చికెన్ హలీమ్ | హైదరాబాద్ స్టైల్ చికెన్ హలీమ్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి

5.0 AVERAGE
15 Comments

ఇక రంజాన్ మాసంలో హైదరాబాద్ వీధుల్లో దొరికే బెస్ట్ “చికెన్ హలీమ్” ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. హైదరాబాద్ స్టైల్ చికెన్ హలీమ్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.

హలీమ్ దాదాపుగా ముస్లిం దేశాలన్నింటితో పాటు భారతదేశం లో చాలా చోట్ల చేస్తారు. కానీ హైదరాబాదీ హలీమ్ చాలా ప్రేత్యేకం. హైదరాబాద్ హలీం మిగిలిన చోట్ల దొరికే హలీమ్ల కంటే కారంగా, ఘాటుగా నెయ్యిలో ఊరుతూ మరింత రుచిగా ఉంటుంది. అందుకే హైదరాబాద్ హలీమ్ బెస్ట్ హలీమ్ అంటుంటారు, హలీమ్ ప్రియులు.

మటన్తో చేసేదాన్ని హలీమ్ అంటారు. చికెన్తో చేసే దాన్ని హరీస్ అంటారు. కానీ చాలా తక్కువ మంది అందులోనూ ముస్లిం ఫామిలీస్ ఎక్కువగా హరీస్ అంటారు. కాబట్టి నేను అందరూ ఎక్కువ పిలిచే పేరునే వాడుతున్న చికెన్ హలీమ్ అని.

హలీమ్ చేయాలంటే ఓపిక అవసరం, అప్పుడు ఎంతో రుచిగా ఉండే హలీమ్ ఇంట్లోనే చేయగలుగుతారు.

రంజాన్ మాసంలో ముస్లిం సోదరలు ఉపవాసం చేశాక ఎక్కువగా మాంసకృత్తులు నిండిన ఆహారం తింటుంటారు, అందుకే హలీమ్లో వేసే పదార్ధాలలో చిన్న చిన్న మార్పులు అభిరుచికి తగినట్లు మార్చుకుంటారు.

Chicken Haleem | Hyderabadi Chicken Haleem Recipe | How to make Harees at home | How to make Chicken Haleem

టిప్స్

  1. నేను హలీమ్లో ఒట్స్ వేశాను నచ్చితే ఒట్స్కి బదులు బార్లీ వాడుకోవచ్చు.

నెయ్యి:

  1. హలీమ్ కోసం కమ్మని నెయ్యి చాలా అవసరం అందుకే నేను హెరిటేజ్ బ్రాండ్ వారి హై- ఆరోమా నెయ్యి వాడాను. మీరు కావాలంటే ఇంట్లో చేసిన కమ్మని నెయ్యి అయినా వాడుకోవచ్చు.

  2. నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ చికెన్ని పప్పుగుత్తి తో ఏనుపుకోవాలి, అప్పుడే హలీమ్ రుచి.

చికెన్ హలీమ్ | హైదరాబాద్ స్టైల్ చికెన్ హలీమ్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి - రెసిపీ వీడియో

Chicken Haleem | Hyderabadi Chicken Haleem Recipe | How to make Harees at home | How to make Chicken Haleem

| nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 1 hr
  • Total Time 1 hr 10 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ ఉడికించడానికి
  • 1/2 Kilo బోన్లెస్ చికెన్
  • 4 tbsp నెయ్యి
  • 1/2 cup జీడిపప్పు
  • 1/4 cup బాదం పప్పు
  • 10 - 15 పిస్తా పప్పు
  • 2 inches దాల్చిన చెక్క
  • 1 నల్ల యాలక
  • 4 యాలకలు
  • 5 లవంగాలు
  • 1 tsp మిరియాలు
  • 1 tsp పత్తర్ ఫూల్
  • 1 tsp షాహీ జీరా
  • 1 tsp తోక మిరియాలు(kebab cheeni )
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 6 పచ్చిమిర్చి
  • 2 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • 1.5 tsp కారం
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1/2 cup చిలికిన పెరుగు
  • కొత్తిమీర తరుగు – చిన్న కట్ట
  • పుదీనా తరుగు – చిన్న కట్ట
  • 750 ml నీళ్ళు
  • డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కోసం
  • వేపుకున్న జీడిపప్పు కొంచెం
  • వేపుకున్న బాదం
  • వేపుకున్న పిస్తా
  • 1/2 cup పెరుగు
  • నానబెట్టాల్సిన పప్పులు
  • 1/3 cup గోధుమ నూక
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 1 tsp ఎర్ర కందిపప్పు
  • 1 1/2 tbsp ఒట్స్/ బార్లీ
  • 1 tsp పెసరపప్పు
  • 1 tbsp బియ్యం
  • నీళ్ళు
  • 1 tbsp మినపప్పు
  • 1 tsp నువ్వులు
  • హలీమ్ తయారీ కోసం
  • 1 cup నీళ్ళు
  • 1/4 cup పాలు
  • 2 tbsp ఎండిన గులాబీ రేకులు
  • 1/4 cup పుదీనా తరుగు
  • 1/4 cup కొత్తిమీర తరుగు
  • 1.5 tbsp గరం మసాలా
  • 1/3 cup నెయ్యి
  • 1 cup వేపుకున్న ఉల్లిపాయ తరుగు
  • జీడిపప్పు, బాదం పేస్ట్
  • నానబెట్టిన పప్పుల పేస్ట్

