ఎగ్ ఖీమా మసాలా | అండా ఖీమా మసాలా
అదేంటోగాని ఎగ్తో ఏ వంటకం చేసినా ఇష్టపడని వారుండరు. ఆలాంటి సూపర్ రెసిపీనే దాభా స్టయిల్ అండా ఖీమా మసాలా. కొన్ని సార్లు రెసిపీ పేర్లు కాస్త గంభీరంగా ఉంటాయ్ గాని, రెసిపీ టీ పెట్టనంత సులభంగా తయారవుతుంది.
ఎగ్ ఖీమా మసాలా అంటే ఉడికించిన కోడి గుడ్లని ఖీమాలా సన్నగా తురిమి మసాలాలు దట్టించి చేసే సింపుల్ రెసిపీ. ఎగ్ ఖీమా మసాలా రెస్టారెంట్లోనూ దాభాలలోనూ దొరుకుతుంది, కానీ రెస్టారెంట్ పద్ధతి అంటే కాజు పేస్ట్ ఇంకా చిక్కని మసాలా గ్రేవీ వేసి చేస్తుంటారు. నేను సింపుల్ దాభా పద్ధతిలో చేస్తున్నాను. ఈ పద్దతి జస్ట్ ఆమ్లెట్ వేసినంత సులభంగా అయిపోతుంది. వేడిగా అన్నంతో ఇంకా పూరీ చపాతీతో చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
-
ఎగ్ కర్రీకి కొంచెం నూనెలుంటేనే రుచి. నచ్చని వారు తగ్గించుకోండి. నూనె తగ్గించి వేస్తే గనక వేడివేడిగా తినగలిగితే రుచిగా ఉంటుంది.
-
దాభా స్టైల్ అంటే కాస్త స్మోకీ ఫ్లేవర్ ఉండాలి, అలా స్మోకీ ఫ్లేవర్ రావాలంటే హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది.
-
ఎగ్ ఖీమా కాస్త నీరుగా ఉండగానే దింపేయాలి లేదంటే చల్లారాక ముద్ద పప్పులా అవుతుంది.
ఎగ్ ఖీమా మసాలా | అండా ఖీమా మసాలా - రెసిపీ వీడియో
Dabha Style Egg Kheema Masala | Anda Kheema Masala | Boiled Egg Keema Masala Curry
Prep Time 10 mins
Cook Time 15 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 4 ఉడికించిన గుడ్లు
- 4 tbsp నూనె
- 1 tsp జీలకర్ర
- 1 cup ఉల్లిపాయ తరుగు
- 1 tbsp పచ్చిమిర్చి తరుగు
- 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
- 1/4 tsp పసుపు
- 1/2 tsp కారం
- 1/2 tsp గరం మసాలా
- ఉప్పు
- 1/4 tsp మిరియాల పొడి
- 1/2 tsp జీలకర్ర పొడి
- 1/2 tsp ధనియాల పొడి
- 1/2 cup టొమాటో తరుగు
- 1/4 cup కాప్సికం తరుగు
- కొత్తిమీర తరుగు – చిన్న కట్ట
- 1 tsp అల్లం తరుగు
- 1 tsp నిమ్మరసం
- 125 ml నీళ్ళు
విధానం
-
నూనె బాగా వేడి చేసి జీలకర్ర వేసి చిటచిట అనే దాకా వేపుకుంటే మాంచి ఫ్లేవర్ వస్తుంది.
-
వేగిన జీలకర్రలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడి కాస్త రంగు మారే దాకా వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయాలో అల్లం వెల్లులి ముద్ద పసుపు వేసి వేపుకోండి.
-
తరువాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి టొమాటో ముక్కలు మెత్తబడి నూనె తేలేదాక వేపుకోవాలి.
-
మగ్గిన టొమాటోలో కాప్సికం ముక్కల తరుగు వేసి ఒక నిమిషం వేపుకోవాలి, ఆ తరువాత నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద సగం నీరు ఇగిరిపోయేదాక ఉడికించండి.
-
నీరు ఇంకా కాస్త ఉండగానే ఉడికిన గుడ్లని పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకోండి, తరువాత కాస్త కొత్తిమీర చల్లి నెమ్మదిగా టాస్ చేసుకోండి.
-
దింపే ముందు అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం,. బటర్ వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
4 comments