చిల్లీ గార్లిక్ నూడుల్స్ | రెస్టారెంట్ స్టైల్ స్పైసీ ఇండో- చైనీస్ వెజ్ నూడుల్స్ రెసిపీ

రెస్టారెంట్ స్టైల్ స్పైసీ ఇండో- చైనీస్ వెజ్ నూడుల్స్ రెసిపీ ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఆలాంటి బెస్ట్ “చిల్లీ గార్లిక్ నూడుల్స్” రెసిపీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో పాటు వీడియోతో ఉంది చూడండి.

“చిల్లీ గార్లిక్ నూడుల్స్” వెల్లులి సువాసనతో ఘాటుగా కారంగా చాలా బాగుంటాయ్. ఈ రెసిపీ చేయడం చాలా తేలిక. అన్నీ రెడీగా ఉంటే 10 నిమిషాలు అంతే!

ఈ సింపుల్ వెజ్ చిల్లీ గార్లిక్ నూడుల్స్ రెసిపీలో నూడుల్స్ పర్ఫెక్ట్గా ఎలా వండుకోవాలో కూడా చెప్తున్నా! చేసే ముందు టిప్స్ ఒక్కసారి చూసి చేయండి బెస్ట్ చిల్లీ గార్లిక్ నూడుల్స్ ఎంజాయ్ చేస్తారు!

Restaurant style Chilli Garlic Veg Noodles | Chilli Garlic Noodles Recipe | How to make Chilli Garlic Noodles at home

టిప్స్

నూడుల్స్:

  1. నూడుల్స్ మాంచి క్వాలిటీ నూడుల్స్ వాడితే నూడుల్స్ తయారయ్యాక రుచి చాలా బాగుంటుంది.

  2. నూడుల్స్ ఎప్పుడూ 80% మాత్రమే ఉడికించాలి. అంత కంటే ఉడికితే నూడుల్స్ టాస్ చేసేప్పుడు చిదురైపోతాయ్.

  3. 80% కుక్ చేయడం అంటే మొత్తంగా ఉడికి ఉంటుంది, నూడుల్స్ని పట్టుకు మెదిపితే కొంచెం పలుకు తగులుతుంది. ఆ స్టేజ్లో దింపేసుకోవాలి. మిగిలినది నూడుల్స్ చల్లారేలోగా ఉడికిపోతుంది.

  4. నూడుల్స్ ఉడికాక కాస్త నూనె వేసి ఫోర్క్తో కలిపితే నూడుల్స్ పొడిపొడిగా ఉంటాయ్.

పండు మిర్చి:

  1. నూడుల్స్ లో వేసిన పండుమిర్చి రుచి చాలా బాగుంటుంది. పండు మిర్చి లేని వారు ఎండు మిర్చి ఇంకొంచెం పెంచుకోండి

ఆరోమేట్ పౌడర్:

  1. ఆరోమెట్ పౌడర్ అజీనమోటోకి బదులుగా వాడాను. దొరకని వారు వదిలేయండి. నచ్చితే అజీనమోటోనే వాడుకోండి.

నీళ్ళు: నూడుల్స్ లో ఆఖరున వేసే 1 tbsp నీళ్ళు నూడుల్స్ చల్లారిన బిరుసెక్కకుండా ఉంచుతుంది.

టాసింగ్: చైనీస్ ఎప్పుడూ హై-ఫ్లేమ్ మీదే టాస్ చేయాలి అప్పుడే స్మోకీ ఫ్లేవర్తో రుచిగా ఉంటుంది.

Restaurant style Chilli Garlic Veg Noodles | Chilli Garlic Noodles Recipe | How to make Chilli Garlic Noodles at home

చిల్లీ గార్లిక్ నూడుల్స్ | రెస్టారెంట్ స్టైల్ స్పైసీ ఇండో- చైనీస్ వెజ్ నూడుల్స్ రెసిపీ - రెసిపీ వీడియో

Restaurant style Chilli Garlic Veg Noodles | Chilli Garlic Noodles Recipe | How to make Chilli Garlic Noodles at home

Chinese Veg Recipes | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Total Time 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gm నూడుల్స్
  • నీళ్ళు – ఉడికించుకోడానికి
  • 1 tbsp ఉప్పు
  • 2 tsp నూనె (ఉడికించడానికి, ఉడికాక నూడుల్స్ పైన వేయడానికి)
  • నూడుల్స్ టాసింగ్కి
  • 3 tbsp నూనె
  • 3 tbsp వెల్లులి తరుగు
  • 2 tbsp పండు మిర్చి తరుగు
  • 2 ఎండు మిర్చి
  • చిన్న ఉల్లిపాయ చీలికలు
  • 1/2 cup ఎల్లో కాప్సికం చీలికలు
  • 1/2 cup రెడ్ కాప్సికం ముక్కలు
  • 1/2 cup గ్రీన్ కాప్సికం ముక్కలు
  • ఉప్పు
  • 1 tsp మిరియాల పొడి
  • 1 tbsp టొమాటో సాస్
  • 1 tsp గ్రీన్ చిల్లీ సాస్
  • 1 tbsp డార్క్ సోయా సాస్
  • 1 tsp తెల్ల మిరియాల పొడి
  • 1 tsp ఆరోమెట్ పొడి
  • 1 tsp వెనిగర్
  • 1 tbsp నీళ్ళు
  • 1 tbsp చిల్లీ ఫ్లేక్స్
  • 1/4 cup ఉల్లి కాడల తరుగు

విధానం

  1. గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఉప్పు నూనె వేసి నీళ్ళని మసల కాగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో మాత్రమే నూడుల్స్ వేసి హై- ఫ్లేమ్ మీద 80% కుక్ చేసుకోవాలి
  2. ఉడికిన నూడుల్స్ లోని నీటిని ఓంపేసి ప్లేట్లో వేసి నూడుల్స్ పైన నూనె వేసి నూడుల్స్ విరగకుండా ఫోర్క్తో కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి
  3. పాన్లో నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత వెల్లులి, పండుమిర్చి, ఎండు మిర్చి తరుగు వేసి వేపుకోవాలి
  4. వేగిన వెల్లులిలో ఉల్లిపాయ, మూడు రంగుల కాప్సికం వేసి హై-ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు టాస్ చేస్తే 60% వేగుతాయ్
  5. పాన్లో చల్లారిన నూడుల్స్ వేసుకోండి. ఇంకా మిగిలిన పదార్ధాలన్నీ వేసి హై-ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు టాస్ చేసుకోవాలి
  6. దింపే ముందు వెనిగర్, నీళ్ళు, ఉల్లి కాడలువేసి మరో నిమిషం టాస్ చేసి దింపేసుకోండి
  7. వేడిగా వెజ్ మంచూరియా లేదా టొమాటో కేట్చాప్ తో చాలా రుచిగా ఉంటాయ్ నూడుల్స్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • A
    Alekhya m
    Recipe Rating:
    I always wanted to have restraunt style Chinese thanks to you I can have it now
Restaurant style Chilli Garlic Veg Noodles | Chilli Garlic Noodles Recipe | How to make Chilli Garlic Noodles at home