గులాబ్ జామూన్ ఐస్ క్రీమ్ | బెస్ట్ గులాబ్ జామూన్ ఐస్ క్రీమ్ రెసిపీ

ఇంట్లోనే షాప్లో కొన్న ఐస్ క్రీమ్ లాంటి రుచి రూపం నా టిప్స్ తో తప్పక వచ్చి తీరుతుంది. బెస్ట్ గులాబ్ జామూన్ ఐస్ క్రీమ్ రెసిపీ ఎన్నో స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ టిప్స్ తో పాటు వీడియోతో ఉంది.

ఐస్ క్రీమ్ అంటే అందరీకీ ఎంతో ఇష్టం. ఆలాంటి ఐస్ క్రీమ్ ఇంట్లో చేస్తే చాలా సార్లు గడ్డలుగా అవుతుంది, కొన్ని సార్లు చూడడానికి సరిగా ఉన్నా తింటుంటే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ కాదనిపిస్తుంది.

మీరు హాయిగా నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయి నా కొలతల్లో చేయండి బెస్ట్ ఐస్ క్రీమ్ చేస్తారు. బెస్ట్ ఐస్ క్రీమ్ కోసం సరైన పదార్ధాలు చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు. ఎప్పుడు చేసినా బెస్ట్ ఐస్ క్రీమ్ వచ్చి తీరుతుంది.

టిప్స్

విప్పింగ్ క్రీమ్:

  1. ఐస్ క్రీమ్ కి విప్పింగ్ చాలా ముఖ్యం. దీని వల్లే ఐస్ క్రీమ్ క్రీమీగా ఉంటుంది.

  2. విప్పింగ్ క్రీమ్ కచ్చితంగా డైరీ విప్పింగ్ క్రీమ్ నే వాడాలి, నాన్ డైరీ కూడా దొరుకుతుంది అది వాడకండి. వాడితే ఐస్ క్రీమ్ సరిగా రాదు

  3. విప్పింగ్ క్రీమ్ ఐస్ క్రీమ్లా గడ్డగా టెట్రా పాక్లో దొరుకుతుంది. విప్పింగ్ వాడే ముందు ఫ్రీజర్ నుండి తీసి 2 గంటలు ఫ్రిజ్ లో ఉంచితే కరుగుతుంది, కానీ బాగా చల్లగానే ఉంటుంది. అలా ఉన్న క్రీమ్ వాడితేనే పర్ఫెక్ట్ కొలత వస్తుంది. విప్పింగ్ క్రీమ్ చల్లగా లేకపోతే మీకు క్రీమ్ స్టీఫ్ఫ్ గా అవ్వదు.

  4. విప్పింగ్ క్రీమ్ ని హై స్పీడ్ మీద “స్టీఫ్ఫ్ పీక్స్” వచ్చే దాకా బీట్ చేయాలి. స్టీఫ్ఫ్ పీక్స్ అంటే క్రీమ్లోంచి బీటర్ పైకి తీస్తే బీటింగ్ రాడ్స్ కి ఉన్న క్రీమ్ వాలిపోకుండా నిలిచి ఉంటుంది. అది “స్టీఫ్ఫ్ పీక్స్” అంటే.

లిక్విడ్ గ్లూకోస్:

  1. ఐస్ క్రీమ్ ఇంట్లో చేసినప్పుడల్లా వచ్చే ప్రధానమైన సమస్య ఐస్క్రీమ్ గడ్డలుగా ఉండడం, ఒకే తీరుగా ఫ్రీజ్ అవ్వకపోవడం. అదే మీరు లిక్విడ్ గ్లూకోస్ వాడినట్లైతే అలాంటి సమస్యలు ఏవి రావు. ఐస్ క్రీమ్ కూడా త్వరగా కరగదు కూడా.

  2. లిక్విడ్ గ్లూకోస్ ఆన్లైన్లో చాలా సులభంగా దొరుకుతుంది.

  3. లిక్విడ్ గ్లూకోస్ తీసుకునే ముందు చెంచాని నీళ్ళలో తడిపిన చెంచాలోకి తీసుకోవాలి, అప్పుడే చెంచా నుండి విడిపోతుంది, చేత్తో తీసుకోవాలనుకున్న తడి చేత్తోనే తీసుకోవాలి, లేదంటే చేతిని పట్టి వదలదు గ్లూకోస్.

  4. లిక్విడ్ గ్లూకోస్ వాడితే బెస్ట్ ఐస్ క్రీమ్ గ్యారంటీ. వాడకపోయినా ఐస్ క్రీమ్ వస్తుంది, కానీ అంత మృదువుగా ఉండదు.

పాలు:

  1. పాలు చిక్కనివి వాడుకోండి. పాలల్లో పదార్ధాలన్నీ వేసి కలిపి పాలు పొంగాక 30 సెకనులు మాత్రమే మరిగించి దింపేయండి లేదంటే చిక్కబడిపోతాయ పాలు.

