టమాటో కొత్తిమీర సూప్
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా టొమాటో కొత్తిమీర షోర్బా గొంతులో దిగుతుంటే భలేగా ఉంటుంది. ఈ సింపుల్ దేశీ సూప్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి
డైట్ చేసే వారికి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సూపులు ఇంకా రుచిగా అనిపిస్తాయ్. నిజానికి ఈ రెసిపీని షోర్బా అనే అనాలి. షోర్బా అనే మాట దేశీయమైన మాట. ఉత్తర భారత దేశంలో చలి కాలం చాలా ఎక్కువగా షోర్బాలు చేస్తుంటారు. ముఖ్యంగా కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో.
షోర్బా “టీ” కి మల్లె గ్లాసులతో తాగేలా పల్చగా ఉంటుంది. టొమాటో సూప్లా చిక్కగా ఉండదు. ఈ షోర్బా టొమాటోల పులుపు కొత్తిమీర పరిమళంతో చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
-
షోర్బా సన్నని సెగ మీద మరిగితేనే వేసిన పదార్ధాలలోని సారం అంతా దిగి ఎంతో రుచిగా ఉంటుంది.
-
సాధ్యమైనంత వరకు దేశీయమైన పులుపు టొమాటోలు వాడేందుకు ప్రయత్నించండి.
టమాటో కొత్తిమీర సూప్ - రెసిపీ వీడియో
Tomato Dhania Shorba | Tomato Coriander Shorba | Tomato Coriander Soup
Prep Time 2 mins
Cook Time 18 mins
Total Time 20 mins
Servings 2
కావాల్సిన పదార్ధాలు
- 250 gms టొమాటో ముక్కలు
- 75 gms కొత్తిమీర కాడలు
- 1/2 tsp మిరియాలు
- 1/2 దంచిన అల్లం
- 5 - 6 దంచిన వెల్లులి
- 1 బిర్యానీ ఆకు
- 1 tsp వెన్న/ నెయ్యి
- 1 tsp నూనె
- 3 యాలకలు
- 3 లవంగాలు
- 1/2 ఇంచ్ దాల్చిన చెక్క
- ఉప్పు
- 1/2 tsp వేపిన జీలకర్ర పొడి
- 1/2 tsp కారం
- 1 tbsp కొత్తిమీర తరుగు – కొద్దిగా
- 500 - 600 ml నీళ్ళు
- 1 tsp గోధుమ పిండి
విధానం
-
వెన్న నూనె వేడి చేసి అందులో అల్లం, వెల్లులి, యాలకలు, లవంగాలు బిర్యానీ ఆకు, మిరియాలు వేసి వేపుకోవాలి.
-
వేగిన మాసాలలో గోధుమపిండి వేసి ఎర్రగా వేపి టొమాటో ముక్కలు కొత్తిమీర కాడలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి టొమాటో మెత్తబడే దాకా వేపుకోవాలి.
-
టొమాటో మెత్తగా గుజ్జుగా అయ్యాక నీళ్ళు పోసి సన్నని సెగ మీద 400 ml అయ్యేదాక మరిగించుకోవాలి.
-
మరిగిన షోర్బాని జల్లెడలో వేసి వడకట్టి పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి వేడివేడిగా సర్వ చేసుకోండి.

Leave a comment ×
3 comments