దొండకాయ రోటి పచ్చడి | ఆంధ్రా స్టైల్ దొండకాయ పచ్చడి
ఈ సింపుల్ దొండకయ పచ్చడికి పెద్దగా టిప్స్ ఏమి అవసరం లేదు బేసిక్ వంట తెల్సి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెప్పే మాత్రం అనుభవం ఉంటే చాలు రుచికరమైన దొండకాయ పచ్చడి చేసేవచ్చు.
తెలుగు వారికి పచ్చడి లేనిది ముద్ద దిగదు, రోజుకో రకం ఉండాల్సిందే. దొండకాయతోనే ప్రాంతానికి ఇంటికి ఒక్కొరూ ఒక్కో తీరులో చేస్తారు. ఇంకా నిలవ పచ్చడి కూడా చేస్తారు. ఎన్నో రకాల దొండకాయ పచ్చళ్లలో ఈ పచ్చడి ఒకటి.
“దొండకాయ రోటి పచ్చడి” వేడి వేడి అన్నం లో చాలా రుచిగా ఉంటుంది, ఇంకా అట్టు, చపాతీ ల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
-
దొండకాయలు లేతవి అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది
-
పచ్చడికి వాడే మిరపకాయలు మీడియం కారం గలవి అయితే పచ్చడి ఎక్కువ మందికి వస్తుంది రుచిగానూ ఉంటుంది. కారంవి అయితే చూసి, తగ్గించి వేసుకోండి.
-
పచ్చిడికి వేపే మెంతులు ఎర్రగా వేగాలి, అప్పడు మాంచి సువాసన, రుచి పచ్చడికి. లేదంటే చేదుగా ఉంటుంది పచ్చడి
-
దొండకాయ పచ్చడికి కాస్త నూనె కొత్తిమీర ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుంది. ఇంకా దొండకాయ ముక్కలు మగ్గాక నీళ్ళు లేకుండా బరకగా రుబ్బుకోవాలి
-
మేతులు బాగా వేగి తీరాలి లేదంటే చేదుగా ఉంటుంది పచ్చడిలో మెంతులు తగులుతున్నప్పుడు
-
రోటి పచ్చళ్ళకి ఇనుప లేదా కాస్ట్ ఐరన్ ముకుళ్ళలో వంట చాలా రుచిగా ఉంటుంది
-
దొండకాయ పచ్చడికి కాస్త నూనె, కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే రుచి
దొండకాయ రోటి పచ్చడి | ఆంధ్రా స్టైల్ దొండకాయ పచ్చడి - రెసిపీ వీడియో
Tindora Chutney | Dondakaya Roti Pacchadi | Andhra Style Dondakaya Chutney Recipe
Prep Time 5 mins
Cook Time 15 mins
Resting Time 5 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 300 gms దొండకాయలు
- 15 పచ్చిమిర్చి
- చింతపండు- చిన్న గోలీ సైజు
- 2 tbsps నూనె
- 1/4 cup కొత్తిమీర
- ఉప్పు
-
మొదటి తాలిమ్పుకి
- 1 tbsp నూనె
- 1 tsp మెంతులు
- 1 tsp ఆవాలు
- 1 tsp మినపప్పు
- 1 tsp సెనగపప్పు
- 1 tsp జీలకర్ర
- 1 రెబ్బ కరివేపాకు
-
రెండో తాలిమ్పుకి
- 1/4 cup నూనె
- 1/2 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 1/2 tsp మినపప్పు
- 1/2 tsp సెనగపప్పు
- 2 ఎండుమిర్చి
- 1/8 spoon ఇంగువా
- 1 రెబ్బ కరివేపాకు
విధానం
-
నూనె వేడి చేసి మొదటి తాలింపు సామంతా మంచి సువాసనోచ్చెంత వరకు వేపుకోవాలి. మెంతులు వేగాక మాత్రమే మిగిలిన సామాను ఒక్కొటిగా వేసి వేపుకోండి. ఆఖరున జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకుని దిమ్పెసుకోండి
-
తాలింపు చల్లారాక అప్పుడు మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి
-
ఇప్పుడు అదే మూకుడు లో 2 tbsp నూనెవేడి చేసి దొండకాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుని మూత పెట్టి దొండకాయలు పూర్తిగా మగ్గించుకోండి. దింపే ముందు చింతపండు వేసి 30 సెకన్లు మగ్గనిచ్చి దింపి చల్లార్చుకోండి.
-
ఇప్పుడు మిక్సీ జార్ లో చల్లార్చుకున్న దొండకాయ ముక్కలు, మెత్తగా పొడి చేసుకున్న తాలింపు, ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా కాస్త బరకగా రుబ్బుకోండి.
-
ఇప్పుడు రెండో తాలిమ్పుకి నూనె వేడి చేసి ఆవాలు ముందు వేసి ఒక్కొటిగా మిగిలిన సామగ్రి అంతా వేపుకుని దింపేసి పచ్చడి లో కలుపుకోండి. అందులోనే కొత్తిమీర కాస్త ఎక్కువగా వేసి కలిపి సర్వ్ చేసుకోండి.
-

Leave a comment ×
5 comments