కాజు చికెన్ ఫ్రై | ఆంధ్ర స్టైల్ కాజు చికెన్ ఫ్రై | చికెన్ ఫ్రై రెసిపీ | విస్మయ్ ఫుడ్

ఆంధ్ర స్టైల్ కాజు చికెన్ ఫ్రై -ఆంధ్రుల తీరులో కొబ్బరి ఇంకొన్ని మసాలా దినుసులని వేపి పొడి చేసి ఉడికించిన చికెన్ని నూనెలో ఎర్రగా వేపి అందులో వేపిన జీడిపప్పు మసాలా పొడి వేసి చేసే ఘుమఘుమలాడే ఘాటైన జీడిపప్పు చికెన్ వేపుడు అందరికీ నచ్చే మరో సింపుల్ చికెన్ ఫ్రై.

ఘాటైన మాసాలాల్లో కారకరలాడేట్టు వేగిన చికెన్లో అక్కడక్కడ కామమని జీడిపప్పు తగులుతూ ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రై చారన్నం, పప్పుచారాన్నం లేదా స్టార్టర్గా ఎలా ప్లాన్ చేసుకున్న అది సూపర్ హిట్ అయిపోతుంది

టిప్స్

చికెన్:

• ఈ వేపుడుకి చికెన్ ముక్కలు కాస్త పెద్దగా ఉండాలి. లేదంటే వేగాక ఇంకా చిన్నవిగా అయిపోతాయి.

చికెన్ ఉడికించే తీరు:

• కుక్కర్లో చికెన్ని హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ ఉడికిస్తే అది 80% ఉడుకుతుంది. మిగిలిన ఆ కొంచెం వేప్పేప్పుడు ఉడికిపోతుంది.

• చికెన్ని పూర్తిగా ఉడికిస్తే వేప్పేప్పుడు ముక్క చిదురైపోతుంది.

మసాలా పొడి:

• మసాలా దినుసులు సన్నని సెగ మీద మాంచి సువాసనొచ్చే దాకా వేపుకోవాలి. దినుసులు ఏ మాత్రం ఎక్కువగా వేగినా మాడిపోయి చేదోస్తుంది మసాలా పొడి. • ఈ మసాలా పొడిలో నేను గసగసాలు వాడాను. కొందరికి గసాలు దొరకవు. అలాంటి వారు వదిలేయండి.

చికెన్ వేపే తీరు:

• 80% ఉడికిన చికెన్ని నూనెలో మీడియం ఫ్లేమ్ మీద లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుంటే చాలు అంతకంటే అంటే మరీ ఎర్రగా వేపితే చల్లారేపాటికి బాగా గట్టిగా అయిపోతాయి ముక్కలు.

• మసాలా పొడి వేశాక 2-3 నిమిషాలు వేపుకుంటే చాలు వేపిన మసాలా పొడి కాబట్టి అంత కంటే వేగితే మాడిపోతుంది.

Kaju Chicken Fry | Andhra Style Kaju Chicken Fry | Chicken Fry Recipe | Vismai Food

| nonvegetarian
  • Prep Time 1 min
  • Cook Time 30 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 1 min
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ నానబెట్టడానికి:
  • 1 Kg చికెన్
  • 1/2 tsp పసుపు
  • ఉప్పు - కొద్దిగా
  • 1/2 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • చికెన్ ఉడికించడానికి:
  • 1 Kg నానబెట్టిన చికెన్
  • ¾ Cup నీరు
  • మసాలా పొడి కోసం:
  • 2 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp మిరియాలు
  • 3 - 4 యాలకులు
  • 6 -7 లవంగాలు
  • 1/3 Cup కొబ్బరి పొడి
  • 1 tbsp గసగసాలు
  • 1.5 inch దాల్చిన చెక్క
  • చికెన్ వేపుడుకి:
  • 1/3 Cup నూనె
  • 4 Sprigs కరివేపాకు
  • ½ tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/3 Cup జీడిపప్పు
  • ఉడికించుకున్న చికెన్
  • వేపుకున్న మసాలా పొడి
  • 1 ¼ tbsp కారం
  • ఉప్పు - రుచికి సరిపడా

విధానం

  1. చికెన్ లో,ఉప్పు పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి కనీసం ముప్పై నిమిషాలైనా ఊరనివ్వాలి.
  2. మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి. ఆఖరున కొబ్బరి పొడి, గసాలు వేసి వేపుకోవాలి.
  3. వేగిన మసాలా దినుసులని చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి.
  4. చికెన్ లో నీరు పోసి కుక్కర్ మూతపెట్టి, హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి స్టీమ్ ను పోనివ్వండి.
  5. నూనె వేడి చేసి, జీడిపప్పుని ఎర్రగా వేపి పక్కనుంచుకోండి.
  6. మిగిలిన నూనెలో, కరివేపాకు అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపి ఉడికిన చికెన్ని నీరుతో సహా పోసి మీడియం ఫ్లేమ్ మీద లేత బంగారు రంగు వచ్చేదాకా అడుగుపట్టి మాడకుండా కలుపుకోవాలి.
  7. సుమారుగా 20 నిమిషాలకి చికెన్ ముక్క రంగు మారుతుంది. అప్పుడు ఉప్పు కారం, వేపుకున్న మసాలా పొడి, వేపుకున్న జీడిపప్పు వేసి కలిపి ఇంకో రెండు నిమిషాలు వేపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • K
    kiranmai
    The Way You Designed The website is assume Especially the colour combinations is fabulous