టొమాటో పుదీనా పచ్చడి

టిఫిన్ సెంటర్ల లో ఇడ్లీ అట్టులలోకి పప్పు పచ్చడితో పాటు టొమాటో పచ్చడి కూడా ఇస్తుంటారు. చాలా రుచిగా ఉంటుంది. అదే రుచి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే ఆ రుచి తీసుకురావొచ్చు.

గొప్పగా ఆదరణ పొందినవాటి వెనక చిన్న చిట్కాలే ఉంటాయ్ అనే మాట ఈ పచ్చడి రెసిపి తెలుసుకున్నప్పుడు అనిపించింది. మా ఇంట్లో చాలా ఎక్కువగా ఈ పచ్చడి చేస్తుంటాము. ఈ స్టైల్ పచ్చడి అట్టు ఇడ్లీ చపాతీలలోకి చాలా రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడి తిరుపతి కర్నూల్ వైపు ఎక్కువగా చేస్తుంటారు, ఇంకా తమిళనాడులో కూడా. నేను ఇది వరకు సుమారుగా 7-8 పచ్చళ్లు పోస్ట్ చేశాను. అన్నీ వేటికవే ప్రేత్యేకం.

ఎప్పుడు చేసినా ఒకే లాంటి రుచి రావాలంటే మాత్రం ఎంచుకునే పదార్ధాలు వండే తీరు మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి టిప్స్ అన్నీ రెసిపిలోని టిప్స్ లో వివరంగా ఉంది చూడండి .

Tomato Mint Chutney | Tomato Pudina Chutney | Tomato Pudhina Chutney

టిప్స్

  1. పచ్చడికి కాస్త నూనె ఉంటేనే బాగుంటుంది

  2. వెల్లుల్లి పాయాలు తగ్గించుకోవచ్చు లేదా వదిలేవచ్చు. వెల్లుల్లి ఆచ్చి వాసన పోతే చాలు

  3. పచ్చి మిర్చి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపితే చాలు. మిరపకాయలు కాస్త కారంగలవి అయితే రుచి

  4. పచ్చడి మరీ మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేయకండి.

  5. ఈ పచ్చడికి కరివేపాకు తాలింపు వేయకండి , పుదీనా సువాసన తగ్గుతుంది

టొమాటో :

• టొమాటోలు నాటువు అయితే పుల్లగా రుచి బాగుంటాయ్. హైబ్రీడ్ కాయలైతే ఇంకాస్త ఎక్కువ చింతపండు వేసుకోండి

• టొమాటోలు మరీ మెత్తగా పూర్తిగా నీరు ఇగిరిపోయేదాక మగ్గించకూడదు . అలా చేస్తే అంతా రుచిగా ఉండదు పచ్చడి. టొమాటోలు ఇంకా నీరుగా ఉండి మెత్తబడితే చాలు. అంటే టొమాటో పైన తోలు ఉడిపోతే చాలు.

పుదీనా :

• గుప్పెడు పుదీనా ఆకులు మాత్రమే వేసి ఒక నిమిషం అంత కంటే మగ్గించకుండా దింపేసుకోవాలి

• పుదీనా కి బదులు కొత్తిమీర కాడలతో లేదా మెంతి కూర ఆకులు కూడా వేసుకోవచ్చు

నువ్వులు :

• నువ్వులు సన్నని సెగ మీద కలుపుతూ వేపితేనే సమానంగా వేగుతాయ్

• నువ్వులకి బదులు వేరు సెనగప్పు/పచ్చి శెనగపప్పు కూడా వాడుకోవచ్చు

టొమాటో పుదీనా పచ్చడి - రెసిపీ వీడియో

Tomato Mint Chutney | Tomato Pudina Chutney | Tomato Pudhina Chutney

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 4 పండిన ఎర్రని టొమాటోలు
  • గుప్పెడు పుదీనా ఆకులు
  • 3 tbsp నువ్వులు
  • 8 -10 పచ్చిమిర్చి
  • 20 వెల్లుల్లి
  • 1 tsp జీలకర్ర
  • ఉసిరికాయంత చింతపండు
  • ఉప్పు
  • తాలింపుకి
  • 1 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tbsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర

విధానం

  1. మూకుడులో నువ్వులు వేసి సన్నని సెగ మీద కలుపుతూ చిటపటలాడించి దింపి మెత్తని పొడి చేసుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు , జీలకర్ర , వెల్లుల్లి వేసి 2 నిమిషాలు వేపుకోండి.
  3. వేగిన వెల్లుల్లి లో పండిన టొమాటో ముక్కలు కాస్త ఉప్పు, చింతపండు వేసి టొమాటోలు మెత్తబడి పైన తోలు ఊడే దాకా మగ్గించుకోవాలి.
  4. మగ్గిన టొమాటో ముక్కల్లో పుదీనా ఆకులు వేసి వ నిమిషం మగ్గనిచ్చి దింపేసుకోవాలి .
  5. చల్లారిన టొమాటోలని మిక్సీ వేసి నీరు చేర్చి బరకగా రుబ్బుకోండి.
  6. తాళింపుకి నూనె వేడి చేసి అందులో ఆవాలు సెనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  7. వేగిన తాళింపులో టొమాటో గుజ్జు ఇంకా నువ్వుల పొడి వేసి నూనె పైకి తేలేదాక మగ్గించి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

Tomato Mint Chutney | Tomato Pudina Chutney | Tomato Pudhina Chutney