ఇన్స్టంట్ కుల్ఫీ 5 నిమిషాల్లో | బెస్ట్ ఇన్స్టంట్ కేసర్ కుల్ఫీ

5 నిమిషాల్లో మూడే స్టెప్పుల్లో బెస్ట్ కుల్ఫీ!!! నోట్లో వెన్నలా కరిగిపోతుంది ఈ ఈసీ ఇన్స్టంట్ కుల్ఫీ. బెస్ట్ ఇన్స్టంట్ కేసర్ కుల్ఫీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో ఇంకా వీడియోతో వివరంగా ఉంది.

ఈ పద్ధతి ఫాలో అయితే మామూలు కుల్ఫీకి మల్లె గంటల తరబడి పాలని మరగకాచి కుల్ఫీ తయారు చేయనవసరం లేదు. చాలా సులభంగా సీల్కీ స్మూత్ కుల్ఫీ వస్తుంది. ఈ కుల్ఫీ మిక్స్ తయారు చేయడానికి కేవలం 5 నిమిషాలు చాలు.

బెస్ట్ కుల్ఫీని సులభంగా ఒరిజినల్ రుచి రూపం ఏ మాత్రం పాడవకుండా చేయవచ్చు అని ఒక బేకరీ చెఫ్ నాతో అన్నాడు, నాకు అర్ధం కాలేదు. తరువాత దాని సైన్స్ చెబితే త్రిల్ అయిపోయా, ఆ తరువాత తన రెసీపీనీ ఫాలో అయిపోయా.

మీరు ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే నాలా తప్పక త్రిల్ అవుతారు మరి.

Instant Kesar Kulfi Recipe | How to make Kulfi at home | Easy and Delicious Kulfi Recipe | Quick Homemade Kulfi

టిప్స్

  1. కుల్ఫీ మిక్స్ మెటల్ మౌల్డ్స్ లో పోసి ఫ్రిజ్లో ఉంచితే చాలా గట్టిగా ఫ్రీజ్ అవుతాయ్, ప్లాస్టిక్ మౌల్డ్స్ లో పోసి ఉంచిన దానికంటే

  2. కుల్ఫీ కనీసం 12 గంటలు లేదా రాత్రంతా ఉంచితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయ్

  3. కుల్ఫీ సెట్ అయ్యాక పుల్ల గుచ్చి నీళ్ళలో ముంచి 5 సెకన్లు ఉంచితే చాలు లూస్ అయ్యి మౌల్డ్ ని వదులుతుంది. అప్పుడు గుచ్చిన పుల్లపట్టి లాగితే వచ్చేస్తుంది.

  4. కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే మూత ఉన్న స్టీల్ డబ్బాలో పోసి కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు.

Instant Kesar Kulfi Recipe | How to make Kulfi at home | Easy and Delicious Kulfi Recipe | Quick Homemade Kulfi

ఇన్స్టంట్ కుల్ఫీ 5 నిమిషాల్లో | బెస్ట్ ఇన్స్టంట్ కేసర్ కుల్ఫీ - రెసిపీ వీడియో

Instant Kesar Kulfi Recipe | How to make Kulfi at home | Easy and Delicious Kulfi Recipe | Quick Homemade Kulfi

Summer Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 3 mins
  • Cook Time 5 mins
  • Total Time 13 mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup గోరు వెచ్చని పాలు (250 ml)
  • 2 Slices మిల్క్ బ్రెడ్
  • 1 cup కండెన్సడ్ మిల్క్
  • 1 cup ఫ్రెష్ క్రీమ్
  • 1 tsp యాలక పొడి
  • వేడి పాలల్లో నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వు
  • 1/4 cup బాదం , పిస్తా పలుకులు

విధానం

  1. బ్రెడ్ అంచులని తీసేయండి. గోరువెచ్చని పాలల్లో మూడు నిమిషాలు నానబెట్టాలి
  2. నానిన బ్రెడ్ ని మిక్సీ లో వేసి మిగిలిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి
  3. కుల్ఫీ మౌల్డ్స్ లో పిస్తా బాదాం పలుకులు వేసి మిల్క్ ని మౌల్డ్స్ లో నింపి గట్టిగా మూతపెట్టి ఒరిగి పోకుండా బియ్యం పోసిన గిన్నెలో గుచ్చి 12 గంటలు ఫ్రీజ్ చేయాలి.
  4. 12 గంటల తరువాత పుల్ల గుచ్చి నీళ్ళలో 3-4 సెకన్లు ఉంచితే మౌల్డ్స్ నుండి విడిపడుతుంది కుల్ఫీ
  5. ఈ కుల్ఫీ తో ఫాలూదా కూడా చాలా బాగుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

Instant Kesar Kulfi Recipe | How to make Kulfi at home | Easy and Delicious Kulfi Recipe | Quick Homemade Kulfi