  2. చల్లారిన పాలు విప్ అయిన క్రీమ్లో కలిపేప్పుడు వడకట్టి పోసుకుంటే పాల మీగడ, ఇంకా కార్న్ ఫ్లోర్ వల్ల ఏర్పడే తరకలు ఆగిపోయి ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.

గులాబ్ జామూన్:

  1. ఐస్ క్రీమ్ మొత్తం మీద నేను 10 అంగూరి గులాబ్ జామూన్లు వాడను, అదే పెద్దవి అయితే 4 చాలు. కావాలనుకుంటే కాలా జామున్ కూడా వాడుకోవచ్చు.

ఫ్రీజింగ్ టిప్స్:

ఐస్ క్రీమ్ ఎయిర్ టైట్ డబ్బా లో ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంత కంటే మెటల్ టీన్స్ లో పోసి ఫ్రీజ్ చేస్తే ఎయిర్ టైట్ డబ్బాలో కంటే బాగా ఫ్రీజ్ అవుతుంది. కాకపోతే పైన ప్లాస్టిక్ షీట్ చూట్టాలి.

ఎసెన్స్:

ఈ రోజుల్లో మార్కెట్లో దాదాపుగా ప్రతీ ఎసెన్స్ దొరుకుతుంది. గులాబ్ జామూన్ ఎసెన్స్ తో సహా. ఎసెన్స్ వేస్తే ఐస్ క్రీమ్ రుచి చాలా బాగుంటుంది. లేని వారు యాలకలపొడి వేసుకోండి.

Perfect Gulab Jamun Ice cream | 100% best Ice cream Guarantee Recipe | How to make Gulab Jamun Ice Cream

గులాబ్ జామూన్ ఐస్ క్రీమ్ | బెస్ట్ గులాబ్ జామూన్ ఐస్ క్రీమ్ రెసిపీ - రెసిపీ వీడియో

Perfect Gulab Jamun Ice cream | 100% best Ice cream Guarantee Recipe | How to make Gulab Jamun Ice Cream

Desserts & Drinks | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 7 mins
  • Resting Time 16 hrs
  • Total Time 16 hrs 22 mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup చిక్కని పాలు (250 ml)
  • 1/4 cup పాలపొడి
  • 1/2 tsp కార్న్ ఫ్లోర్
  • 2 tbsp పంచదార
  • 10 అంగూరి గులాబ్ జామూన్
  • 1 cup విప్పింగ్ క్రీమ్
  • 1/2 cup కండెన్సడ్ మిల్క్
  • 1 tbsp లిక్విడ్ గ్లూకోస్
  • 1/2 tsp యాలకల పొడి
  • 1/4 tsp మావ ఎసెన్స్

విధానం

  1. పాలల్లో పాలపొడి , కార్న్ ఫ్లోర్ , లిక్విడ్ గ్లూకోస్, పంచదార వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి ఒక పొంగు రానివ్వాలి. లిక్విడ్ గ్లూకోస్ మరిగే పాలల్లో కరిగిపోతుంది.
  2. పొంగువచ్చాక మరో 30 సెకన్లు మరిగించి పూర్తిగా చల్లారచాలి.
  3. క్రీమలా కరిగి చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ని హై స్పీడ్ మీద స్టీఫ్ఫ్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఇంకా క్రీమ్లోనే యాలకలపొడి, మావా ఎసెన్స్ వేసి స్టీఫ్ఫ్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి.
  4. పూర్తిగా చల్లారిన పాలల్లో కండెన్సడ్ మిల్క్ వేసి బాగా కలిపి విప్పింగ్ క్రీమ్ పైన జల్లేడ పెట్టి పాలు పోసి వడకట్టుకోవాలి.
  5. ఇంకా గులాబ్ జామునులు 5-6 వేసి కలిపి మరో సారి అంతా కలిసేలా బీట్ చేసుకోవాలి.
  6. మెటల్ టిన్లో ఐస్ క్రీమ్ మిక్స్ ¼ భాగం పోసి పైన జూలాబ్ జామున్ ముక్కలు పెట్టి మళ్ళీ పైన క్రీమ్ పోసి పైన మళ్ళీ జామూన్ ముక్కలు పెట్టి ప్లాస్టిక్ రాప్ తో సీల్ చేసి ఫ్రీజర్లో 18 గంటలు ఫ్రీజ్ చేసుకోండి.
  7. 18 గంటల తరువాత నీళ్ళలో ముంచిన ఐస్ క్రీమ్ స్కూప్ తో తీసి సర్వ చేసుకోండి. ఈ ఐస్క్రీమ్ మీకు లీటర్ పైన వస్తుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • P
    Praneeth Dhanaraja
    Chef i really Fantastic Soooooooooo nice recipe This is praneeth I am complete my Hotel Management instered in cooking
  • B
    Baratam sai krishna
    Recipe Rating:
    Super
  • M
    Mahendar Reddy K
    Try this super
    • Vismai Food
      Have Tried this Mahendar Reddy, Try this Gulab jamun to see smiles on Diwali festival.
Perfect Gulab Jamun Ice cream | 100% best Ice cream Guarantee Recipe | How to make Gulab Jamun Ice Cream