మల్టీ గ్రైన్ అడై కారం పొడితో

పెసలు, సెనగలు, అలసందలు, మినపప్పు, బియ్యం, కొబ్బరి, పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా రుబ్బి అట్టు కాల్చినట్లు కాల్చి పైన పొడి చల్లి ఇచ్చేదే తమిళనాడు స్పెషల్ అడై రెసిపీ.

తమిళులు అడైలు చాలా తీరుల్లో చేస్తారు. అందులో ఇదొకటి. ఇది ప్రోటీన్ రిచ్ అడై, ఒక్కటి తిన్నా చాలు అనిపిస్తుంది. అడైని చాలా మంది అడై దోశ అని కూడా అంటారు.

అడైల గురించి మరింత వివరాలు కింద టిప్స్ చుడండి

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చురవ్వ అడై

టిప్స్

అడై పిండి:

  1. అడైల పిండి అట్ల పిండి మాదిరి మెత్తగా వెన్నలా గ్రైండ్ చేయకూడదు. కాస్త రవ్వగా ఉండాలి. నూనెలో నిదానంగా కాలిన సన్నని రవ్వ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది.
  2. నిజానికి అడైలు కరకరలాడుతూ ఉంటాయి, ఇంకా అట్ల కంటే కాస్త మందంగా ఉంటాయి.
  3. అడై పిండి కాస్త చిక్కగా ఉండాలి, అప్పుడే అడై కారకరలాడుతూ ఉంటుంది.
  4. అడై పిండి మామూలు అట్లా పిండి మాదిరి పులియ పెట్టరు. నానిన పప్పుని రుబ్బి అడై వేస్తారు, పెసరట్టు మాదిరి.
  5. ఈ అడై పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిండి త్వరగా పులిసిపోతుంది. చల్లని ప్రదేశాల్లో ఉండే వారు రాత్రే రుబ్బి ఉంచుకున్నా ఏమి కాదు. భారత దేశంలోని వారు ఎక్కువ రుబ్బి ఉంచుకోదలిస్తే పిండి రుబ్బిన వెంటనే కావాల్సినంత తీసుకుని మిగిలినది ఫ్రిజ్లో పెట్టుకోండి.

ఆడై పిండిని ఇలా కూడా వాడుకోవచ్చు:

  1. పిండి చిక్కగా రుబ్బి పూనుకులు వేసుకోవచ్చు, ఇదే పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపి గుంట పుణుకులు, ఊతప్పాలు వేసుకోవచ్చు.

అడై కాల్చే తీరు:

  1. అడైని కాస్త నూనె ఎక్కువ వేసి నిదానంగా కాలిస్తే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. నూనె తగ్గించి వేస్తే వేడి వేడిగా రుచిగా ఉంటాయి.

మల్టీ గ్రైన్ అడై కారం పొడితో - రెసిపీ వీడియో

Multi- grain Adai with spicy Powder | Protein Dosa

Breakfast Recipes | vegetarian
  • Prep Time 10 mins
  • Soaking Time 4 hrs
  • Cook Time 15 mins
  • Total Time 4 hrs 25 mins
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • అడై కోసం:
  • 1/4 Cup ముడి పెసలు
  • 1/4 Cup అలసందలు
  • 1/4 Cup మినపప్పు
  • 1/4 Cup ముడి సెనగలు
  • 1 Cup బియ్యం
  • 1/.4 Cup పచ్చి కొబ్బరి
  • 3 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 1 tbsp జీలకర్ర
  • 10 వెల్లులి
  • నూనె (అడై కాల్చుకోడానికి)
  • అడై పొడి కోసం:
  • 2 tbsp పచ్చి సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 2 tb sp నువ్వులు
  • 10 ఎండుమిర్చి
  • 2 Springs కరివేపాకు
  • 1 tbsp జీలకర్ర
  • 5-6 వెల్లులి
  • ఉప్పు

విధానం

  1. అడై కోసం ఉంచిన పప్పులన్నీ రాత్రంతా నానబెట్టుకోండి. తరువాతై రోజు పప్పులతో పాటు అడై కోసం ఉంచిన మిగిలిన పదార్ధాలన్నీ వేసి కొంచెం రవ్వగా పిండి గ్రైండ్ చేసుకోవాలి.
  2. గ్రైండ్ చేసుకున్న అడై పిండిలో కొంచెం ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కాస్త చిక్కగా పిండి కలుపుకోండి.
  3. పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే మెత్తని పొడి చేసుకోండి
  4. పెనం బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండి పోసి కాస్త మందంగా పిండి అట్టు మాదిరి స్ప్రెడ్ చేసుకోండి.
  5. కాలుతున్న అడై అంచుల వెంట నూనె వేసి కాల్చండి, అడై పైన కొంచెం పొడి గ్రైండ్ చేసుకున్న పొడి చల్లండి.
  6. అడై ఒక వైపు ఎర్రగా కాలాక తిరగతిప్పి మరో 30 సెకన్లు మాత్రమే కాల్చి తీసుకోండి.
  7. అడైలు వేడి వేడిగా కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments