నాటుకోడి పులుసు

తెలుగువారికి గారెలతో అట్లతో వేడి వేడి అన్నంతో, రాగి సంగటితో ఘాటైన నాటుకోడి పులుసు నంజుకుతినండం ఎంతో ఇష్టం ఇంకా ఒక అలవాటు. నాటుకోడి పులుసు వీకెండ్స్లో సంక్రాంతి పండుగలకు తప్పక చేసుకుంటారు.తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా ఉండే తెలుగు వారి నాటు కోడి పులుసు ఎప్పుడు చేసినా సూపర్ హాట్ అయిపోతుంది.

ఈ మధ్య ఉత్తర భారతదెస ప్రభావంతో తెలుగువారు ఏవేవో మసాలాలు వాడి చేస్తుంరారు కానీ, వెనుకటి తెలుగువారి నాటు కోడి పులుసులో చాలా తక్కువ మసాలాలతో ఉంటుంది, తిన్నాక కూడా పొట్టకి హాయిగా ఉంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు చికెన్ షేర్వా

నేను దాదాపుగా సంప్రదాయ పద్ధతిలోనే చేశాను, కానీ గారెలతో దోశలతో కూడా నంజుకుతినడానికి చిన్న మార్పులతో చేశాను. చేసే ముందు ఒక్కసారి కింద టిప్స్ చూసి చేయండి, కచ్చితమైన రెసిపీ వస్తుంది.

టిప్స్

నాటుకోడి:

  1. నేను కిలోన్నర పైన కొద్దిగా బరువున్న నాటుకోడిని శుభ్రం చేసిన తరువాత కిలో ముక్కలు వచ్చాయి.

  2. నాటుకోడి ముక్కలకి ముందుగానే ఉప్పు పసుపు అల్లంవెల్లులి పేస్ట్ పట్టించి కనీసం మూడు గంటలు నానబెడితే ముక్కలకి ఉప్పు బాగా పట్టి త్వరగా ఉడుకుతుంది.

టొమాటోలు :

  1. సాధారణంగా నాటుకోడి పులుసులో టమాటో వాడారు, కొందరు ఆఖరున కొద్దిగా చింతపండుపులుసు పోస్తారు, నేను గ్రేవీ చిక్కదనం కోసం టొమాటోలు వేశాను.

మసాలాలు:

  1. తెలుగు వారి మసాలా అంటే దాల్చిన చెక్కా, లవంగాలు, యాలకలు, గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు వీటిని ఎర్రగా వేపి మెత్తని పొడి చేసి ఆఖరున కూరలో కలుపుతారు. ఇంతకు మించి ఇంకే మసాలాలు వేయరు. నెను చిన్న బిర్యానీ ఆకు వేశాను. నిజానికి ఇది కూడా వాడరు.

కుక్కర్లో:

  1. నేను ఈ కోడి పులుసు విడిగా చేశాను. మీరు కుక్కర్లో చేయదలిస్తే నీరు కొద్దిగా తగ్గించి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ వచ్చేదాకా స్టీమ్ పోయాక నూరుకున్న మసాలా వేసి దగ్గరగా ఉడికించి దింపేసుకోండి.

పులుసు గురుంచి కొన్ని విషయాలు:

  1. నిజానికి పులుసు అంటే చింత పులుపు వేసి చేయాలి. సాంప్రదాయ పద్ధతిలో ఆఖరున కొద్దిగా చింతపులుసు పోసి మరిగించి దింపేస్తారు. నేను చింతపులుసుకి బదులు పుల్లని టొమాటోలు ఆఖరున నిమ్మరసం వేసి చేశాను. నచ్చితే మీరు టొమాటోలు వేయకుండా ఆఖరున చింతపండు పులుసు కొద్దిగా పోసి మరిగించి దింపేసుకోండి. చింతపండు వేస్తే నిమ్మరసం అవసరం లేదు.

ఎక్కువ గ్రేవీ కోసం:

  1. కొందరికి దోశల్లోకి గారెల్లోకి రాగి సంగటి లోకి నంజుకుతినడానికి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటారు అలాంటప్పుడు, ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటోల మోతాదు కొద్దిగా పెంచి వాటికి తగినట్లుగా ఉప్పు కారం కూడా పెంచుకోండి.

నాటుకోడి పులుసు - రెసిపీ వీడియో

Naatukodi Pulusu | Country Chicken sour Curry

| nonvegetarian
  • Cook Time 1 hr
  • Resting Time 3 hrs
  • Total Time 4 hrs
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ నానబెట్టానికి:
  • 1 kg నాటుకోడి
  • 1/2 tbsp పసుపు
  • 2 tbsp నూనె
  • ఉప్పు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • మసాలా పొడి కోసం:
  • 2 tbsp ధనియాలు
  • 7-8 లవంగాలు
  • 5 యాలకలు
  • 1 Inch దాల్చిన చెక్క
  • 1/4 Cup ఎండుకొబ్బరి
  • 1 tbsp గసగసాలు
  • 1 బిర్యానీ ఆకు
  • కూర కోసం:
  • 6 tbsp నూనె
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 2 ఉల్లిపాయ తరుగు
  • 2 Sprigs కరివేపాకు
  • 1/2 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 750 ml వేడి నీళ్లు
  • 2 టమాటోల ముక్కలు
  • 2.5 tbsp కారం
  • 1 నిమ్మకాయ రసం
  • కొత్తిమీర తరుగు (కొద్దిగా)

విధానం

  1. కిలో నాటుకోడి ముక్కలకి ఉప్పు పసుపు అల్లం వెల్లులి ముద్దా నూనె పట్టించి కనీసం 3 గంటలైనా నానబెట్టండి
  2. మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపి ఆఖరున గసగసాలు వేసి చిట్లనిచ్చి దింపేసుకోండి.
  3. మసాలాలు పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే మెత్తని పొడి చేసుకోండి.
  4. నూనె వీడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్ద కొద్దిగా వేసి వేపుకోవాలి.
  6. తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తబడి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. ఆ తరువాత కారం కొద్దిగా నీళ్లు వేసి వేపితే కారాలు మాడవు.
  7. కారం వేగి టొమాటల్లోంచి నూనె పైకి తేలిన తరువాత మూడు గంటలు నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  8. చికెన్ వేగి నూనె పైకి తేలిన తరువాత వేడి నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ముక్క మెత్తబడేదాకా ఉడికించుకోవాలి.
  9. సుమారుగా 35 నుండి 40 నిమిషాలు లేదా చికెన్ క్వాలిటీని బట్టి ఇంకొంచెం సమయం పట్టొచ్చు మొత్తానికి 80% ఉడికిన తరువాత నూరుకున్న మసాలాలు కొత్తిమీర వేసి కలిపి మూతబెట్టి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి.
  10. నూనె పైకి తేలిన తరువాత ఆఖరుగా ఒక నిమ్మకాయ రసం కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.