ఇన్స్టంట్ రవ్వ కేసరి ప్రీ-మిక్స్
పండుగలకి, లేదా తీపి తినాలనిపించినప్పుడైనా ఈ ప్రీమిక్స్ ఉంచుకుంటే టీ పెట్టేంత లోపే రవ్వ కేసరి చేసుకోవచ్చు. ఇన్స్టంట్ రవ్వ కేసరి ప్రీ-మిక్స్ ఒక్క సారి చేసి ఉంచుకుంటే కనీసం 4 నెలలు నిలవఉంటుంది. ఇన్స్టంట్ ప్రీ- మిక్స్ రెసిపీస్ మార్కెట్లో దొరికేవీ తెచ్చుకుని చేస్తే చాలా వరకు చూడడానికి అలాగే అనిపిస్తుంది కానీ, తింటుంటే ఒరిజినల్ రుచి రాదు. కానీ ఈ ఇన్స్టంట్ ప్రీ-మిక్స్ రెసిపీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. 5 నిమిషాల్లో రవ్వ కేసరి తయారైపోతుంది. ఇది పండుగలప్పుడు, లేదా అనుకోకుండా బందువులొచ్చినప్పుడు ఎంతగానో సహాయపడుతుంది. ఇన్స్టంట్ రవ్వ కేసరి ప్రీ- మిక్స్ చేయడం చాలా తేలికే అయినా కొన్ని కచ్చితమైన కొలతలు టిప్స్ ఉన్నాయి.
బొంబాయ్ రవ్వ:
- రవ్వని నెయ్యిలో మాంచి రంగు వచ్చేదాకా లో-ఫ్లేమ్ మీదే వేపాలి. అప్పుడే రుచి.
నీళ్ళు:
- కప్ ప్రీ మిక్స్ రవ్వ కి కప్ మరిగే నీళ్ళు పర్ఫెక్ట్ కొలత. అంటే ఏ కొలతాయి చేసినా 1:1
యాలకపొడి:
- నేను యాలకలపొడి ముందే ప్రీ-మిక్స్ లో కలిపేశాను. ముందే యాలకలపొడి వేయడం వల్ల ప్రీ-మిక్స్ ఎక్కువ కాలం నిలవుంటుంది.
డ్రై - ఫ్రూట్స్:
- నేను బాదాం, కిస్మిస్ వాడాను మీరు ఇంకెవైనా వాడుకోవచ్చు.

టిప్స్
-
వేగిన రవ్వ పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే పంచదార, పాల పొడి కలపాలి, లేదంటే పంచదార రవ్వ వేడికి కరిగి నిలవుండదు.
-
మీరు ఏ కొలతకి చేసినా రవ్వ, పంచదార సమానం, అందులో సగం నెయ్యి, నెయ్యిలో సగం పాల పొడి, డ్రై ఫ్రూట్స్
-
ప్రీ-మిక్స్ రవ్వని వాడే ముందు పాన్ లో ½ tsp నెయ్యి వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి. లేదంటే వేడి నీళ్ళు పోసేటప్పుడు రవ్వ చల్లగా ఉంటే ఉండలు కడుతుంది.
-
రవ్వ కేవలం వేడెక్కితే చాలు, అంతకంటే వేడిచేస్తే రవ్వలోని పంచదార కరిగి పాకంలా అవుతుంది.
-
నేను నీళ్ళు మరిగేప్పుడు సువాసన, రంగు కోసం చిటికెడు కుంకుమపువ్వు వేశాను. వద్దనుకుంటే వదిలేయండి.

ఇన్స్టంట్ రవ్వ కేసరి ప్రీ-మిక్స్ - రెసిపీ వీడియో
Rava Kesari Premix | 3 Months preservable Rava Kesari Premix Recipe | Instant Rava Kesari recipe
Prep Time 2 mins
Cook Time 20 mins
Resting Time 1 hr
Total Time 1 hr 22 mins
Servings 20
కావాల్సిన పదార్ధాలు
- 300 gms బొంబాయ్ రవ్వ
- 300 gms పంచదార
- 150 gms నెయ్యి
- 75 gms పాలపొడి
- 75 gms డ్రై ఫ్రూట్స్
- కుంకుమ పువ్వు – చిటికెడు
- 1 tbsp యాలకల పొడి
- 1 cup నీళ్ళు
విధానం
-
కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఎర్రగా వేపి పక్కనుంచుకోండి.
-
అదే పాన్లో మిగిలిన నెయ్యి వేసి కరిగించి బొంబాయ్ రవ్వ వేసి లో- ఫ్లేమ్ మీద రవ్వ రంగు మారి బంగారు రంగులోకి వచ్చే దాకా కలుపుతూ వేపుకోవాలి.
-
ఎర్రగా వేగిన రవ్వని పూర్తిగా చల్లరనివ్వాలి.
-
చల్లారిన రవ్వలో చక్కెర, డ్రై ఫ్రూట్స్, పాల పొడి, యాలకల పొడి వేసి బాగా కలిపి గాలి చోరని డబ్బాలో ఉంచుకంటే 4 నెలలు నిలవుంటుంది.
-
కేసరి చేయాలనుకున్నప్పుడు, ఒక కప్పు నీళ్ళులో కుంకుమ పువ్వు వేసి బాగా మరగనివ్వండి.
-
మరో పాన్లో ½ tsp నెయ్యి వేసి కప్ ప్రీ- మిక్స్ వేసి రవ్వ వేడెక్కేదాకా కలుపుతూ వేపుకోవాలి.
-
మరుగుతున్న నీళ్ళు వేపుకున్న రవ్వలో పోసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గర పడనిచ్చి దింపేసుకోండి. అంతే బెస్ట్ రవ్వ కేసరి రెడీ.

Leave a comment ×
3 comments