హెల్తీ పుదీనా కూలర్ | వేసవిలో శరీరాన్ని చల్లబరిచే హెల్తీ డ్రింక్

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే హెల్తీ డ్రింక్ కోసం చూస్తుంటే క్విక్ & ఈసీగా అయిపోయే పుదీనా కూలర్ ట్రై చేయండి. ఈ సింపుల్ డ్రింక్ చాలా హెల్తీ చాలా టేస్టీ.

వేసవిలో చల్లగా దొరికేవన్నీ వేడి చేసేవే, కానీ ఈ పుదీనా కూలర్ శరీరాన్ని చల్లబరుస్తుంది, ఇంకా జస్ట్ ఐదు నిమిషాల్లో తయారవుతుంది.

ఈ రెసిపీలో పంచదారకి బదులు బెల్లం వాడాను. ఇంకా వేసేవి జస్ట్ 3-4 పదార్ధాలు అంతే!

Pudina Cooler | How to prepare Summer cooler drink Pudina cooler | Summer Beverages | Healthy Summer Drink

టిప్స్

• నేను పుదీనా కూలర్లో తీపి కోసం బెల్లం వాడాను, కావాలంటే పంచదార వేసుకోండి

• నిమ్మరసం ఎక్కువైతే రుచి బాగుండదు. వేసిన ప్రతీ పదార్ధం తెలిసీ తెలియనట్లుగా ఉండాలి, అప్పుడే రుచి.

• నేను మట్టి పాత్రలో పోసి 2-3 గంటలు వదిలేశాను. మీరు ఇన్స్టంట్ గా తాగాలనుకుంటే చల్లని నీళ్ళు పోసుకుని కూడా చేసుకోవచ్చు.

Pudina Cooler | How to prepare Summer cooler drink Pudina cooler | Summer Beverages | Healthy Summer Drink

హెల్తీ పుదీనా కూలర్ | వేసవిలో శరీరాన్ని చల్లబరిచే హెల్తీ డ్రింక్ - రెసిపీ వీడియో

Pudina Cooler | How to prepare Summer cooler drink Pudina cooler | Summer Beverages | Healthy Summer Drink

Desserts & Drinks | vegetarian
  • Prep Time 3 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 3 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • పుదీనా ఆకులు- ఒక కట్ట
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 3/4 Inch అల్లం
  • 4 యాలకలు
  • 50 - 60 gms బెల్లం
  • 750 ml నీళ్ళు
  • 1 tbsp నిమ్మరసం

విధానం

  1. బెల్లంలో నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించండి.
  2. మిగిలిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్గా చేసుకోండి.
  3. కరిగిన బెల్లంని వడకట్టుకోండి, అందులో పుదీనా పేస్ట్ వేసి కలుపుకోండి.
  4. కలిపిన పుదీనా కూలర్ని మట్టి పాత్రలో అయితే 2 గంటలు ఉంచండి. ఫ్రిజ్లో ఉంచి తాగాలనుకుంటే గంట ఉంచండి. ఐస్ వాటర్ పోసుకుంటే వెంటనే తాగొచ్చు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Pudina Cooler | How to prepare Summer cooler drink Pudina cooler | Summer Beverages | Healthy Summer Drink