గోధుమ రవ్వ ఉప్మా | గోధుమ రవ్వ ఉప్మా బోరు కొడితే కొత్తగా ఇలా చేయండి

ఎప్పుడూ తినే గోధుమ రవ్వ ఉప్మా బోరు కొడితే కొత్తగా ఇలా చేయండి తప్పక నచ్చుతుంది. ఈ స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో కూడా ఉంది.

ఉప్మా దక్షిణ భారత దేశంలో దాదాపుగా ప్రతీ ఇంట్లో వారానికి రెండు సార్లు అయినా చేస్తారు. ఒకప్పుడు దక్షిణ భారత దేశంలో పెళ్ళిళ్ళలో టిఫిన్స్ కి ఇంకా ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉన్నా ఉప్మా చేసేస్తుంటారు.

ఉప్మా బొంబాయ్ రవ్వతోనే కాక, బియ్యం రవ్వ, మిల్లెట్ రవ్వ , గోధుమ రవ్వతో కూడా చేస్తుంటారు. మిగిలిన ఉప్మాలకి ఏదో నంజుడు ఉండాలి. కానీ, గోధుమ రవ్వ ఉప్మాకి మాత్రం పంచదార ఉంటే చాలు, తృప్తిగా లాగించొచ్చు.

నా స్టైల్ గోధుమ రవ్వ రెసిపి మామూలుగా అందరూ చేసే గోధుమ రవ్వ ఉప్మాకి కాస్త భిన్నం. చాలా ఈసీ కూడా.

Wheat Rava Upma

టిప్స్

గోధుమ రవ్వ:

  1. మార్కెట్ లో గోధుమ రవ్వ పేరుతో మొక్కజొన్న రవ్వ దొరుకుతుంది, కాబట్టి బన్సీ రవ్వ లేదా ఎర్ర గోధుమ రవ్వ అని అడిగి తెచ్చుకోండి( ఇది తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది) నచ్చితే కార్న్ రవ్వ కూడా వాడుకోవచ్చు.

  2. ఉప్మా వేడిమీద కాస్త సంగటిలా అనిపిస్తుంది, చల్లారితే సెట్ అయిపోతుంది.

ఎసరు:అసలు గోధుమ రవ్వ ఉప్మాకి 1:1 నీళ్ళు. కానీ నా స్టైల్ గోధుమ రవ్వ ఉప్మా కి 1:3 నీళ్ళు పోయాలి. అంత ఎసరు ఉంటే చల్లరినా ఉప్మా మెత్తగానే ఉంటుంది. 1:2 నీళ్ళు పోసినా ఉప్మా ఊడుకుతుంది. కానీ చల్లారితే బిరుసుగా అయిపోతుంది.

బెల్లం: పులుపుని బాలన్స్ చేయడానికి చిన్న ముక్క బెల్లం వేస్తే బాగుంటుంది. నచ్చకపోతే వదిలేవచ్చు

బటానీ:నేను ఫ్రొజెన్ బటానీ వాడాను కాబట్టి ఉల్లిపాయ మగ్గిన తరువాత వేశాను, మీరు తాజా బటానీ వాడితే ఉల్లిపాయాలతో పాటే వేసి వేపుకోవాలి.

గోధుమ రవ్వ ఉప్మా | గోధుమ రవ్వ ఉప్మా బోరు కొడితే కొత్తగా ఇలా చేయండి - రెసిపీ వీడియో

Wheat Rava Upma | Wheat Semolina Upma | Godhuma Rava Upma Recipe | How to make Wheat Rava Upma

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup గోధుమ రవ్వ
  • చింతపండు – నిమ్మకాయంత
  • 3 cups నీళ్ళు
  • ఉప్పు
  • 2 tbsp నూనె
  • 1 tsp నెయ్యి/నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp శెనగపప్పు
  • 3 ఎండు మిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి
  • ఇంగువ – చిటికెడు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/4 cup బటానీ
  • బెల్లం – గోళీ సైజు
  • కొత్తిమీరా- కొద్దిగా

విధానం

  1. నూనె/ నెయ్యి కరిగించి గోధుమ రవ్వ వేసి సన్నని సెగ మీద రవ్వ తెల్లబడే దాకా వేపుకుని తీసుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువా , పచ్చిమిర్చి ఒక్కోటిగా వేస్తూ ఎర్రగా వేపుకోవాలి.
  3. తాలింపు వేగాక ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడనివ్వాలి. తరువాత బటానీ వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి.
  4. నిమ్మకాయంత చింతపండులో 3 కప్పుల నీళ్ళు పోసి పులుసు తీయాలి. తీసిన పులుసు, ఉప్పు, కొద్దిగా బెల్లం ఉల్లిపాయలలో పోసి హై-ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
  5. మరుగుతున్న పులుసులో వేపుకున్న రవ్వ వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 -18 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
  6. దింపే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • B
    Beeravalli Ramakoti
    చాలా చక్కగా చెప్పారు. బాగుంది వివరణ మధుమేహులు నెయ్యి వాడవచ్చా?
Wheat Rava Upma