్చండి మీడియం ఫ్లేమ్ మీద.
  5. కాలిన అడైని ఫ్లిప్ చేసి మరో వైపు కూడా కాల్చి పైన కొద్దిగా నూనె పూసి వేడి వేడిగా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    srimayyia
    Wow very taste and healthy receipe.thanks for sharing,Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 9722260