గుంటూరు చికెన్ రోస్ట్ రెసిపీ | చికెన్ రోస్ట్

5.0 AVERAGE
1 Comments

గుంటూరు చికెన్ రోస్ట్ రెసిపీ - చికెన్ ని ఉడికించి, చికెన్ స్టాక్ పోసుకుంటూ నూనెలో ఎర్రగా వేపి వేపి మసాలా పొడి కారం ఉప్పు చల్లి ఘుమఘుమలాడేట్టు చేసే ఘాటైన గుంటూరు స్పెషల్ చికెన్ రోస్ట్ ఎప్పుడు చేసినా పండుగే చికెన్ లవర్స్ కి.

గుంటూరు చికెన్ రోస్ట్ లో పెద్ద స్పెషల్ మసాలాలు ఏవి లేవు. పరమ దేశీయమైన మసాలాలతో అతి సులభంగా తయారవుతుంది. ఇది చారన్నం, సాంబారన్నం లేదా స్టార్టర్గా పర్ఫెక్ట్.

వీకెండ్స్ కి ఏ చికెన్ కర్రీ తో పాటుగా సులభంగా తయారయ్యే ఈ చికెన్ రోస్ట్, చారు చేశారంటే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ చాలా సింపుల్ అయినా కొన్ని పద్ధతులు విధానాలు అర్ధం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్

చికెన్:

లేత కోడి మాంసం చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇక్కడ కావాలంటే నాటుకోడి కూడా వాడుకోవచ్చు. మిగిలినదంతా ఇదే తీరు.

చికెన్ ఇలా ఉడికించాలి:

చికెన్ ని మరీ మెత్తగా ఉడికించకూడదు, 80% మాత్రమే ఉడికించాలి. పూర్తిగా ముందే ఉడికించేస్తే ముక్కలు వేప్పేప్పుడు చిదురైపోతాయి.

మసాలా పొడి:

మసాలా దినుసులు సన్నని సెగ మీద కలుపుతూ వెచ్చబడేదాకా వేపితే చాలు ఎక్కువగా వేపితే మసాలాపొడి చేదోస్తుంది.

రోస్ట్ కి రుచి ఇక్కడుంది:

చికెన్ ని రోస్ట్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేపితే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు చాలా రుచి వస్తుంది.

కారం:

ఈ చికెన్ రోస్టుకి కాస్త కారం తగలాలి అప్పుడే రుచి. మీరు కావాలనుకుంటే తగ్గించుకోండి మీకు తగినట్లుగా.

గుంటూరు చికెన్ రోస్ట్ రెసిపీ | చికెన్ రోస్ట్ - రెసిపీ వీడియో

Guntur Chicken Roast Recipe | Spicy Chicken Roast

| nonvegetarian
  • Prep Time 1 min
  • Cook Time 30 mins
  • Total Time 31 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పొడి కోసం:
  • 1 tbsp ధనియాలు
  • 5 - 6 లవంగాలు
  • 4 యాలకులు
  • 1/4 మరాఠీ మొగ్గ
  • 1/2 అనాసపువ్వు
  • 1 inch దాల్చిన చెక్క
  • 1/2 tbsp జీలకర్ర
  • చికెన్ ఉడికించుకోడానికి:
  • 1/2 kg చికెన్
  • 1 ¼ cups నీరు
  • 4 పచ్చిమిర్చి
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • 3 లవంగాలు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • 1 బిరియాని ఆకు
  • ఉప్పు - కొద్దిగా
  • చికెన్ రోస్ట్ కోసం:
  • 4 tbsp నూనె
  • 1 ఒక ఉల్లిపాయ చీలికలు
  • 1/2 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 3 sprigs కరివేపాకు
  • 3 - 4 tbsp చికెన్ స్టాక్
  • 1 ¼ tbsp కారం
  • నిమ్మరసం - ½ చెక్క నుంచి
  • కొత్తిమీర - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా

విధానం

  1. చికెన్ ఉడికించడానికి కావలసిన పదార్ధాలన్నీ వేసి 80% ఉడికించండి.
  2. 80% ఉడికిన చికెన్ని వడకట్టి చికెన్ ఉడికించగా మిగిలిన స్టాక్ పక్కనుంచుకోండి.
  3. మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాత్రమే దినుసులు వెచ్చబడి మాంచి సువాసనొచ్చే దాకా వేపుకోండి.
  4. వేపుకున్న మసాలాలు దింపి చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి.
  5. నూనె వేడి చేసి ఉల్లిపాయ చీలికలు వేసి ఒక నిమిషం వేపుకోండి. తరువాత అల్లం వెల్లులి పేస్ట్, కరివేపాకు వేసి వేపండి.
  6. వేగిన అల్లం వెల్లులిలో, చికెన్ ముక్కలు వేసి 7-8 నిమిషాలు వేగనివ్వండి. వేగిన చికెన్లో గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, కారం, కొద్దిగా నీరు వేసి కారాలు మాడకుండా వేపండి.
  7. ఆ తరువాత పక్కనుంచుకున్న చికెన్ స్టాక్ కొద్దీ కొద్దిగా పోసుకుంటూ మసాలాలు మాడకుండా హై ఫ్లేమ్ మీద చికెన్ని ఎర్రగా వేపుకోండి.
  8. దింపే ముందు కాస్త కొత్తిమీర నిమ్మరసం పిండి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments