చికెన్ షేర్వా | చపాతీ, పరోటా రోటీలలోకి అద్దిరిపోయే రెసిపీ ఈ చికెన్ షేర్వా

Curries
5.0 AVERAGE
5 Comments

చపాతీ, పరోటా రోటీలలోకి అద్దిరిపోయే రెసిపీ ఈ చికెన్ షేర్వా. ఘాటుగా కారంగా ఉండే ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

చికెన్ షేర్వానే తమిళనాడు, కేరళ ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో సాల్నా అని కూడా అంటారు, తెలంగాణాలో శోరవా అంటారు. ఈ చికెన్ షేర్వా రెసిపీ, వేడి వేడిగా పరోటాలతో చాలా రుచిగా ఉంటుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో సాయంత్రాలు ఏ పరోటా బండి దగ్గరకి వెళ్ళినా చికెన్ షేర్వాని రుచి చూడవచ్చు. షేర్వా తమిళనాడు వారికి ఒక అనుబంధం అంటారు. అంత ఇష్టతతో తింటారు. సాల్నా రెసిపీ చాలా సులభం కొన్ని టిప్స్ పాటిస్తూ చేయండి బెస్ట్ సాల్నాని రుచి చూడండి.

Chicken Sherva | Chicken Salna | Best for Dosa Chapathi and Rice | How to make Chicken Shorva

టిప్స్

చికెన్ స్టాక్:

  1. చికెన్ స్టాక్ సన్నని సెగ మీద ఎంత ఎక్కువ సేపు మరిగితే అంత రుచిగా ఉంటుంది సాల్నా.

  2. చికెన్ స్టాక్లో చికెన్ ఎముకలు 80% ఉండాలి అప్పుడు స్టాక్కి రుచి.

  3. మీకు చికెన్ స్టాక్ చేసే టైమ్ లేదంటే రెడీమేడ్గా దొరికే చికెన్ స్టాక్ క్యూబ్స్ వేగిన చికెన్లో నీళ్ళు పోసి అందులో క్యూబ్స్ వేసి కూడా వాడుకోవచ్చు.

వేరుశెనగపప్పు:

  1. పప్పు నిదానంగా సన్నని సెగ మీద వేపితేనే పప్పు లోపలిదాకా వేగి రుచిగా ఉంటుంది సాల్నా.

  2. పల్లీలు సరిగా వేపకపోయినా, ఎక్కువగా వేసినా సాల్నా అస్సలు రుచిగా ఉండదు.

గసగసాలు:

  1. గసగసాలు సాల్నాకి ఎంతో రుచినిస్తాయ్. లేని వారు జీడిపప్పు వాడుకోవచ్చు.

చికెన్ షేర్వా | చపాతీ, పరోటా రోటీలలోకి అద్దిరిపోయే రెసిపీ ఈ చికెన్ షేర్వా - రెసిపీ వీడియో

Chicken Sherva | Chicken Salna | Best for Dosa Chapathi and Rice | How to make Chicken Shorva

Curries | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Total Time 35 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ స్టాక్ కోసం
  • 250 gms చికెన్ ఎముకలు
  • 1/2 cup కాప్సికం ముక్కలు
  • 1/2 cup కేరట్ ముక్కలు
  • 1/4 cup ఉల్లిపాయ ముక్కలు
  • 1 బిరియానీ ఆకు
  • 1 tsp మిరియాలు
  • 1.25 liter నీళ్ళు
  • సాల్నా కోసం
  • 1/4 cup పల్లీలు
  • 1 tbsp గసగసాలు
  • 1 tsp సొంపు
  • 1/2 cup పచ్చికొబ్బరి ముక్కలు
  • 4 tbsp నూనె
  • 1 అనాస పువ్వు
  • 3 యాలకలు
  • 4 లవంగాలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 బిరియానీ ఆకు
  • 1.5 cup ఉల్లిపాయలు సన్నని తరుగు
  • ఉప్పు
  • కొత్తిమీర – కొద్దిగా
  • 2 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 350 gms చికెన్
  • 2 టొమాటో (సన్నని తరుగు)
  • 2 పచ్చిమిర్చి (చీలికలు)
  • 1/4 tsp పసుపు
  • 1 1/4 tbsp ధనియాల పొడి
  • 2 1/4 tsp కారం
  • 1 tsp చికెన్ మసాలా పొడి
  • 10 - 15 పుదీనా ఆకులు

విధానం

  1. స్టాక్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద గంట సేపు మరిగించాలి. 25 నిమిషాల తరువాత స్టాక్ మీద ఒక తేట ఏర్పడుతుంది దాన్ని నెమ్మదిగా తీసేయండి.
  2. గంట సేపు మరిగిన స్టాక్లోంచి చికెన్ ఉడికిన కూరగాయ ముక్కలు అన్నీ తీసేసి పడేయండి. మిగిలిన స్టాక్ని పక్కనుంచుకోండి.
  3. ముకుడులో పల్లీలు వేసి చిట్లే దాకా వేపుకోవాలి, తరువాత గసాలు వేసి వేపి దింపేసుకోండి
  4. మిక్సీ జార్లో వేపిన పల్లీలు, గసాలు పచ్చికొబ్బరి వేసి నీళ్ళతో వెన్నలాంటి పేస్ట్ చేయాలి
  5. సాల్నా కోసం నూనె వేడి చేసి అందులో అనాస పువ్వు, చెక్క, సొంపు, లవంగాలు,యాలకలు, బిరియానీ ఆకు వేసి వేపుకోవాలి
  6. సన్నని ఉల్లిపాయ చీలికలు, ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసి ఉల్లిపాయలు మెత్తబడి రంగు బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  7. వేపుకున్న ఉల్లిపాయాల్లో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి, తరువాత చికెన్ వేసి హై-ఫ్లేమ్ మీద చికెన్ పైన బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  8. చికెన్ బంగారు రంగులోకి వేగాక టొమాటో తరుగు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు ధనియాల పొడి, కారం వేసి బాగా వేపుకోవాలి.
  9. వేగిన మసాలాల్లో పక్కనుంచుకున్న చికెన్ స్టాక్ పోసి నూనె పైకి తేలేదాక సన్నని మంట మీద ఉడికించాలి.
  10. 15 నిమిషాలకి నూనె పైకి తేలుతుంది అప్పుడు పల్లీలు కొబ్బరి పేస్ట్, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి సన్నని మంట మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి
  11. ఆఖరున చికెన్ మసాలా పొడి వేసి కలిపి మరి 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
  12. వేడి వేడి పరోటా, చపాతీ, అట్టు ఇడ్లీ , పూరీ ఇలా ఎందులోకైనా ఎంతో రుచిగా ఉంటుంది ఈ చికెన్ షేర్వా.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

Chicken Sherva | Chicken Salna | Best for Dosa Chapathi and Rice | How to make Chicken Shorva