చైనీస్ క్రిస్పీ కార్న్

ఈ రెసిపి ఇండో – చైనీస్ రెసిపి. స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెసిపీ కూడా ఉంది, అది కాస్త స్పైసీ గా ఉంటుంది. నేను క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా చేశా త్వరలో పోస్ట్ చేస్తా.

రెస్టారెంట్ స్టైల్ “క్రిస్పీ కార్న్” చేయడం చాలా తేలికగా కొన్ని టిప్స్ కొలతలతో చేస్తే. చేసినంత సేపు పట్టదు ఖాళీ చేయడానికి, అంతగా ఎంజాయ్ చేస్తారు ఈ సింపుల్ స్టార్టర్ని.

Chinese Crispy Fried Corn |  Crispy Corn Recipe | How to make Crispy Corn

టిప్స్

రెస్టారెంట్ అంతా పర్ఫెక్ట్గా అంత క్రంచీగా ఎలా వస్తాయి?

• కార్న్ ఎప్పుడూ తాజాగా ఉండాలి. అప్పడు నూనెలో కరకరలాడేట్టు వేగి తినేందుకు బాగుంటుంది. ఎండినవి వాడలినవి అంత రుచిగా ఉండదు.

• దీనికి నాటు మొక్కజొన్నల కంటే స్వీట్ కార్న్ పర్ఫెక్ట్.

తాజా కార్న్ వాడుకోవచ్చా? • నేను ఫ్రొజెన్ కార్న్ వాడాను, మీరు తాజా కార్న్ కూడా వాడుకోవచ్చు. తాజా కార్న్ వాడేట్లయితే చేత్తో మొక్కజొన్నలని చిదురవ్వకుండా వొలిచి వాడుకోవాలి.

కార్న్ కి కోటింగ్ సరిగా పట్టుకోవాలంటే?

• సగం పైన ఉడికిన కార్న్ లో చల్లారాక మాత్రమే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే బాగా పట్టుకుంటుంది.

• వేడి మీద కార్న్ ఫ్లోర్ వేస్తే నీరు వదులుతూ ఎంత కార్న్ ఫ్లోర్ వేసినా చాలదు. కార్న్ ఫ్లోర్ ఎక్కువైతే పకోడీల అయిపోతుంది.

• అవసరమైతే కొద్దిగా నీళ్ళు చెంచాలతో చల్లుకుంటే పిండి కలుపుకుంటే గట్టిగా పట్టుకుంటుంది కార్న్కి. నీళ్ళు ఎక్కువైతే కార్న్ కి సరిగా పట్టక అంత క్రంచీగా రావు.

పర్ఫెక్ట్ గా కార్న్ ని ఎలా ఉడికించుకోవాలి?

• కార్న్ నీళ్ళలో వేసి హై – ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా 80 % ఉడికించుకోవాలి. 80% అంటే ఒక గింజ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది సగం పైన మెత్తగా ఉడికి ఇంకాస్త పలుకుగా తగులుతుంటుంది. అది 80%

• ఉడికించిన కార్న్ లోని నీటిని వెంటనే వంపేసి చన్నీళ్ళు పోసేస్తే ఇంక ఉడకవు.

కార్న్ వేపేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

• కార్న్ నూనె వేశాక ఒక్కోసారి పేలతాయి అందుకే కార్న్ వేగేప్పుడు ముకుడు మీద జల్లెడ ఉంచి వేపితే నూనె చిందినా మీద పడదు.

కార్న్ ని టాస్ చేసేప్పుడు ఇవి ఫాలో అవ్వండి:

• ఇండో – చైనీస్ స్టార్టర్స్ ఎప్పడూ హై – ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది

• ఈ స్టార్టర్ వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది

Chinese Crispy Fried Corn |  Crispy Corn Recipe | How to make Crispy Corn

చైనీస్ క్రిస్పీ కార్న్ - రెసిపీ వీడియో

Chinese Crispy Fried Corn | Crispy Corn Recipe | How to make Crispy Corn

Chinese Veg Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 150 gms స్వీట్ కార్న్
  • 3 tbsps కార్న్ ఫ్లోర్
  • సాల్ట్
  • 1/2 spoon మిరియాల పొడి
  • 2 tbsp నీళ్ళు (కాటింగ్ కి)
  • 750 ml నీళ్ళు (కార్న్ ఉడికిన్చుకోడానికి)
  • నూనె (వేయించడానికి)
  • టాసింగ్ కి
  • 2 tsp నూనె
  • 4 వెల్లూలి
  • 1 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 1 మీడియం ఉల్లిపాయ తరుగు
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1/2 tsp చిల్లి ఫ్లేక్స్
  • సాల్ట్
  • 1/2 tsp వైట్ పెప్పర్ పొడి
  • 2 tbsps ఉల్లి కాడల తరుగు

విధానం

  1. స్వీట్ కార్న్ ని నీళ్ళలో వేసి మూత పెట్టకుండా 80% కుక్ చేసుకోండి. అంటే పూర్తిగా మెత్తగా కుక్ చేసుకోకూడదు.
  2. కుక్ చేసుకున్న కార్న్ ని వెంటనే చల్లటి నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచి నీళ్ళని పూర్తిగా వడకట్టండి.
  3. ఇప్పుడు పూర్తిగా వడకట్టుకున్న కార్న్ లో కార్న్ ఫ్లోర్ , సాల్ట్, మిరియాలపొడి వేసి బాగా కోట్ చేసుకోండి.
  4. అవసరమైతే 1- 2 tbsp నీళ్ళు వేసి మరో సారి కొద్దిగా ప్రెషర్ తో కార్న్ ని బాగా కోట్ చేసుకోండి.
  5. ఇప్పుడు వేడి వేడి నూనె లో వేసి ఫ్రై చేసుకోండి. కార్న్ వేగేప్పుడు మూకుడు పైన ఏదైనా జల్లెడ ఉంచండి, లేదంటే కార్న్ నూనె లో పగిలి ఆయిల్ చిందుతుంది.
  6. కార్న్ బాగా ఎర్రగా క్రిస్పీగా వేగాక తీసి పక్కనుంచుకోండి.
  7. ఇప్పుడు టాసింగ్ కోసం 2 tbsp నూనె వేడి చేసి అందులో వెల్లూలి తరుగు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి 2 నిమిషాల పాటు అంటే ఉల్లిపాయ పచ్చి వాసన పోయే దాక ఫ్రై చేసుకోండి.
  8. ఇప్పుడు ఫ్రైడ్ కార్న్ వేసి అందులో పెప్పర్ పౌడర్, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, చిల్లి ఫ్లేక్స్ వేసి హై- ఫ్లేం మీద బాగా టాస్ చేసుకోండి. దింపే ముందు స్ప్రింగ్ ఆనియన్ తరుగు వేసి దిమ్పెసుకోండి.
  9. వేడి వేడిగా చాలా రుచిగా ఉంటుంది

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

91 comments

Chinese Crispy Fried Corn |  Crispy Corn Recipe | How to make Crispy Corn