ఆరెంజ్ పుల్ల ఐస్ | అందరిళ్ళలో ఉండే ఈ మూడింటితో పుల్ల ఐస్

“ఆరెంజ్ పాప్సికల్స్” దీన్నే ఒకప్పుడు పుల్లయిస్గా ప్రతీ వీధిలో అమ్మేవారు. ఆలాంటి పుల్ల ఐసు చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ సింపుల్ ఆరెంజ్ ఐసు రెసిపీ టిప్స్ ఇంకా వీడియోతో వివరంగా ఉంది.

ప్రతీ ఒక్కరికి ఈ పుల్ల ఐస్ తో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ముడివేసుకుని ఉంటాయ్. అలాంటి పుల్ ఐసు ఇంట్లోనే అందరికి అందుబాటులో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేని పుల్ల ఐస్ ఇది. చాలా రుచిగా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది.

Orange Popsicles | Healthy homemade Orange Popsicles | Homemade Ice pop | How to make Orange Popsicles

టిప్స్

• జూస్ పులుపుని ని బట్టి పంచదార కలుపుకోవాలి

• మౌల్డ్స్ లేకపోతే టీ గ్లాస్ లో పోసి పైన అల్యుమీనియం ఫాయిల్ తో సీల్ చేసి పై నుండి ఓ పుల్ల గుచ్చి కూడా చేసుకోవచ్చు

ఆరెంజ్ పుల్ల ఐస్ | అందరిళ్ళలో ఉండే ఈ మూడింటితో పుల్ల ఐస్ - రెసిపీ వీడియో

Orange Popsicles | Healthy homemade Orange Popsicles | Homemade Ice pop | How to make Orange Popsicles

Summer Recipes | vegetarian
  • Prep Time 2 mins
  • Resting Time 6 hrs
  • Total Time 6 hrs 2 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 400 ml ఆరెంజ్ జూస్
  • 1/3 cup పంచదార
  • 2 tsp నిమ్మరసం
  • ఆరెంజ్ తోనల్లో ఉండే బల్బ్స్

విధానం

  1. ఆరెంజ్ జూస్లో మిగిలిన పదార్ధాలన్నీ వేసి పంచదార కరిగించండి.
  2. పంచదార కరిగాక మౌల్డ్స్ లో కొద్దిగా ఆరెంజ్ బల్బ్స్ వేసి ఆరెంజ్ జూస్ ఫిల్ చేసి మూత పెట్టి ఫ్రీజర్ లో రాత్రంతా ఉంచండి.
  3. తరువాతి రోజు నీళ్ళలో మౌల్డ్ 10 సెకన్లు ఉంచితే సులభంగా వచ్చేస్తాయ్!!!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

Orange Popsicles | Healthy homemade Orange Popsicles | Homemade Ice pop | How to make Orange Popsicles