విధానం

  1. హలీమ్ కోసం నానబెట్టాల్సిన పప్పులు అన్నీ నీళ్ళు పోసి నాలుగు గంటలు నానాబెట్టాలి.
  2. నాలుగు గంటలు నానిన పప్పులని వడకట్టి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  3. కుక్కర్లో నెయ్యి కరిగించి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి తీసుకోండి
  4. అదే నెయ్యి లో మసాలా దీనుసులు వేసి 30 సెకన్లు వేపి, ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి
  5. ఉల్లిపాయలు ఎర్రబడ్డాక అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపి, చికెన్ వేసి 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి.
  6. తరువాత మిగిలిన మసాలాలూ, పుదీనా కొత్తిమీర చిలికిన పెరుగు వేసి మరో 2 నిమిషాలు వేపుకోవాలి. తారువాత నీళ్ళు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 కూతలు వచ్చే దాకా ఉడికించుకోవాలి
  7. మెత్తగా ఉడికిన చికెన్ని పప్పుగుత్తితో మెత్తగా ఏనుపుకోవాలి
  8. వేపుకున్న జీడిపప్పు లోంచి కొంత, బాదం, పిస్తా పప్పులు మొత్తం, పెరుగు వేసి మెత్తని పేస్ట్ చేసి ఉంచుకోండి
  9. అడుగుమందంగా ఉన్న గిన్నెలో నెయ్యి పోసి అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పులు కాసిని నీళ్ళు పోసి బాగా కలిపి తరువాత పొయ్యి మీద పెట్టి చిక్కని జావాలా అయ్యేదాకా గడ్డలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి కనీసం 15 నిమిషాలు పడుతుంది
  10. జావా చిక్కగా అయ్యాకా ఎనుపుకున్న చికెన్ వేసి పప్పు గుత్తి తో కలుపుతూ ఎనుపుతూ ఉండాలి.
  11. 15 నిమిషాలు ఎనిపిన తరువాత డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి మరో 15 నిమిషాలు ఏనుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద
  12. 30 నిమిషాల తరువాత గరం మసాలా, ¼ కప్పు నెయ్యి, మరో 15 నిమిషాలు ఏనుపుకోవాలి
  13. 45 నిమిషాల తరువాత వేపుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, మరో 15 నిమిషాలు ఏనుపుకోండి
  14. గంట తరువాత ఎండిన గులాబీ రేకులు లేదా 1 తబసప రోజ్ వాటర్ ¼ కప్పు పాలు పోసి మరో 5 నిమిషాలు ఏనుపుకుని పైన 2 tbsp నెయ్యి వేసి కలిపి దింపేసుకోవాలి
  15. సర్వ్ చేసే ప్లేట్లో హలీమ్ వేసి పైన కొద్దిగా నెయ్యి, వేపుకున్న జీడిపప్పు, వేపుకున్న ఉల్లిపాయ తరుగు, నిమ్మకాయ, ఉడికించిన గుడ్డు పెట్టి సర్వ్ చేసుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

15 comments

  • G
    GARSHAKURTHI SHARANYA
    Recipe Rating:
    I really loved the recipe 🤤 and I will follow all u r recipies in my kitchen,and it successfully tastes really good 😊,planning to make haleem with your recipe💝
  • P
    Princess
    Recipe Rating:
    Superb
  • T
    Toshan
    Recipe Rating:
    Got a confusion between harees and haleem. what i know about harees and haleem is both are made traditionally from meat but only ratios matter. Haleem has more amount of meat to wheat ratio, where harees has ewual ratio. I do not think, chicken haleem is called exclusively harees. And the recipe worked out for me very well, Thank you for the recipe.
  • C
    Ch Srinivasa Rao
    Today I made chicken haleem, very good taste, thanks for your video
  • D
    Deepthi
    Chicken mash cheyadam konchem kastam kada , kheema replace cheyavachu kada andi
  • M
    Mubeena
    But you haven't add salt at all...how it taste good
  • F
    florance
    can we use mutton in place of chicken
  • Y
    Yamini
    Today haleem try chesthunnaa yelaa vasthundhoo okatiki rendu moodu saarlu vedio choosaanu teja gaaru
  • H
    Hi Andhi
    The garam masala you added is looking different. can you please tell us the ingredients .
    • Vismai Food
      This is vismai food special garam masala check this out https://www.youtube.com/watch?v=Qt7W4X3jdEI
  • C
    Chandana
    Meeru pappulu nana pettetappudu cheppina tbsp and tsp measurements written measurements veru veru ga unnai and konni nuvvulu ,pesarapappu levu website lo . Edi correct ga follow avvali . Please reply
    • Vismai Food
      Thanks for your feedback. Please follow the video and we have updated the recipe also.
  • A
    Advuk
    Recipe Rating:
    Super undhi Ansary chesuchovali
  • S
    Sujatha Avvari
    Recipe Rating:
    Annaru *
  • A
    Avvari Sujatha
    Recipe Rating:
    Pathar pool garam masalalo veeste chedugaundi danni vadoddu annanu. Ippudu Indulo kuda vesaru
Chicken Haleem | Hyderabadi Chicken Haleem Recipe | How to make Harees at home | How to make Chicken Haleem