వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు నోటికి ఏ రుచి తెలియనప్పుడు వేడి వేడిగా గొంతులోకి ఘాటైన ఈ కేరట్ జింజిర్ సూప్ రుచి మూడింతలు పెరుగుతుంది.

చేయడానికి సులభంగా తాగడానికి ఇష్టంగా ఉండే సూపుల్లో ఒకటి కేరట్ జింజర్ సూప్. ఈ సూప్ డైటింగ్ చేసే వారికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ సూప్ రాత్రిళ్ళు నెల రోజులు తాగితే కచ్చితంగా శరీర రంగు పెడుతుంది అని ఒక డైటీషియన్ నాతో అన్నారు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు టమాటో కొత్తిమీర సూప్

ఈ సింపుల్ కేరట్ సూప్కి కొన్ని చిట్కాలున్నాయి ఒక్క సారి అవి చదివి పాటిస్తూ చేయండి.

టిప్స్

మిరియాలు:

  1. ఈ కొలతకి ½ చెంచా అంత కంటే తక్కువగా ఉండాలి మిరియాలు అంత కంటే ఎక్కువగా ఉంటె అల్లం ఘాటుతో కలిసి తాగలేరు.

సూప్ చిక్కదనం:

  1. ఈ సూప్ చిక్కగా ఉంటేనే రుచిగా ఉంటుంది. అందుకే నేను సరిపోను నీళ్లు పోసి మరిగించాను.

కేరట్:

  1. కేరట్ మెత్తగా నిదానంగా ఉడికితేనే ఫ్లేవర్స్ అన్నీ కేరట్లోకి చేరుతాయి. అప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  2. ఇంకా సూప్ మరిగేప్పుడు పైన ఏర్పడే నురగ తీసేస్తే సూప్ చూడ్డానికి బాగుంటుంది

కేరట్ జింజిర్ సూప్ - రెసిపీ వీడియో

Carrot Ginger soup | Carrot Ginger soup with tips | How to Make Carrot Ginger Soup

Healthy Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Total Time 21 mins
  • Serves 2

కావాల్సిన పదార్ధాలు

  • 300 gm కేరట్
  • 800 ml నీళ్లు
  • 1 బిర్యానీ ఆకు
  • 5 Cloves వెల్లులి
  • 1/2 tbsp మిరియాలు
  • 1/2 Inch అల్లం
  • ఉప్పు
  • 1 tbsp నూనె
  • 1/4 Cup ఉల్లిపాయ

విధానం

  1. నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, వెల్లులి మిరియాలు అల్లం ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపుకోండి
  2. వేగిన మిరియాల్లో ఉల్లిపాయ కేరట్ ముక్కలు వేసి 3 నిమిషాలు వెస్పుకోండి, తరువాత అరా లీటర్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడకనివ్వాలి
  3. మెత్తగా ఉడికిన కేరట్ని నీళ్లతో సహా మెత్తని పేస్ట్ చేసుకోండి
  4. మెత్తని కేరట్ పేస్ట్ని జల్లెడలో వేసి వడకట్టుకోండి, ఆ తరువాత 300 ml నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి
  5. 5మరుగుతున్న సూప్ పైన నురగ ఏర్పడుతుంది, ఆ నురగని తీసేయండి. దింపే ముందు ఉప్పు వేసి కలిపి దింపేసుకోండి. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Super
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Super
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Aha ! The same taste and experience As you narrated. Wonderful, if anyone miss something means, it is this only, someone who didn’t tasted it.