ఈ పంజాబీ రెసిపి రెస్టారెంట్లల తో పాటు పంజాబీ దాభాల్లో రొటీలతో ఇష్టంగా తింటుంటారు. ఇది కూడా ఒకలాంటి మిక్స్ వెజ్ కర్రీనే కానీ రుచి రూపం భిన్నంగా ఉంటుంది.

కూరగాయలని సన్నగా ఖీమాలా తరిగి చేస్తారు అందుకే దీనికి ఆ పేరు. రొటీలు పూరీ చపాతీతో అందరికి నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. ఆ కూర నేను తినను ఇది నేను తింటాను అనే పిల్లలకి ఇలా చేసి పెడితే వంకలు వెతక కుండా ఇష్టంగా తింటారు. ఇది నార్త్ ఇండియన్ స్టీల్లో కాక మనకి నచ్చేలా ఘాటుగా చాలా బాగుంటుంది.

Veg Kheema Masala | How to make Veg Kheema Masala Recipe

టిప్స్

• ఈ కూరకి ప్రతీ కూరని ఎంత సన్నగా ఖీమాలా తరిగితే అంతా రుచి

• సహజంగా రెస్టారెంట్ కర్రీ అనగానే జీడీఅప్పు పేస్ట్ వేస్తారు, చిక్కని కమ్మని గ్రేవీ కోసం. వదిలేవచ్చు. కానీ, కూర కాస్త పల్చగా వస్తుంది

• జీడిపప్పు కి బదులు నానబెట్టిన కర్భూజ గింజలు , బాదం , వేపిన వేరుశెనగపప్పు , నానబెట్టిన గసగసాలు ఏవైనా వాడుకోవచ్చు. లేదా సగం సగం చేసి కూడా వాడుకోవచ్చు.

• ఈ రెసిపికి నేను ఫ్రొజేన్ బటానీ వాడాను కాబట్టి ఆఖరున వేశాను. మీరు తాజా బటానీ వాడేట్లు అయితే ముపై నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకుని కాప్సికం వేసేప్పుడే వేస్తే చక్కగా ఉడుకుతాయ్.

• కాశ్మీరీ కారం వేస్తే కూరకి మాంచి రంగు లేని వారు మన కారమే కాస్త తగ్గించి వేసుకోండి

• బటర్ కి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు.

• రెస్టారెంట్ రుచి రూపం కావాలంటే ఆఖరున ఫ్రెష్ క్రీమ్ వాడాల్సిందే , ఫ్రెష్ క్రీమ్ లేని వారు పాల మీగడ వాడుకోవచ్చు

• నచ్చితే ఇందులో కొద్దిగా పనీర్ తురుము కూడా వాడుకోవచ్చు

Veg Kheema Masala Recipe

వెజ్ ఖీమా మసాలా - రెసిపీ వీడియో

Veg Kheema Masala | How to make Veg Kheema Masala Recipe

Veg Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup కాప్సికం తరుగు
  • 1/4 cup ఫ్రోజెన్ బాటనీ
  • 1/2 cup కేరట్ తరుగు
  • 1/2 cup ఫ్రెంచ్ బీన్స్ తరుగు
  • 1/2 cup ఉల్లిపాయ సన్నని తరుగు
  • 3 టమాటో పేస్టు
  • 2 పచ్చిమిర్చి తరుగు
  • 2 tbsps కొత్తిమీర
  • 2 tsps కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp గరం మసాలా
  • 1/2 tsp కాశ్మీరీ కారం
  • ఉప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్టు
  • 2 tsps వెల్లులి తరుగు
  • 2 tsps జీడిపప్పు పేస్టు
  • 1 tsp కసూరి మేథి
  • 1 tsp ఫ్రెష్ క్రీం
  • 2 tbsps నూనె
  • 1 tbsp బటర్
  • 2 tsps నెయ్యి
  • 250 ml నీళ్ళు

విధానం

  1. నూనె, బటర్ వేడి చేసి అందులో జీలకర్ర, వెల్లులి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించుకోండి.
  2. ఇప్పుడు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోండి.
  3. తరువాత ఉప్పు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కష్మీరి కారం వేసి బాగా వేయించి, కాప్సికం ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
  4. టమాటో పేస్టు వేసి టొమాటోలు పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేసుకోండి.
  5. ఆ తరువాత కేరట్ తరుగు, ఫ్రెంచ్ బీన్స్ సన్నని తరుగు వేసి ముక్కలు మగ్గే దాకా ఫ్రై చేసుకోండి.
  6. ఇప్పుడు ఫ్రోజెన్ బాటనీ వేసి మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకుని నీళ్ళు పోసి, జీడిపప్పు పేస్టు వేసి బాగా కలుపుకుని కూరని మీడియం మంట మీద దగ్గర పడనివ్వండి.
  7. దింపే ముందు కొత్తిమీర తరుగు, ఫ్రెష్ క్రీం, నెయ్యి కసూరి మేథీ వేసి బాగా కలిపి మరో 3 నిమిషాలు కుక్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Veg Kheema Masala | How to make Veg Kheema Masala Recipe