Curries
5.0 AVERAGE
1 Comments

“గోంగూర పనీర్” పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్రమాత గోంగూరతో మనం పచ్చళ్లు, పులుసులు, అన్నాలు, పులావ్లు ఇలా ఎన్నో చేస్తుంటాము. గోంగూరతో చేసే వంటకాలు మనతో పాటు పక్క రాష్ట్రాల వాళ్ళూ ఎంతో ఇష్టంగా తింటారు.

నా పంజాబీ ఫ్రెండ్ మా ఇంటికి డిన్నర్కి వచ్చినప్పుడు మేము చేసే గోంగూర పచ్చడి తెగ నచ్చేసింది. తాను గోంగూరతో పాలక పనీర్ కి మల్లె గోంగూర పనీర్ చేయవచ్చు కదా మీ స్పైసెస్ తో వేసి అన్నాడు, అవును నిజమే కాదా అనిపించి మన కారాలు తగ్గించకుండా డిజైన్ చేసి తనకి పంపించాను. చాలా ఎంజాయ్ చేశాడు . ఆ తరువాత ఈ రెసిపి విస్మయ్ ఫుడ్ స్పెషల్ రెసిపి అయిపోయింది.

Spicy Gongura Paneer | How to make Gongura Paneer Curry

టిప్స్

  1. ఈ కూరకి నూనె కాస్త ఎక్కువగా ఉండాలి అప్పుడే రుచి.

  2. గోంగూర వంకాయ ఇలాంటి కూరలకి నూనెలు ఉప్పు కారాలుండాలి.

  3. గోంగూర నూనె లో బాగా వేగితేనే జిగురు తగ్గుతుంది.

  4. ఎర్ర గోంగూర అయితే కాస్త పులుపు ఉంటుంది. పచ్చళ్లకి ముదురు గోంగూర వాడితే మంచిది. ఈ కూరకి లేత గోంగూర అయితే మెత్తగా గుజ్జుగా ఊడుకుతుంది.

  5. మార్కెట్ నుండి తెచ్చిన పనీర్ అయితే వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచి కూరలో వేస్తే ఫ్లేవర్స్ బాగా పడతాయి.

Spicy Gongura Paneer | How to make Gongura Paneer Curry

గోంగూర పనీర్ - రెసిపీ వీడియో

Spicy Gongura Paneer | How to make Gongura Paneer Curry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms పనీర్
  • లేత గోంగూర - ఓ పెద్ద కట్ట
  • 3 చీలికలు పచ్చిమిర్చి
  • 1/2 cup టమాటో పేస్టు
  • 1 ఉల్లిపాయ సన్నని తరుగు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tsp గరం మసాలా పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 2 tsps కారం
  • 1/2 tsp పసుపు
  • సాల్ట్
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/4 cup నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి
  • 200 ml నీళ్ళు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపటమనిపించండి.
  2. తరువాత ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వేపుకోండి.
  3. ఎర్రగా వేగాక అల్లం వెల్లులి పేస్టు వేసి వేపి ధనియాల పొడి, పసుపు , కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సాల్ట్ వేసి వేపుకోండి.
  4. తరువాత గోంగూర ఆకు తరుగు వేసి ఆకు మెత్తగా మగ్గేదాక మూత పెట్టి మగ్గించుకుని టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోండి.
  5. ఇప్పుడు నీళ్ళు పోసి పచ్చిమిర్చి చీలికలు వేసి కూర దగ్గరపడే దాకా హై-ఫ్లేం మీద ఉడికించుకోండి.
  6. ఇప్పుడు 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచిన పనీర్ ముక్కలు వేసి లో-ఫ్లేం మీద 5 నిమిషాలు మగ్గించుకుని దిమ్పెసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Hats off to your research and experiments. It tastes good. Everything is perfect. Good for stomach and health.
Spicy Gongura Paneer | How to make Gongura Paneer Curry