టమాటో కరివేపాకు పచ్చడి

నువ్వులు కొబ్బరి కరివేపాకు ఎర్రగా వేపి నూనెలో మగ్గించిన టమాటో వేసి చేసే తెలుగు వారి టమాటో పచ్చడి అన్నం అట్టు ఇడ్లీ ఉప్మాతో ఎంతో రుచిగా ఉంటుంది.

టమాటో పచ్చడి అచ్చంగా అలా తిన్నా మరో కాయో కూర కలిపి చేసినా ఎంతో రుచిగా ఉంటుంది. టమాటో పచ్చడులు నేను చాలా రకాలు చేసాను అందులో ఇదొకటి. ఈ టమాటో పచ్చడి టమాటో గుబాళింపుతో, నువ్వులు కొబ్బరి కమ్మదనంతో చాలా రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడిలో ఉల్లి వెల్లులి రెండు లేవు కాబట్టి అవి తినని వారికి కూడా నచ్చేస్తుంది. వేడిగా నెయ్యి వేసిన అన్నంతో తెలుగు వారు ఇష్టంగా తింటారు పచ్చడులు.

Tomato Curry Leaves Chutney | Tomato Karivepaku Chutney

టిప్స్

కరివేపాకు:

కరివేపాకు లేతది అయితే నూనెలో మగ్గిన తరువాత పేస్ట్ అయిపోతుంది, కొంచెం ముదురు కరివేపాకు అయితే నార ఉంది మెదిగిన తరువాత నోటికి తెలుస్తుంది. అందుకే ముదురు కరివేపాకు వాడుకోడానికి ప్రయత్నించండి

ఉల్లి వెల్లులి:

ఈ పచ్చడిలో నేను ఉల్లి వెల్లులి వేయలేదు. వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఉల్లి వాడాలనుకుంటే టొమాటోలతో పాటు మగ్గించుకోండి. దింపే ముందు టొమాటోల్లోనే వెల్లులి వేసి 2-3 నిమిషాలు మగ్గించుకోవచ్చు, లేదా తాలింపులో దంచి కూడా వేసుకోవచ్చు.

టమాటో:

పండు నాటు టమాటో అయితే టొమాటోలు పుల్లగా ఉంటాయి. ఏ టొమాటోలు వాడిన రుచి చూసి కొద్దిగా చింతపండు తగినట్లుగా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

టమాటో కరివేపాకు పచ్చడి - రెసిపీ వీడియో

Tomato Curry Leaves Chutney | Tomato Karivepaku Chutney

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 20 mins
  • Total Time 22 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms టమాటో
  • 1 cup కరివేపాకు
  • 1/4 cup కొత్తిమీర
  • 1.5 tbsp నువ్వులు
  • 1/2 cup పచ్చి కొబ్బరి తురుము
  • 6 పచ్చిమిర్చి
  • 3 tbsp నూనె
  • తాలింపు కోసం
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 1/2 tsp మినపప్పు
  • 1 tsp పచ్చిశెనగపప్పు
  • 2 ఎండుమిర్చి

విధానం

  1. 1 tbsp నూనె వేడి చేసి అందులో నువ్వులు వేసి చిట్లనివ్వాలి, తరువాత కొబ్బరి తురుము పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి.
  2. వేగిన పచ్చిమిర్చిలో కరివేపాకు వేసి ఆకులో పసరు వాసన పోయేదాకా వేపుకోవాలి.
  3. తరువాత వేపిన కరివేపాకు నువ్వులు అన్నీ మిక్సీలోకి తీసుకొని కొత్తిమీరతో సహా కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. మూకుడులో ఇంకో tbsp నూనె వేడి చేసి అందులో టమాటో ముక్కలు ఉప్పు వేసి మెత్తగా మగ్గించి గ్రైండ్ చేసుకున్న కరివేపాకులో వేసి 2-3 సార్లు పల్స్ చేసుకుని తీసుకోవాలి.
  5. తాలింపు కోసం మిగిలిన నూనె వేడి చేసి అందులో తాలింపు దినుసులు వేసి ఎర్రగా వేపి పచ్చడిలో కలిపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

Tomato Curry Leaves Chutney | Tomato Karivepaku Chutney