భేల్ పూరి | చైనీస్ భేల్ పూరి | చైనీస్ భేల్ | భేల్ పూరి రెసిపీ
చైనీస్ భేల్- ఉడికించిన నూడుల్స్ కి కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఇచ్చి నూనెలో ఎర్రగా వేపి నూడుల్స్ కోసం వేసే వెజ్జీస్ని మగ్గించి అందులో చైనీస్ సాసులు వేపుకున్న నూడుల్స్ వేసి చేసే చైనీస్ స్టైల్ మాంచి టైం పాస్ స్నాక్.
పుల్లగా కారంగా ఘాటుగా చైనీస్ సాసుల పరిమళంతో కరకరలాడుతూ ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేంత గొప్ప స్నాక్ రెసిపీ చైనీస్ భేల్.

టిప్స్
నూడుల్స్:
-
సాధారణంగా మార్కెట్లో రకరకాల నూడుల్స్ దొరుకుతాయి. దయచేసి ఊరు పేరు లేని లోకల్ నూడుల్స్ కంటే బ్రాండెడ్ నూడుల్స్ మాంచి రుచి రూపంతో పాటు తినేందుకు బాగుంటాయి.
-
నూడుల్స్ ని పూర్తిగా మెత్తగా ఉడికించకండి, 90% ఉడికించుకుంటే చల్లారేలోగా మిగిలినవి ఉడికిపోతాయ్. నీటిని వార్చిన నూడుల్స్లో కాసింత నూనెవేసి పూర్తిగా చల్లారబెట్టాలి, వేడి మీద కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఇస్తే నూడుల్స్ మెత్తగా అయిపోయి చిదురుచుదురుగా అవ్వడమే కాకుండా విరిగిపోయి కోటింగ్ పట్టుకోదు.
-
నూడుల్స్ కి కార్న్ ఫ్లోర్ ఒకే సారిగా కాకుండా కొద్దికొద్దిగా వేస్తూ మొత్తంగా పట్టించాలి. ఆ తరువాత నూడుల్స్ ని కొద్దిగా కొద్దిగా నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి.
వెజ్జీస్ వేపే తీరు:
- కొద్దిగా నూనె వేసి వెజ్జీస్ని హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి, అప్పుడే వెజ్జీస్ కరకరలాడుతూ తినేందుకు బాగుంటాయి.
ఇంకొన్ని టిప్స్:
-
ఉప్పు చాలా మితంగా వేసుకోవాలి. వేసే అని సాసులలో ఉప్పు ఉంటుంది కాబట్టి.
-
భేల్ తయారు చేసిన వెంటనే సర్వ్ చేసేయాలి అప్పుడే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది.
భేల్ పూరి | చైనీస్ భేల్ పూరి | చైనీస్ భేల్ | భేల్ పూరి రెసిపీ - రెసిపీ వీడియో
Chinese Bhel | Bhel Puri Recipe | Chinese Bhel Puri
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting Time 30 mins
Total Time 1 hr
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 1 bundle నూడుల్స్
- నీళ్ళు (నూడుల్స్ ని ఉడికంచడానికి)
- ఉప్పు (కొద్దిగా)
- నూనె (ఉడికిన నూడుల్స్ పైన చల్లుకోడానికి)
- నూనె (నూడుల్స్ ని వేపుకోడానికి)
- 5 tbsp కార్న్ ఫ్లోర్
-
వెజ్జీస్ వేపుకోడానికి :
- 3 tbsp నూనె
- 1 tbsp వెల్లులి తరుగు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 1 tsp అల్లం
- ¼ cup ఉల్లి చీలికలు
- ¼ cup కేరట్ చీలికలు
- ¼ cup ఆకుపచ్చ కాప్సికం
- ¼ cup పసుపు పచ్చ కాప్సికం
- 1 ½ cups కేబేజి చీలికలు
- ఉప్పు (కొద్దిగా)
-
భేల్ తయారీకి:
- ¼ tsp మిరియాల పొడి
- ½ tbsp గ్రీన్ చిల్లి సాస్
- 1 tbsp రెడ్ చిల్లి సాస్
- 1 tsp చిల్లి ఫ్లెక్స్
- 3 tbsp వేపిన వేరుశెనగగుండ్లు
- 2 tbsp ఉల్లికాడలు
- 1 tbsp టమాటో సాస్
- ఉప్పు (చిటికెడు)
- ఉల్లికాడలు (కొద్దిగా)
- 1 tbsp శేజ్వాన్ సాస్
- ½ tsp వెనిగర్
- 1 tsp చైనీస్ చిల్లి పేస్ట్
- ½ tsp సోయా సాస్
విధానం
-
మరిగే నీళ్లలో ఉప్పు నూడుల్స్ చుట్ట వేసి హై ఫ్లేమ్ మీద 90% ఉడికించి వెంటనే నూడుల్స్ ని జల్లెడలో వేయాలి.
-
నూడిల్స్ పైన కొద్దిగా నూనె వేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-
చల్లారిన నూడుల్స్ పైన కార్న్ ఫ్లోర్ కొద్దీ కొద్దిగా వేసి బాగా కోట్ చేసుకోవాలి.
-
కార్న్ ఫ్లోర్ పట్టించిన నూడుల్స్ ని మరిగిన నూనెలో కొద్దీ కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోవాలి.
-
మరో పాన్లో నూనె వేడి చేసి అందులో అల్లం వెల్లులి తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక నిమిషం వేపుకోండి.
-
వేగిన వెల్లులిలో ఉల్లి కేరట్ కాప్సికం వేసి మరో నిమిషం వేపుకోండి.
-
ఆ తరువాత కేబేజి చీలికలు వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి.
-
పైపైన వేగిన వెజ్జీస్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి దింపేసి ఒక బౌల్ లోకి తీసుకుని చల్లారచండి.
-
చల్లారిన వెజ్జీస్లో భేల్ కోసం ఉంచిన సాసులు మిగిలిన పదార్ధాలన్నీ వేసి ముందు బాగా టాస్ చేయండి.
-
ఆఖరుగా వేపిన నూడుల్స్ ని నెమ్మదిగా చిదిమి వెజ్జీస్ పట్టించిన సాసులలో వేసుకోండి.
-
పైన కాసిన్ని ఉల్లికాడలు చల్లి టాస్ చేసుకుని వెంటనే సర్వ్ చేయండి.

Leave a comment ×
3 comments