షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్

ఇండో – చైనీస్ రెస్టారెంట్స లో ఎక్కువగా ఆర్డర్ చేసే వాటిలో షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ముందుంటుంది. ఇది రెస్టారెంట్ ఫ్రైడ్ రైస్లా చప్పగా ఉండదు. ఘాటుగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది.

షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ వెజ్- నాన్ వెజ్ రెండూ ఉంటాయ్.

టిప్స్

• షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటే తప్పకుండా అనాస పువ్వు పొడి వేయాలి, ఇది వేయడం వల్ల మాంచి సువాసనతో ఎంతో రుచిగా ఉంటుంది.

బియ్యం పొడి పొడిగా ఉండాలంటే?

• బాస్మతి బియ్యం ఓ కప్ అంటే 185 gms. గంట నానబెట్టి కాస్త ఉప్పేసి ఉడికించి, నీరు వార్చి ఆరబెట్టేస్తే పొడిపొడి గా వస్తుంది. మాంచి క్వాలిటీ రైస్ వాడుకోండి.

• బియ్యం ఎసరు మరుగుతున్నప్పుడు వేసి హై-ఫ్లేమ్ మీద ఉడికిస్తే మెత్తగా ఉడకదు. అన్నం 80% ఉడికితే చాలు. అన్నాన్ని నూనె రాసిన పళ్ళెంలో లేదా జల్లేడలో వేసి ఆరబెడితే పొడి పొడిగా వస్తుంది.

• ఇదే సోనా మసూరి బియ్యంతో కూడా చేసుకోవచ్చు.

షెజ్వాన్ సాస్ గురుంచి కొన్ని విషయాలు:

• రైస్ లో వాడే షెజ్వాన్ సాస్ కారం అన్నది మీరు వాడే మిరపకాయల క్వాలిటీ మీద లేదా బయటనుండి కొంటె ఆ బ్రాండ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ రుచి చూసి మీకు తగినట్లుగా వేసుకోండి.

ఆఖరుగా కొన్ని విషయాలు

• ఇందులో నేను ఆరోమేటిక్ పౌడర్ వాడను, అది అజినోమోటోకి బదులుగా. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. అందుబాటులో లేకపోతే వదిలేయండి. నచ్చితే అజినోమోటో వాడుకోండి.

• ఆఖరున దింపే ముందు వేసే చిటికెడు పంచదార ఫ్లేవర్స్ చక్కగా బేలన్స్ చేస్తుంది.

• చైనీస్ ఎప్పుడూ, హై ఫ్లేం మీద టాస్ చేస్తూ చేసుకుంటేనే స్మోకీ ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది.

• వెజిటేబుల్స్ హై – ఫ్లేమ్ మీదే 70 % వేపుకోవాలి అప్పుడే రుచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్.

షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ - రెసిపీ వీడియో

Schezwan Veg Fried Rice | How to make Schezwan Fried Rice Recipe | Szechuan Recipe

Chinese Veg Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup పొడిపొడిగా వండుకున్న బాస్మతి రైస్ (185 gms)
  • 1/4 cup నూనె
  • 1/4 cup సన్నని కేరట్ తరుగు
  • 1/4 cup సన్నని బీన్స్ తరుగు
  • 2 tbsps ఉల్లికాడల తరుగు
  • 4 ఎండు మిర్చి
  • 1/4 cup షెజ్వాన్ సాస్
  • ఉప్పు
  • 3/4 tbsp తెల్ల మిరియాల పొడి
  • 3/4 tsp ఆరోమేటిక్ పౌడర్
  • 3/4 tsp అనాస పువ్వు పొడి
  • 1/2 tsp లైట్ సోయా సాస్
  • 1/2 tsp వెనిగర్

విధానం

  1. నూనె బాగా మరిగించి అందులో ఎండుమిర్చి, కేరట్ తరుగు, ఉల్లికాడల తరుగు వేసి హై ఫ్లేం మీద 70% వేగనివ్వండి.
  2. తరువాత షెజ్వాన్ సాస్ వేసి బాగా ఫ్రై చేయండి.
  3. ఇప్పుడు ఉప్పు, తెల్ల మిరియాల పొడి, ఆరోమేటిక్ పొడి, అనాస పువ్వు పొడి వేసి బాగా కలుపుకోండి.
  4. పొడి పొడిగా వండుకున్న అన్నం వేసి హై ఫ్లేం మీద బాగా పట్టించండి.
  5. తరువాత లైట్ సోయా సాస్, వెనిగర్ వేసి బాగా టాస్ చేయండి హై ఫ్లేం మీద.
  6. దింపే ముందు చిటికెడు పంచదార, ఉల్లికాడల తరుగు వేసి బాగా టాస్ చేసి దిమ్పెసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

Schezwan Veg Fried Rice Recipe Street Food