కీవి కూలర్ | మాంచి పార్టీ మాక్టెల్ | అందరికి నచ్చితీరుతుంది

సమ్మర్లో లేదా పార్టీల్లో మాంచి రిఫ్రెషింగ్ డ్రింక్ ఈ కివీ కూలర్. క్విక్ అండ్ ఈసీ నా ఫేవరెట్ కూలర్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

తక్కువ పదార్ధాలతో అయిపోయే బెస్ట్ కివీ కూలర్ రెసిపీ సమ్మర్కి మాంచి రిఫ్రెషింగ్ డ్రింక్. చేయడం కూడా చాలా తేలిక.

ఈ సింపుల్ కూలర్ రెసిపీ నేను హైదరాబాద్ లోని చైనీస్ రెస్టారెంట్లో టెస్ట్ చేశా, చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. మీకు తప్పక ఈ కూలర్ నచ్చేస్తుంది.

KIWI Cooler | Refreshing Kiwi Cooler Recipe | Summer Cooler | How to make Kiwi Cooler

టిప్స్

  1. కివీ: కివీ ని 80% క్రష్ చేస్తే చాలు మిక్సీలో వేయకండి

  2. లెమన్ స్లయిసెస్: నిమ్మకాయ సన్నని ముక్కలు కివీతో సహా క్రష్ చేస్తేనే లెమన్లోని ఫ్లేవర్స్ దిగుతాయ్.

  3. ఈ డ్రింక్ స్ప్రైట్ తో చాలా బాగుంటుంది, నచ్చని వారు సోడాతో కూడా చేసుకోవచ్చు, సోడా తో చేసేవాళ్ళు కాస్త పంచదార పెంచుకోండి. సోడా కూడా చల్లని నీళ్ళతో కూడా చేసుకోవచ్చు.

  4. కివీ అందుబాటులో లేని వారు రెడీమేడ్ గా దొరికే కివీ స్క్వాష్ 3 tbsp ఇంకా నిమ్మకాయ ముక్కలు వేసి క్రష్ చేసి కూడా చేసుకోవచ్చు.

కీవి కూలర్ | మాంచి పార్టీ మాక్టెల్ | అందరికి నచ్చితీరుతుంది - రెసిపీ వీడియో

KIWI Cooler | Refreshing Kiwi Cooler Recipe | Summer Cooler | How to make Kiwi Cooler

Desserts & Drinks | vegetarian
  • Prep Time 5 mins
  • Total Time 5 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 2 కివీ
  • 3 సన్నని నిమ్మకాయ ముక్కలు
  • 2 tbsp పంచదార
  • స్ప్రైట్ / చల్లని సోడా
  • 7 - 8 ఐస్ ముక్కలు

విధానం

  1. రోట్లో లేదా పొడుగాటి గ్లాస్లో కివీ ముక్కలు, లెమన్ ముక్కలు వేసి క్రష్ చేసుకోండి.
  2. సగం పైన క్రష్ అయ్యాక పంచదార వేసి 80% క్రష్ చేసుకోండి.
  3. కివీ క్రష్ని గ్లాస్లో 1/3 భాగం నింపి అందులో ఐసు ముక్కలు వేసుకోండి దాని మీదా స్ప్రైట్ పోసి నింపండి.
  4. తరువాత స్పూన్ తో అడుగు నుండి కలుపుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

KIWI Cooler | Refreshing Kiwi Cooler Recipe | Summer Cooler | How to make Kiwi Cooler