బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్

వెల్లూలీ సువాసనతో ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ రైస్ ఈ రెసిపీ చాలా ఈసీ. చిటికెలో అయిపోయె ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ వీడియోతో వివరంగా ఉంది చూడండి.

ఇండో – చైనీస్ రెసిపీస్ చాలా క్విక్ గా అయిపోతాయ్, మాంచి పార్టీ రెసిపీ కూడా. ఈ బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ టొమాటో కేట్చప్ లేదా ఇండో చైనీస్ స్టార్టర్స్ తో చాలా బాగుంటుంది.

Burnt Garlic Fried Rice | Garlic Rice | How to make Burnt Garlic Rice

టిప్స్

వెల్లూలీ:

  1. వెల్లులి తరుగుని ఎర్రగా వేపుకుంటే ఫ్రైడ్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది, వెల్లూలీ ఏ మాత్రం మాడినా చేదెక్కుతుంది.

బాస్మతి బియ్యం:

  1. నేను బాస్మతి బియ్యం వాడను. మీరు ఇంకేదైనా బియ్యం వాడుకోవచ్చు

బియ్యం పొడి పొడిగా ఎలా వండుకోవాలి:

  1. 30 నిమిషాలు నానబెట్టిన బియ్యాన్ని కప్ కి నాలుగు కప్పుల నీళ్ళు, ఉప్పు, నూనె వేసి హై- ఫ్లేమ్ మీద 80% కుక్ చేసుకోవాలి.

  2. 80% అంటే మెతుకు మెడిపితే ఇంకాస్త పలుకుంటుంది. ఆ స్టేజ్లో అన్నాన్ని వాడకట్టి నూనె రాసిన ప్లేట్లో లేదా జల్లెడలో వేసి గాలికి పూర్తిగా చల్లరానిస్తే పొడి పొడిగా అవుతుంది అన్నం.

ఆరొమేటిక్ పౌడర్ :

  1. నేను అజీనమోటోకి బదులుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆరోమెటిక్ పౌడర్ వాడను. ఇది అజీనమోటోకి బదులు, నచ్చితే అజీనమోటో వేసుకోండి లేదా వదిలేయండి.

బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ - రెసిపీ వీడియో

Burnt Garlic Fried Rice | Garlic Rice | How to make Burnt Garlic Rice

Chinese Veg Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 10 mins
  • Total Time 15 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 2 tbsps వెల్లులి తరుగు
  • 3/4 cup బాసుమతి బియ్యం (పొడి పొడిగా వండుకున్నది)
  • 2 tbsps నూనె
  • 1/4 cup సన్నని కేరట్ తరుగు
  • 1/4 cup సన్నని బీన్స్ తరుగు
  • 2 tbsp ఉల్లికాడల తరుగు
  • సాల్ట్
  • 1/2 tsp వైట్ పెప్పర్ పౌడర్
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1/2 tsp ఆరోమటిక్ పౌడర్
  • 1/2 tsp లైట్ సోయా సాస్

విధానం

  1. వెల్లూలి తరుగుని నూనె లో వేసి ఎర్రగా వేపి తీసిపక్కనుంచుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో బీన్స్ తరుగు, కేరట్ తరుగు వేసి 3 నిమిషాలు హై-ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి.
  3. పొడిపొడిగా వండుకున్న అన్నం వేసి అందులో ఎర్రగా వేపుకున్న వెల్లూలి వేసి హై-ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోండి.
  4. ఉప్పు, మిరియాల పొడి, ఆరోమేటిక్ పౌడర్, వైట్ పెప్పర్, సోయా సాస్ అన్నీ వేసి బాగా టాస్ చేసుకోండి.
  5. దింపే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసి టాస్ చేసి దిమ్పెసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • K
    K amrutha teena
    i did the same procedure and it came out very well. My relatives loved it very much.Thanks for sharing the recipe.
Burnt Garlic Fried Rice | Garlic Rice | How to make Burnt Garlic Rice