మెత్తని సెనగల అట్లు | రుచిగా కొత్తగా ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్

రుచిగా కొత్తగా ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఈ సెనగల అట్లు ట్రై చేయండి! మెత్తని మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సెనగల అట్లు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.

ఆంధ్రుల ఫేమస్ పెసరట్టు అందరికీ తెలిసిందే! ఈ సెనగల అట్టు కూడా అలాంటిదే. కానీ, రుచిలో చాలా వ్యత్యాసం ఉంది. ఈ అట్లు చూడడానికి పెసరట్టులాగే కనిపిస్తుంది, కానీ పెసరట్టు కంటే చాలా మెత్తగా ఎన్ని తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది.

ఈ సెనగల అట్లు ప్రోటీన్ రిచ్, ఇంకా ఈ అట్టు చల్లారినా రుచిగా ఉంటుంది. పెసరట్టు వేడి మీదే రుచిగా ఉంటుంది.

Black Chickpea Dosa | Black Chana Dosa | Healthy Chenna Dosai | Sponge black chana Dosa Recipe

టిప్స్

  1. మీరు కొలతకి చేసిన కప్పు కి 2 tbsp బియ్యం వేయాలి, లేదంటే అట్టు విరిగిపోతుంది

  2. నచ్చితే మీరు తెల్ల బియ్యనికి బదులు బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు

  3. ఇందులో వేసిన పచ్చి కొబ్బరి రుచి చాలా బాగుంటుంది. వేసిన ఆ కొద్ది పచ్చి కొబ్బరి కూడా తెలిసి తెలియనట్లుగా ఉండాలి అప్పుడే రుచి.

  4. ఈ పిండి తాజాగా అప్పటికప్పుడు రుబ్బి వేసుకుంటేనే రుచి. ఎక్కువ ఫైబర్, ఇంకా ప్రోటీన్ తో ఉన్న ఈ పిండి త్వరగా పులిసిపోతుంది. ఫ్రిజ్లో ఉంచి మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు, కానీ, అప్పటికప్పుడు రుబ్బి వేసిన రుచి రెండో రోజుకి లేదా ఫ్రిజ్లో ఉంచి వేస్తే రాదు

  5. ఈ పిండితో ఊతప్పం, గుంటపునుకులు వేసుకోవచ్చు. గుంటపునుకులు వేయాలనుకుంటే మాత్రం బియ్యం కప్పుకి 4 tbsp అవసరం అవుతుంది.

  6. సెనగల పిండితో వేసిన అట్టు కాలడానికి కాస్త టైమ్ పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా రెండు వైపులా కాల్చి తీసుకోవాలి.

మెత్తని సెనగల అట్లు | రుచిగా కొత్తగా ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్ - రెసిపీ వీడియో

Black Chickpea Dosa | Black Chana Dosa | Healthy Chana Dosa | Sponge black chana Dosa Recipe | How to Make Black Chana Dosa

Breakfast Recipes | vegetarian
  • Prep Time 15 mins
  • Soaking Time 6 hrs
  • Cook Time 5 mins
  • Total Time 6 hrs 20 mins
  • Servings 25

కావాల్సిన పదార్ధాలు

  • 2 cups నల్ల సెనగలు
  • 4 tbsps బియ్యం
  • 3 పచ్చిమిర్చి
  • అల్లం – ఇంచ్
  • 1 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • నీళ్ళు పిండి రుబ్బుకోవడానికి
  • నూనె అట్టు కాల్చడానికి

విధానం

  1. సెనగలు బియ్యం బాగా కడిగి కనీసం 6 గంటలు లేదా రాత్రంతా నానాబెట్టాలి. గ్రైండ్ చేసే ముందు మళ్ళీ కడుక్కోవాలి.
  2. వడకట్టిన సెనగలు బియ్యం, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, నీళ్ళు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బుకున్నాక పసుపు ఇంకా తగినన్ని నీళ్ళు పోసి అట్ల పిండి జారుగా కలుపుకోవాలి.
  4. వేడెక్కిన పెనం మీద పిండి పోసి అట్టు మాదిరి స్ప్రెడ్ చేసుకోండి.
  5. అంచుల వెంట నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాలనిచ్చి మరో వైపు తిప్పి కాల్చుకోవాలి.
  6. ఈ అట్టులో కొబ్బరి ఇంకా అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Black Chickpea Dosa | Black Chana Dosa | Healthy Chenna Dosai | Sponge black chana Dosa Recipe