మిరియాల కోడి వేపుడు
వీకెండ్స్ కి పార్టీలకి బెస్ట్ చికెన్ రెసిపీలలో టాప్ లిస్ట్లి ఉండేది పెప్పర్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై లు చాలానే ఉన్నా పెప్పర్ చికెన్ ఫ్రై ముందు అన్నీ దిగదుడుపే! సాంబార్ పప్పు చారుతో నంజుడుగా ఇంకా బాగుంటుంది.
ఈ రెసిపీలో పెప్పర్ చికెన్ మసాలా రెసిపీ కూడా ఉంది. తాజా మసాలా పొడితో చేసే చికెన్ వేపుడు ఎప్పుడూ వేపుడుకి మాంచి పరిమళం రుచినిస్తుంది. నా స్టైల్ పెప్పర్ చికెన్ దక్షిణ భరతదేశంలో చేసే తీరు. పెప్పర్ చికెన్ అంటే కారం తక్కువగా మిరియాల ఘాటుతో ఉంటుంది. ఈ విధానంలో చికెన్ వేపుడు పూర్తిగా డ్రైగా ఉండదు కాస్త చెమ్మగా ఉంటూ అన్నంలో కలుపుకు తినేలా ఉంటుంది. ఈ పెప్పర్ ఫ్రై రొటీలలో కంటే పూరీలలోకి చాలా రుచిగా ఉంటుంది.
ఇంత సింపుల్ రెసిపీని ఇంట్లో చేసినా కూడా రెస్టారెంట్ టెస్ట్ రావాలంటే కొన్ని కచ్చితమైన టిప్స్ తో చేయాల్సిందే!
Try this Street Food Style Chilli Chicken and Restaurant style Sweet Chilli chicken

టిప్స్
చికెన్:
-
చికెన్ మీడియం సైజు ముక్కలుగా ఉండాలి. మరీ చిన్నవి అయితే వేగాక ఇంకా చిన్నవిగా అయిపోతాయ్
-
చికెన్ వేపడానికి ముందు కడిగి ఉప్పు వేసిన నీళ్ళలో ఉంచితే ముక్కలు మెత్తబడి రుచిగా ఉంటుంది చికెన్
-
చికెన్ నూనెలో వేశాక కలిపి హై ఫ్లేమ్ మీద చికెన్లోని నీరు పోయేదాక వేపుకోవాలి
మసాలా:
- మసాలాలు సన్నని సెగ మీద నిదానంగా వేపుకోవాలి అప్పుడే మసాలా దినుసులు లోపలిదాక వేగి పొడికి పరిమళం
ఇంకొన్ని విషయాలు:
-
ఈ వేపుడుకి కాస్త నూనె ఉంటేనే రుచి.
-
రెస్టారంట్ రుచి రావాలంటే కచ్చితంగా ఇనుప ముకుదులు వాడాలి. అప్పుడే మసాలా అడుగుపడుతుంది, ఆ మసాలాని గీరి మళ్ళీ కలపాలి అలా అడుగుపట్టిన మసాలా వల్లే హోటల్స్ ఇచ్చే పెప్పర్ చికెన్కి స్పెషల్ రుచి. నాన్స్టిక్ పాన్లో అనుకున్నంత రుచి రాదు.
మిరియాల కోడి వేపుడు - రెసిపీ వీడియో
Pepper Chicken Fry | Dry Pepper Chicken Fry | How to make Chicken Fry
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/2 Kg చికెన్ (మీడియం సైజు ముక్కలు)
- 75 ml నూనె
- 1/2 tsp ఆవాలు
- 2 రెబ్బలు కరివేపాకు
- 10 వెల్లులి పాయలు
- 1 tsp అల్లం వెల్లులి ముద్ద
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 6 ఎండు మిర్చి
- 1 tsp నెయ్యి
- కొత్తిమీర – కొద్దిగా
- ఉప్పు
- 1 tsp కారం
- 1/4 tsp పసుపు
- 1 tsp నిమ్మరసం
-
మసాలా పొడి కోసం
- 1 ఇంచ్ దాల్చిన చెక్క
- పత్తర్ ఫూల్ – కొద్దిగా
- 1 tsp జీలకర్ర
- 1 tsp సొంపు
- 2 tsp మిరియాలు
- 3 లవంగాలు
- 3 యాలకలు
- 1 అనాసపువ్వు
- 1 మరాఠీ మొగ్గు
- 1 tbsp ధనియాలు
విధానం
-
పెప్పర్ చికెన్ మసాలా పొడి కోసం మసాలా దీనుసులన్నీ అన్నీ వేసి లో ఫ్లేమ్ మీద సువాసన వచ్చేదాకా వేపుకుని దింపి పొడి చేసుకోవాలి.
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి వెల్లులి, కరివేపాకు వేసి వెల్లులి బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపి అల్లం వెల్లులి ముదా వేసి వేపుకోవాలి.
-
ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి హై-ఫ్లేమ్ మీద మూత పెట్టి చికెన్లోని నీరు పోయేదాక వేపుకోవాలి.
-
వేగిన చికెన్లో ఉప్పు, కారం పసుపు, నిమ్మరసం, పెప్పర్ చికెన్ మసాలా పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు లేదా నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
-
ప్రతీ 5 నిమిషాలకో సారి అడుగుపట్టిన మసాలాని గీరి కలుపుతో వేపుకోవాలి.
-
చికెన్ వేగి నూనె పైకి తేలాక నెయ్యి కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment ×
7 comments