ప్రాన్స్ ధం బిర్యానీ
బిర్యానీ వండుతుంటేనే ఇంట్లో పండుగ వాతావరణంలా అనిపిస్తుంది. అలాంటిది ఘుమఘుమలాడే రొయ్యల బిర్యానీ గురించి చెప్పాలా. హైదరాబాదీ స్టైల్ బిర్యానీలన్నీ ఎంతో ఫేమస్ వేటికవే ప్రేత్యేకం, కానీ అన్నింటిలోకి రొయ్యల ధం బిర్యానీ చాలా సులభం. పెద్దగా సమయం పట్టదు ఇంకా రొయ్యలు ఉడకకపోవడం లాంటి సమస్యా ఉండదు.
హైదరాబాదీ బిర్యానీలన్నీటికి ఒకే మసాలా వాడతారు, కానీ పదార్ధాల కొలతల్లో హెచ్చు తగ్గులు ఉంటాయ్ అంతే! వీకెండ్స్ కి లేదా స్పెషల్ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు హైదరాబాదీ ప్రాన్స్ ధం బిర్యానీ మిర్చి కా సాలన్ చేయండి సూపర్ హిట్ అయిపోతుంది.

టిప్స్
ధం:
-
రొయ్యల ధం బిర్యానీకి చేసే ధం చికెన్ మటన్ బిర్యానీలకి మల్లె అన్నం వండిన నీళ్ళు పోసి చేయరు. రొయ్యల బిర్యానీ ధం చేసేప్పుడు పచ్చి రొయ్యలు ఉడికాక వచ్చే నీరుతో ధం అవుతుంది. కాబట్టి అన్నం ఉడికిన నీరు అవసరం లేదు.
-
ఇదే సోనా మసూరి లేదా ఇంకేదైనా బియ్యంతో చేస్తుంటే 3 tbsp నీళ్ళు పోసుకోండి. బాస్మతి బియ్యానికి నీరు పోయనవసరం లేదు.
బాస్మతి బియ్యం:
-
రొయ్యల బిర్యానీకి 80% ఉడికిన అన్నం నానబెట్టిన రొయ్యల మీద వేసి ధం చేస్తే రొయ్యల నుండి వచ్చే నీరుతో ఉడుకుతుంది.
-
80% ఉడికిన అన్నం అంటే? మెతుకు మెదిపితే సగం పైగా ఉడికి ఉండాలి, ఇంకా మరో ఐదు నిమిషాలు ఉడికితే మెత్తగా ఉడికిపోతుంది అనే స్టేజ్ 80% ఉడకడం అంటే.
సోనా మసూరి/ఇంకేదైనా:
- బియ్యం ఏ రకమైనా 80% ఉడికించుకోవాలి. కాకపోతే 3 చెంచాల అన్నం ఉడికిన నీరు పోసుకోవాలి అంతే.
ప్రాన్స్ ధం బిర్యానీ - రెసిపీ వీడియో
Prawns Dum Biryani | Shrimp Biryani | Prawn Biryani Recipe | Dum Style Shrimp Biryani
Prep Time 5 mins
Soaking Time 1 hr
Cook Time 20 mins
Resting Time 20 mins
Total Time 1 hr 45 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
రొయ్యలు నానబెట్టడానికి
- 300 gms పచ్చి రొయ్యలు
- 4 యాలకలు
- 4 లవంగాలు
- 1 నల్ల యాలక
- 1.5 ఇంచులు దాల్చిన చెక్క
- 1 tsp షాహీ జీరా
- 1 బిర్యానీ ఆకు
- 2 tbsp పుదీనా తరుగు
- 2 tbsp కొత్తిమీర తరుగు
- 1 tbsp ధనియాల పొడి
- 1 tsp జీలకర్ర పొడి
- 1 tbsp కారం
- 1 tsp గరం మసాలా
- 1/4 tsp పసుపు
- ఉప్పు – రుచికి సరిపడా
- 2 tsp నిమ్మకాయ రసం
- 3 tbsp నెయ్యి
- 1/2 cup వేయించిన ఉల్లిపాయ తరుగు
- 3 పచ్చిమిర్చి చీలికలు
- 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
- 175 ml పెరుగు
-
బిర్యానీ వండుకోడానికి
- 2 liters నీళ్ళు
- 1 tsp షాహీ జీరా
- 3 యాలకలు
- 4 లవంగాలు
- 1 నల్ల యాలక
- 1.5 ఇంచులు దాల్చిన చెక్క
- 1 బిర్యానీ ఆకు
- 3 పచ్చిమిర్చి చీలికలు
- 1.5 tbsp అల్లం వెల్లులి ముద్ద
- 3 tsp ఉప్పు
- 1.5 cup బాస్మతి బియ్యం (250 gm)
- 2 tbsp ఎండిన గులాబీ రేకులు
-
ధం చేయడానికి
- 2 tbsp వేపిన ఉల్లిపాయ తరుగు
- 3 tbsp నెయ్యి
- 1/2 tsp గరం మసాలా
- 1 tbsp కుంకుమ పువ్వు నీళ్ళు
విధానం
-
రొయ్యలు నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి మసాలా బాగా పట్టించి గంట సేపు నానబెట్టుకోవాలి.
-
అన్నం వండుకోడానికి నీళ్ళు మరిగించి మసాలా దినుసులు వేసి ఎసరుని బాగా మరిగించాలి.
-
మరిగే నీళ్ళలో నానబెట్టిన బాస్మతి బియ్యం గులాబీ రేకులు వేసి 80% ఉడికించుకోవాలి
-
80% ఉడికిన అన్నాన్ని గంటసేపు నానుతున్న రొయ్యల మీద వేసుకోవాలి.
-
80% ఉడికిన అన్నం మీద ధం చేయడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసుకోండి.
-
తరువాత మైదా పిండి ముద్ద ప్లేట్ అంచుకు పెట్టి ధం బయటకి పోకుండా సీల్ చేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ధం చేసి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
-
20 నిమిషాల తరువాత అడుగు నుండి నెమ్మదిగా బిర్యానీ తీసి మిర్చి కా సాలన్తో సర్వ్ చేసుకోండి.

Leave a comment ×
18 comments