మూడు పప్పుల కొబ్బరి పచ్చడి మూడు రకాల పప్పుల్ని దానికి సమానంగా కొబ్బరి వేసి మెత్తగా రుబ్బి ఇంగువ ఆవాల తాలింపు పెట్టి చేసే ఈ ఘుమఘుమలాడే పచ్చడి వేడి నెయ్యి అన్నంతో ఇడ్లీ ఎత్తుతో దేనితో అయినా చాలా రుచిగా ఉంటుంది.

ఈ మూడు పప్పుల కొబ్బరి పచ్చడి ఫ్రిజ్లో కనీసం వారం రోజులు నిల్వ ఉంటుంది.

టిప్స్

పప్పులు:

పప్పుల్ని సన్నని సెగ మీద కలుపుతూ వేపితే పప్పు లోపలి దాకా వేగి మాంచి సువాసన వస్తుంది అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది.

కొబ్బరి:

మూడు పప్పులకి సమానంగా పచ్చి కొబ్బరి ఉండాలి

ఎండుమిర్చి:

మీరు ఈ పచ్చడి అచ్చంగా ఎండుమిర్చితో లేదా పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి వేసి చేశాను.

Moodu pappula Kobbari Pachadi - రెసిపీ వీడియో

Coconut Chutney with three lentils | Coconut Chutney with three dals

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 15 mins
  • Total Time 17 mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • ¼ cup మినపప్పు
  • ¼ cup సెనగపప్పు
  • ¼ cup పెసరపప్పు
  • ¾ cup పచ్చికొబ్బరి
  • 4 tbsp నూనె
  • 20 - 25 ఎండుమిర్చి
  • 5 పచ్చిమిర్చి
  • 12 - 15 వెల్లులి
  • ½ tsp ధనియాలు
  • ¼ tsp జీలకర్ర
  • చింతపండు - నిమ్మకాయ సైజు అంత
  • 1 tbsp బెల్లం
  • నీరు - పచ్చడి బరకగా రుబ్బుకోడానికి
  • తాలింపు కోసం:
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • ½ tso జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • ¼ tsp ఇంగువ
  • 2 sprigs కరివేపాకు

విధానం

  1. నూనె వేడి చేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేపి తీసి పక్కనుంచుకోండి.
  2. మిగిలిన నూనెలో మూడు పప్పులు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
  3. పప్పులు రంగు మారుతూ మాంచి సువాసన వస్తున్నప్పుడు ధనియాలు వెల్లులి వేసి వేపుకోవాలి.
  4. వేగిన పప్పుల్లో పచ్చికొబ్బరి ముక్కలు వేసి వేపుకోవాలి. ఆ తరువాత జీలకర్ర వేసి వేపుకోవాలి.
  5. మిక్సర్ జార్లో ముందుగా వేపుకున్న ఎండుమిర్చి చింతపండు బెల్లం ఉప్పు వేసుకోండి. ఆ తరువాత వేపుకున్న పప్పులు కొబ్బరి నీరు వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి.
  6. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర ఇంగువ కరివేపాకు పసుపు ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి.
  7. వేగిన తాలింపులో బరకగా రుబ్బుకున్న పచ్చడి వేసి కలిపి దింపేసుకోండి.
  8. పచ్చడిలో ఒక వేళా కారం తక్కువగా అనిపిస్తే మిర్చిని విడిగా వేపి గ్రైండ్ చేసి తరువాత కలుపుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.