ఏగ్లెస్ మయోనైస్ | ప్రతీ ఇంట్లో ఉండే వాటితో మయోనైస్

మయోనైస్ చేయడం చాలా తేలిక, అది కూడా అన్నీ ఇంట్లో ఉండే పదార్ధాలతోనే. నన్ను ఫాలోవర్స్ చాన్నాళ్ళుగా మయోనైస్ రెసిపి పోస్ట్ చేయండి అని అడుగుతూనే ఉన్నారు. నాకు అప్పటికి ఎగ్తో చేసే మయోనైస్ మాత్రమే తెలుసు, ఎగ్లెస్ నాకు తెలియదు. ఫాలోవర్స్ అందరూ అడుగుతుండడంతో చాలా కష్టపడి పర్ఫెక్ట్ రెసిపి నేర్చుకున్నా.

ఈ రెసిపీ చేయడం చాలా తేలిక, కానీ కొన్ని కచ్చితంగా పాటించాల్సిన స్టెప్ ఉన్నాయ్. అవి పాటిస్తేనే పర్ఫెక్ట్ మయోనైస్ వస్తుంది. ఈ మయోనైస్లో ఎలాంటి ప్రీసర్వేటీవ్స్ లేకుండా చేసుకోవచ్చు. ఏదైనా స్టార్టర్స్కి, లేదా బర్గర్, రోల్స్, సలాడ్స్ ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్ ఈ మయో. మయోనైస్ని షార్ట్గా “మాయో” అంటారు.

ఈ మయోనైస్ గాలి చొరని సీసాలో పోసి ఫ్రిజ్లో ఉంచితే కచ్చితంగా నెలరోజుల పైనే నిలవుంటుంది.

పాలు: చిక్కనివి బాగా చల్లనివి వాడాలి. అప్పుడే చిక్కని వెన్నలా వస్తుంది. నేను పాకెట్ పాలు వాడాను. pasteurized milk చిక్కని పచ్చి పాలు వాడాను. pasteurized milk పాలు పచ్చివి అయినా వాడుకోవచ్చు. తాజా పాలు అయితే కాచి చల్లార్చి మీగాడ లేని చల్లని పాలు వాడుకోండి.

హై-స్పీడ్ బ్లెండర్ : మయోనైస్ కోసం హై-స్పీడ్ బ్లెండర్ ఉండాలి. లేని వారు ఇంట్లో ఉండే మిక్సీ కూడా వాడుకోవచ్చు.

డిజోన్ మాస్టర్డ్: మయోనైస్ అంటే కచ్చితంగా రెడీమేడ్గా దొరికే డిజోన్ మస్టర్డ్ వాడి తీరాలి, లేదా పసుపు ఆవాల పొడి అయినా వాడుకోవాలి. రెండూ లేవంటే ప్రతీ ఇంట్లో ఉండే నల్ల ఆవాల పొడి కొద్దిగా వాడుకోవాలి.

Eggless Mayonnaise Recipe | Veg Mayonnaise Recipe | How to Make Mayonnaise without Eggs

టిప్స్

  1. ఎప్పుడూ బ్లెండర్ ఒకే సారి హై-స్పీడ్ మీద తిప్ప కూడదు. అలా తిప్పితే బ్లెండర్ వేడికి మయోనైస్ పలుచన అయి నూనె పైకి వస్తుంది.

  2. బ్లెండర్ ఎప్పుడూ ప్రతీ 30 సెకనులకి ఒక సారి ఆపి నూనె కొద్దిగా వేసి మళ్ళీ తిప్పుకోవాలి.

  3. ఏ కారణం చేతనైనా మయోనైస్లోంచి నూనె పైకి తేలితే, కొద్దిగా వెనిగర్ వేసి మళ్ళీ స్పీడ్గా బ్లెండ్ చేస్తే చిక్కబడుతుంది.

  4. మయోనైస్ చేసిన వెంటనే కాస్త పలుచగా అనిపిస్తే గంట సేపు ఫ్రిజ్లో ఉంచితే చిక్కబడుతుంది.

Eggless Mayonnaise Recipe | Veg Mayonnaise Recipe | How to Make Mayonnaise without Eggs Eggless Mayonnaise Recipe | Veg Mayonnaise Recipe | How to Make Mayonnaise without Eggs

ఏగ్లెస్ మయోనైస్ | ప్రతీ ఇంట్లో ఉండే వాటితో మయోనైస్ - రెసిపీ వీడియో

Eggless Mayonnaise Recipe | Veg Mayonnaise Recipe | How to Make Mayonnaise without Eggs

Sauces and Dressing | vegetarian
  • Cook Time 10 mins
  • Total Time 10 mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup చిక్కని చల్లని పాలు
  • 1/2 cup రెఫైండ్ నూనె
  • 1/2 tsp పంచదార
  • 1/2 tsp ఉప్పు
  • 1 tsp డిజోన్ మాస్టర్డ్
  • 1 tsp వెనిగర్

విధానం

  1. బ్లెండర్లో పాలు ఉప్పు పంచదార వేసి హై – స్పీడ్ మీద 30 సెకన్లు బ్లెండ్ చేసి ఆపేయండి.
  2. తరువాత 2 tbsp నూనె వేసి బ్లెండ్ చేసి మళ్ళీ ఆపండి. మళ్ళీ 2 tbsp నూనె వేసి మళ్ళీ హై- స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి.
  3. ఇలా హై-స్పీడ్ మీద ప్రతీ 30 సెకన్లుకి ఒక సారి ఆపుకుంటూ 8-10 సార్లుగా నూనె కొద్ది కొద్దిగా చిక్కబడే దాకా వేసుకోవాలి.
  4. ఆఖరున డిజోన్- మాస్టర్డ్, వెనిగర్ వేసి చిక్కబడే దాకా బ్లెండ్ చేసుకోండి.
  5. చిక్కగా అయిన మయోనైస్ని గాలి చొరని సీసాలో పోసి ఫ్రిజ్లో ఉంచితే నెల రోజుల పైన నిలవుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

7 comments

  • S
    Shareefa
    Recipe Rating:
    సూపర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను తప్పకుండా తయారు చేస్తాను
  • R
    RAJESH
    Recipe Rating:
    VERY GOOD
  • M
    Myo Thit Htun
    Recipe Rating:
    Good
  • A
    Angel
    Recipe Rating:
    Clearer instructions will help, in your ingredients list you said 1 tsp white vinegar, in the photos it says 1 tbsp
  • R
    RAVINDRA M SSK
    How many days we can store it
  • S
    Sindhu
    Recipe Rating:
    Thank u teja garu.... Big fan of yours.... Lots of love from vijayawada
Eggless Mayonnaise Recipe | Veg Mayonnaise Recipe | How to Make Mayonnaise without Eggs