స్పెషల్ టిప్స్ తో ఫ్రూట్ కస్టర్డ్ | ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ నా సింపుల్ టిప్స్తో చేయండి

అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ నా సింపుల్ టిప్స్తో చేయండి బెస్ట్ కస్టర్డ్ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో కూడా ఉంది.

వేసవిలో కస్టర్డ్ రుచి ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ చాలా సింపుల్. అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ కొన్ని సింపుల్ స్పెషల్ టిప్స్ ఫాలో అయితే బెస్ట్ కస్టర్డ్ ఎంజాయ్ చేస్తారు.

కస్టర్డ్ పౌడర్ పాకెట్ మీద ఉండే కస్టర్డ్ చాలా క్రీమీగా అందంగా ఉంటుంది, ఇంట్లో చేసే కస్టర్డ్కి ఆ రూపం రాదు. కానీ నా టిప్స్ తో చేసి చూడండి బెస్ట్ క్రీమీ కస్టర్డ్ వచ్చి తీరుతుంది.

కస్టర్డ్ బేస్ని వాడి ఎన్నో ఎన్నో రెసిపీస్ చేయవచ్చు. అవన్నీ త్వరలో చెప్తా. ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ చేసే ముందు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి.

Easy Fruit Custard | Easy homemade fruit custard recipe | Mixed Fruit Custard with tips

టిప్స్

కస్టర్డ్:

  1. నేను రెడీమేడ్ గా దొరికే వెనీలా కస్టర్డ్ వాడాను. మీ దగ్గర కస్టర్డ్ లేనట్లైతే కార్న్ ఫ్లోర్లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ ఇంకా వెనీలా ఎసెన్స్ వేసి కలిపి పాలల్లో వేసినా సరిపోతుంది.

  2. కస్టర్డ్ని చిక్కని మజ్జిగలా అయ్యేదాక మరిగించి దింపేసుకోవాలి. లేదంటే ఇంకా గట్టిగా అయిపోతుంది చల్లారాక.

ఎసెన్స్:

  1. నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ వాడినా ఇంకొంచెం మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వాడాను, దీని వలన కస్టర్డ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ లేకుంటే పైనాపిల్ ఎసెన్స్ లేదా ఆరెంజ్ ఎసెన్స్ 5-6 బొట్లు అయినా వేసుకోండి. ఇంకా వెనీలా ఎసెన్స్ అయినా కూడా వాడుకోవచ్చు.

  2. ఏ ఎసెన్స్ వేయకపోతే అంత పాలల్లో వేసిన ఆ కొద్ది ఫ్లేవర్డ్ కస్టర్డ్ ఏ రుచి ఉండదు.

ఫ్రూట్స్:

  1. సాధారణంగా ఫ్రూట్స్ కస్టర్డ్లో కలిపి ఫ్రిజ్లో ఉంచేస్తారు. నేను కట్ చేసిన ఫ్రూట్స్ ని గంట సేపు ఫ్రిజ్లో ఉంచి ఆ తరువాత వాడాను. ఇలా ముందుగా ఫ్రిజ్లో ఉంచి వాడితే కస్టర్డ్ లో ఫ్రూట్స్ చాలా రుచిగా ఉంటాయ్.

  2. నేను అరటిపండు, ఆపిల్ తప్ప మిగిలినవి అన్నీ ముక్కలుగా చేసి ఫ్రిజ్లో ఉంచి వేశాను. అరటిపండు ఆపిల్ కట్ చేసి ఉంచితే రంగు మారతాయ్.

  3. కస్టర్డ్ లో సీసన్కి తగినట్లు ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు, పులుపు జాతికి చెందినవి అంత రుచిగా ఉండవు. చాలా మంది పైనాపిల్ వేసుకోవచ్చా అని అడుగుతుంటారు. తాజా పైనాపిల్ కంటే పంచదార పాకం లో ఊరబెట్టిన పైనాపిల్ రెడీమేడ్గా దొరుకుతుంది అది వాడుకోవచ్చు.

