పర్ఫెక్ట్ ముద్దపప్పు
తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ముద్ద పప్పు రెసిపీ. చాలా సింపుల్, కానీ ఈ పద్ధతిలో చేస్తే ఆవకాయతోనే కాదు కాస్త నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ముద్ద పప్పు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది. ముద్దపప్పు ఇది ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం. ప్రతీ తెలుగింట పసిపాపకి గోరుముద్దలతో మొదలవుతుంది ఈ ముద్ద పప్పు. కాస్త పెద్దయ్యాక ముద్దపప్పు ఆవకాయ కలిపి తినడం మొదలెట్టాక మరిచిపోతారా ఆ రుచిని. పప్పు సాధారణంగా నిదానంగా అరిగి వాతం చేస్తుంది. కానీ ఈ తీరులో చేస్తే పప్పు త్వరగా అరిగి మేలు చేస్తుంది.
ఈ ముద్ద పప్పు మీరు ఆవకాయతోనే కాదు పులుసులతో, దప్పళంతో ఇలా దేనితో నంజుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
-
కంది పప్పుని సన్నని సెగ మీద కలుపుతూ వేపితే పప్పు లోపలి దాకా వేగి మాచి సువాసనతో ఉంటుంది పప్పు
-
వేగిన పప్పు ఉడకడానికి టైమ్ పడుతుంది అందుకే సన్నని సెగ మీద ఉడికించుకోవాలి.
-
పప్పు మృదువుగా ఉండాలంటే పప్పు ఉడికాక మిక్సీలో కూడా వేసుకోవచ్చు.
-
ఇంగువ, జీలకర్ర నేతిలో వేగిన సువాసన పప్పుకి కమ్మదనాన్ని ఇస్తుంది త్వరగా అరిగేలా చేస్తుంది.

పర్ఫెక్ట్ ముద్దపప్పు - రెసిపీ వీడియో
Perfect MUDDAPAPPU | AndhraStyle Mudda Pappu Recipe | How to make Andhra Style Plain Dal
Cook Time 15 mins
Resting Time 10 mins
Total Time 25 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup కందిపప్పు
- 1/4 spoon పసుపు
- 2 cups నీళ్ళు
- ఉప్పు
- 2 tsp నెయ్యి
- 1/2 tsp జీలకర్ర
- 2 చిటికెళ్ళు ఇంగువ
విధానం
-
కందిపప్పుని సన్నటి సెగ మీద మాంచి సువాసనోచ్చేదాక వేపుకోవాలి. మాంచి సువాసన రాగానే దింపి కడిగి కుక్క ర్లో వేసుకోండి
-
కందిపప్పు లో పసుపు, నీళ్ళు పోసి కేవలం లో-మీడియం ఫ్లేం మీద 7-8 విసిల్స్ రానివ్వండి.
-
పప్పు ఉడికాక అందులో ఉప్పు వేసి మెత్తగా వెన్నలా ఎనుపుకోండి, మిక్సీ కూడా వేసుకోవచ్చు.
-
ముకుడులో నెయ్యి కరిగించి అందులో ఇంగువా జీలకర్ర వేపి పప్పు కలిపేసుకోండి.

Leave a comment ×
5 comments