క్రిస్పీ దేశీ స్టైల్ చికెన్ కట్లెట్ | చికెన్ కట్లెట్స్ రెసిపీ
క్రిస్పీ చికెన్ కట్లెట్- గ్రౌండ్ చికెన్ని వేపి అందులో దేశీ మసాలాలు బ్రెడ్ క్రంబ్స్, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి కట్లెట్స్ మాదిరి తట్టి కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఇచ్చి నూనెలో ఎర్రగా వేపి చేసే కరకరలాడే చికెన్ కట్లెట్స్ ఆల్ టైం సూపర్ హిట్ రెసిపీ.
పార్టీ కానివ్వండి లేదా త్వరగా అయిపోయే మాంచి చికెన్ స్టార్టర్ కావాలనుకున్నప్పుడు ఈ చికెన్ కట్లెట్ చేయండి, చాలా నచ్చేస్తుంది. దేశీయమైన మసాలాల రుచితో తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది.
ఈ చికెన్ కట్లెట్స్ మీరు ఒక్కసారి చేసుకుని ఫ్రీజర్లో ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు తీసి వేపుకుని తినొచ్చు. అంటే రెడీ టూ ఈట్ కట్లెట్ అన్నమాట.

టిప్స్
చికెన్:
- బోనెల్స్ చికెన్ని మిక్సీలో మరీ మెత్తగా పేస్ట్ మాదిరి గ్రైడ్ చేయకండి. కాస్త పలుకుగా ఉంచుకుంటే తినేందుకు చాలా బాగుంటుంది.
ఆలూ:
- మెత్తగా ఉడికించుకున్న ఆలూని తురిమి వేయడం వలన కట్లెట్ చక్కని ఆకారంలో నిలుస్తుంది.
2.ఇక్కడ మీరు ఆలూతో పాటుగా ఇంకొన్ని కూరగాయలు సన్నని తరుగు మితంగా వేసుకోవచ్చు. అంటే కేరట్, బీన్స్, బటాణీ ఇవన్నీ మితంగా వేసుకుని కూడా చేసుకోవచ్చు.
బ్రేడ్ క్రంబ్స్:
1.ఆన్లైన్లో లేదా సూపర్ మార్కెట్స్ లో చాలా సులభంగా దొరికే బ్రెడ్ పొడి వేయడం వలన కట్లెట్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది.
గుడ్డు కోటింగ్:
1.మైదా కార్న్ ఫ్లోర్లో కొద్దిగ గిల కొట్టిన గుడ్డు వేసి కలిపిన కోటింగ్ కట్లెట్స్ వేస్తే పైన బ్రెడ్ క్రంబ్స్ కోటింగ్ పట్టి నిలుస్తుంది. లేదంటే నూనెలో వేయగానే కోటింగ్ ఊడిపోవచ్చు.
వేపే తీరు:
1.చికెన్ కట్లెట్స్ ని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి, అప్పుడు కో టింగ్ కరకరలాడేట్టు వేగుతుంది ఇంకా మాంచి రంగొస్తుంది కట్లెట్.
- కట్లెట్ నూనెలో వేసి ఒక నిమిషం వదిలేస్తే పైన కోటింగ్ కాస్త వేగి గట్టిపడుతుంది, అప్పుడు మరో వైపు తిప్పుకుని ఎర్రగా వేపుకోండి.
క్రిస్పీ దేశీ స్టైల్ చికెన్ కట్లెట్ | చికెన్ కట్లెట్స్ రెసిపీ - రెసిపీ వీడియో
Crispy Chicken Cutlets | How To Make Chicken Cutlet Recipe | Chicken Cutlets Recipe
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 200 gms Boneless Chicken | బోన్లెస్ చికెన్
- 2 tbsp Oil | నూనె
- 1 tbsp Garlic (Finely chopped) | వెల్లులి తరుగు
- 1 tbsp Green Chillies | పచ్చిమిర్చి (finely chopped or ground to a paste | సన్నని తరుగు లేదా పేస్ట్)
- 3 tbsp Onion (Chopped) | ఉల్లిపాయ తరుగు
- ¼ tsp Pepper Powder | మిరియాల పొడి
- ½ tsp Red Chilli Powder | కారం
- Salt (To taste) | ఉప్పు (రుచికి సరిపడా)
- ⅛ tsp Turmeric | పసుపు
- ¼ tsp Garam Masala | గరం మసాలా
- ¾ cup Potatoes (Boiled & Grated) | ఉడికించిన ఆలూ తురుము
- Coriander leaves Chopped (A little) | కొత్తిమీర తరుగు (కొద్దిగా)
- 1 tbsp Cornflour | కార్న్ ఫ్లోర్
- 1.5 tbsp Maida | మైదా
- ½ cup Bread Crumbs | బ్రెడ్ పొడి
-
For coating the Cutlets: | కట్లెట్స్ పైన కోటింగ్ కోసం:
- 2 tbsp Maida | మైదా
- 2 tbsp Cornflour | కార్న్ ఫ్లోర్
- 3 tbsp Beaten egg | గిలకొట్టిన గుడ్డు
- Salt (To taste) | ఉప్పు (చిటికెడు)
- 3-4 spoonfuls Water | నీరు
- 1 cup Bread crumbs | బ్రెడ్ క్రంబ్స్
విధానం
-
బోన్లెస్ చికెన్ని మిక్సీలో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
-
నూనె వేడి చేసి అందులో వెల్లులి పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు ఒక దాని తరువాత ఒకటి వేసి వేపుకోండి.
-
వేగిన ఉల్లిలో చికెన్ మిశ్రమం ఉప్పు మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద చికెన్ని గడ్డలు ఏర్పడకుండా కలుపుకుంటూ వేపుకోండి.
-
చికెన్ వేగుతున్నప్పుడే పసుపు కారం గరం మసాలా వేసి పూర్తిగా అంటే తేమారిపోయేదాకా కాకుండా వేపుకోండి.
-
వేగిన చికెన్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి చల్లార్చి అందులో కార్న్ ఫ్లోర్ మైదా బ్రేడ్ క్రంబ్స్ వేసి చికెన్ని గట్టిగా పిండుతూ కలుపుకోవాలి.
-
ఆ తరువాత చికెన్ని కట్లెట్స్ మాదిరి తట్టుకొండి. ఒక వేళా కట్లెట్స్ ఏ కారణం చేతనైన విరిపోతున్నాయి అంటే కాసిన్ని నీరు వేసి తట్టుకోండి.
-
మరో గిన్నె కట్లెట్స్ పైన కోటింగ్ కోసం కార్న్ ఫ్లోర్ మైదా గుడ్డు ఉప్పు నీరు వేసి గడ్డలు లేకుండా పిండి కాస్త జారుగా కలుపుకోండి.
-
కట్లెట్స్ ని పిండిలో ముంచి బ్రెడ్ పొడిలో వేసి అన్ని వైపులా పట్టించండి.
-
ఇప్పుడు కట్లెట్ని మరిగే వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకుని వేడిగా టమాటో సాస్ తో సర్వ్ చేసుకోండి.

Leave a comment ×