టమాటో నువ్వుల పచ్చడి

పుల్లగా కమ్మగా కారంగా ఎంతో రుచికరమైన చట్నీ “టొమాటో నువ్వుల పచ్చడి” ఇది అన్నం ఇడ్లీ అట్టు, గారె, చపాతీ పూరీలలోకి చాలా రుచిగా ఉంటుంది.

ఏ టిఫిన్స్ చేసుకున్నా ఈ సారి టొమాటో నువ్వుల పచ్చడి చేసి చూడండి ఇష్టంగా తింటారు. కాల్షియం తక్కువగా ఉన్నవారిని నువ్వులు ఎక్కువ తీసుకోమంటుంటారు, ఇలా నువ్వులు చేర్చి పచ్చళ్లు చేసుకున్నా రుచికి రుచి ఆరోగ్యం.

ఈ పచ్చడి చేయడం చాలా తేలికే కానీ కొన్ని టిప్స్ తో చేస్తే ఎక్కువ కొలతకి చేసినా అందరికీ నచ్చేలా మెచ్చేలా వస్తుంది.

Tomato Sesame Chutney | Tomato Nuvvula Chutney Recipe

టిప్స్

నాటు టొమాటోలు బెస్ట్ :

• టొమాటోలు నాటువి అయితే పుల్లగా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి.

• పులుపు కావాలనుకునే వారు కాస్త చింతపండు వేసుకోవచ్చు కానీ, సహజంగా టొమాటో పండు నుండి వచ్చే పులుపు రుచి చాలా బాగుంటుంది.

• నాటు టొమాటోలు పండినవి బెస్ట్. నాటు టొమాటోలు లేనట్లైతే హైబ్రీడ్ టొమాటోలు వాడుకోవచ్చు. కానీ, కాస్త చింతపండు వేసుకోవాలి

టొమాటో పచ్చడికి కొన్ని టిప్స్ :

• టొమాటోని మరీ మెత్తగా ఎక్కువ సేపు మగ్గిస్తే వచ్చే రుచి ఒకలా ఉంటుంది, టొమాటో పచ్చి వాసన పొగానే దింపితే వచ్చే రుచి మరోలా ఉంటుంది. నాకు టిఫిన్స్ లోకి టొమాటో పచ్చి వాసన పొగానే దింపి చేసే పచ్చడి ఇష్టం.

• ఈ పచ్చడికి మిరపకాయలు కాస్త ఎక్కువ ఉండడం మేలు. ఎప్పుడూ వేసినట్లు వేస్తే నువ్వుల వల్ల చప్పదనం వస్తుంది

• ధనియాలు నువ్వులతో పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ముందు ధనియాలు వేపి పక్కకు తీసి మిగతా అంతా తాలింపు వేసుకుని పచ్చడి లో ఆఖరున ధనియాలని నలిపి వేసుకున్నా చాలా బాగుంటుంది అక్కడక్కడా పచ్చడి లో తెలుస్తూ.

• వెల్లూలి నచ్చకని వారు వదిలేవచ్చు

• ఈ పచ్చడి ఎండల కాలం సాయంత్రానికి చద్ది వాసనొస్తుంది. ఫ్రిజ్ లో ఉంచుకుంటే రెండు రోజులు నిలవవుంటుంది

నువ్వులకి బదులు ఏమి వాడుకోవచ్చు ?

• నువ్వులకి బదులు వేరుశెనగపప్పు , వేపిన ఆవిశ గింజలు , పుట్నాల పప్పు , వేపుకున్న పచ్చిసెనగపప్పు కూడా వాడుకోవచ్చు .

టమాటో నువ్వుల పచ్చడి - రెసిపీ వీడియో

Tomato Sesame Chutney | Tomato Nuvvula Chutney Recipe

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kg పండు టొమాటోలు
  • 8 -10 పచ్చిమిర్చి
  • 2 tbsp నువ్వులు
  • 5 వెల్లూలి
  • 1/4 tbsp మెంతులు
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 3 tbsps నూనె
  • ఉప్పు
  • తాలింపుకు
  • కరివేపాకు (ఓ రెబ్బ)
  • 1/2 tsp ఆవాలు
  • 2 tsps నూనె
  • 1/4 tsp జీలకర్ర

విధానం

  1. పాన్ లో మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి, తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేపి ఆఖరున నువ్వులు వేసి చిటచిట అనేదాకా వేపుకోండి. తరువాత చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి.
  2. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి వేసి మగ్గించుకోండి, పచ్చిమిర్చి మగ్గాక అందులో టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి.
  3. టొమాటోలు పూర్తిగా మగ్గి గుజ్జుగా అవ్వాలి, అప్పుడు నువ్వుల పొడి లో వేసుకోండి. అలాగే వెల్లూలి, సాల్ట్ వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
  4. తాలిమ్పుకి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపి చట్నీ లో కలుపుకోండి.
  5. ఇది చలికాలం లో అయితే ఫ్రిజ్ లో పెడితే 3 రోజులు నిలవుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Tomato Sesame Chutney | Tomato Nuvvula Chutney Recipe