కొబ్బరి కారం | ఈ పోడుంటే చాలు కొన్ని వందల కూరలు రెడీ
ఏ కూర లేకపోయినా ఈ కొబ్బరి కారం చాలు, తృప్తిగా భోజనం ముగించడానికి. ప్రతీ బ్యాచిలర్, ఆఫీసులకి వెళ్ళే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
కొబ్బరి కారం దాదాపుగా ప్రతీ తెలుగు వారింట్లో ఉంటుంది. ఈ కారం తమిళవారు, కన్నడవారు కూడా చేస్తారు చిన్న చిన్న మార్పులతో. కొబ్బరి కారం తెలుగు రాష్ట్రాలలో అందరూ చేసినా రాయలసీమ ప్రాంతంలో కొంచెం ఎక్కువగా చేస్తారు. కొబ్బరి కారం ఒక్క సారి చేసి ఉంచుకుంటే కనీసం నెలపైన నిలవుంటుంది.
కొబ్బరి కారం వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని తిన్నా, అట్టు పైనా చల్లుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఈ కారం ఇది వేపుళ్ళకి బెస్ట్!

టిప్స్
• మీరు ఏ వేపుడు చేసినా ఆఖరున ఈ పొడి వేసి దిమేయండి. కూర రుచే మారిపోతుంది
• ఈ కారం వంకాయ, బంగాళదుంప, దొండకాయ, బీరకాయ, చిక్కుడు, కాకర వేపుళ్ళకి రుచిగా ఉంటుంది.
కొబ్బరి కారం | ఈ పోడుంటే చాలు కొన్ని వందల కూరలు రెడీ - రెసిపీ వీడియో
Coconut Spicy Mixture | Secret Spice Powder For All Fries, Idli & Dosa | How to make Spice Powder | Kobbari Kaaram
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 20
కావాల్సిన పదార్ధాలు
- 250 gms ఎండుకొబ్బరి ముక్కలు
- 15 ఎండు మిరపకాయలు
- 7 - 8 వెల్లులి
- 1 tsp జీలకర్ర
- ఉప్పు
విధానం
-
ఎండు కొబ్బరి ముక్కలు మూకుడులో వేసి లో-ఫ్లేం మీద ముక్కల్లోంచి నూనె కనిపించేంత వరకు కలుపుతూ లో-ఫ్లేం మీద వేపుకోవాలి. తరువాత దిమ్పెసుకోవాలి
-
తరువాత ఎండు మిర్చి కూడా వేసి మరో 2-3 నిమిషాలు లో-ఫ్లేం మీద వేపుకోండి. తరువాత దింపి పూర్తిగా చల్లారచ్చండి.
-
చల్లారిన కొబ్బరి ఎండుమిర్చీ, ఇంకా వెల్లులి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తని పొడి గా చేసుకోండి.
-
దీన్ని సీసాలో ఉంచుకుంటే కనీసం నెల రోజులు నిలవుంటుంది.

Leave a comment ×
6 comments