  4. డ్రై ఫ్రూట్స్: నేను ఇందులో జీడిపప్పు, పండు ఖర్జూరం మాత్రమే వాడాను, మీరు నానబెట్టిన అంజీర్, బాదం ఇంకెవైనా కూడా వేసుకోవచ్చు.

  5. నేను ఫ్రూట్స్ ని కస్టర్డ్ లో కలపకుండా లేయర్స్ లేయర్స్ గా కస్టర్డ్ ఫ్రూట్స్ వేశాను. ఇలా చేయడం వల్ల కస్టర్డ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది.

  6. నేను కస్టర్డ్ అంతా వేశాక మళ్ళీ గంట సేపు ఫ్రిజ్లో ఉంచి సర్వ్ చేయమనే చెప్తా. అప్పుడు కస్టర్డ్ ఇంకా బాగుంటుంది.

Easy Fruit Custard | Easy homemade fruit custard recipe | Mixed Fruit Custard with tips

స్పెషల్ టిప్స్ తో ఫ్రూట్ కస్టర్డ్ | ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ నా సింపుల్ టిప్స్తో చేయండి - రెసిపీ వీడియో

Easy Fruit Custard | Easy homemade fruit custard recipe | Mixed Fruit Custard with tips

Desserts & Drinks | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 10 mins
  • Resting Time 3 hrs
  • Total Time 3 hrs 25 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1 liter పాలు
  • 4 tbsp వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్
  • 1/2 cup పంచదార
  • 1/4 tsp మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్
  • 1 అరటిపండు
  • 1 ఆపిల్
  • 1 సపోటా
  • 1 కివీ
  • 6 - 7 పండు ఖర్జూరం
  • 50 gms జీడిపప్పు
  • 50 gms నల్ల ద్రాక్ష
  • 50 gms గ్రీన్ ద్రాక్ష
  • 1/2 cup ఖర్భూజ ముక్కలు
  • 1/2 cup దానిమ్మ గింజలు

విధానం

  1. పావు లీటర్ పాలల్లో కస్టర్డ్ పౌడర్, ఎసెన్స్ వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి.
  2. చిక్కని పాలని ఒక పొంగనిచ్చి అందులో పంచదార, ఇంకా కస్టర్డ్ మిల్క్ వేసి గడ్డలు లేకుండా చిక్కని మజ్జిగలా అయ్యేదాక కలిపి దింపి ఫ్రిజ్లో 2 గంటలు ఉంచాలి.
  3. 2 గంటల తరువాత కస్టర్డ్ గట్టిగా మీగడ పెరుగులా అవుతుంది, అప్పడు మిక్సీలో వేసి పల్స్ చేస్తే క్రీమీగా అవుతుంది కస్టర్డ్.
  4. ఫ్రిజ్లో గంట ముందే ఫ్రూట్స్ ని ముక్కలుగా చేసి ఉంచుకోండి.
  5. గ్లాస్ జార్లో కస్టర్డ్ పోసుకోండి దాని మీద ఫ్రూట్స్ కొద్దిగా ఒక లేయర్ గా వేసి దాని మీద కస్టర్డ్ పోసుకోండి. కస్టర్డ్ మీద మళ్ళీ ఒక లేయర్ గా ఫ్రూట్స్ వేసుకుంటూ ఇలా గ్లాస్ జార్ నింపండి.
  6. నింపిన జార్ని మళ్ళీ ఒక గంట ఫ్రిజ్లో ఉంచి తింటే చాలా బాగుంటుంది, లేదా వెంటనే కూడా తినవచ్చు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • P
    Prathyusha G
    Recipe Rating:
    Thank you for this recipe... it's tasty
  • A
    arel
    Recipe Rating:
    I tried the recipe, it's really good.  
  • B
    Balachandar
    Recipe Rating:
    Those serving glasses are very nice, pls share the contact number, we need to purchase.
  • A
    Ayesha Ayesha
    Super recipe
Easy Fruit Custard | Easy homemade fruit custard recipe | Mixed Fruit Custard with tips