బీరకాయ కోడి గుడ్డు పొరుటు | బ్యాచిలర్స్ కి ఆఫీస్ వెళ్ళే వారికీ బెస్ట్ కర్రీ

“బీరకాయ కోడిగుడ్డు పొరుటు” లంచ్ బాక్సులకి బ్యాచిలర్స్ కి ఆఫీస్ కి వెళ్ళే వారు చాలా త్వరగా చేసుకోగలిగిన కమ్మటి కూర. రైస్ చపాతీతో ఇంకా డిన్నర్ కి కూడా చాలా బాగుంటుంది.

ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి వేసే చేసే కోడిగుడ్డు పోరుటు అందరికి తెలుసు, వేడిగా అన్నం, చపాతీ, పూరీలు చేసినప్పుడు మా ఇంట్లో చేస్తుంటాం. ఆ సింపుల్ రెసిపీ నేను ఇంకా పోస్ట్ చేయలేదు త్వరలో పోస్ట్ చేస్తా. బీరకాయ కోడి గుడ్డు పొరుటు చేసిన రోజున కచ్చితంగా తృప్తిగా భోజనం ముగిస్తారు.

కోడి గుడ్డు పొరుటులు దేసమంతటా ఉన్నాయ్, ప్రాంతాన్ని బట్టి రుచి మారిపోతుంది. ఇదే గుడ్డు పొరుటు కుర్మా కూడా చేయొచ్చు. ఆలోచించాలే గాని ఎన్నో ఎన్నో చేయొచ్చు ఒక్క గుడ్డుతో.

Ridged Gourd Scrambled Eggs | Turai Egg Bhurji Masala | Beerakaya Egg Burji | Peerkangai Muttai Poriyal Recipe

టిప్స్

ఎప్పుడు చేసినా గుడ్డు పోరుటు రుచిగా రావాలంటే:

• సహజంగా గుడ్డు పొరుటుకి నూనె ఉండాలి, బాగా వేగాలి అప్పుడే రుచి.

• మామూలు ఉల్లిపాయ వేసి చేసే పొరుటు కి రెండు ఉల్లిపాయలకి రెండు గుడ్లు ఇలా చేస్తే తప్పక రుచిగా ఉంటుంది. ఈ పొరుటుకి

• గుడ్డు పగలగొట్టి వేసాక కాస్త వేగనిచ్చి తరువాత కలుపుకుంటే, గుడ్డు కూరలో తెలుస్తుంది తినేప్పుడు, వేసిన వెంటనే బాగా కలిపేస్తే తరకలుగా ఉంటుంది. రెండు విధాలుగానూ బాగుంటుంది.

• తొక్క తీసిన లేత బీరకాయలు ఒకేరకంగా ముక్కలు కోసి వాడితే చాలా రుచిగా ఉంటుంది.

• తీసియన బీరకాయ తోక్కుని రెండు టమాటో ఓ ఉల్లిపాయ ఏడెనిమిది పచ్చిమిర్చి వేసి రెండు స్పూన్ల నూనెలో మగ్గించి పచ్చడి చేస్తే అన్నం రొట్టేల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా ఏ కూరగాయలతో చేసుకోవచ్చు:

• చిన్నా మార్పులతో, లేదా కాయకూర మార్చి ఏ కాయ కూరతో అయినా చేసుకోవచ్చు. కానీ కాయకూర స్వభావాన్ని అర్ధం చేసుకుని ఏ మేరకు వేపాలి, ఎప్పుడు వేయాలి, ఎంత వేయాలి అనేది అర్ధం చేసుకుంటే, ఎప్పుడు ఏ కాయ-కూరతో చేసినా రుచిగానే ఉంటుంది.

Ridged Gourd Scrambled Eggs | Turai Egg Bhurji Masala | Beerakaya Egg Burji | Peerkangai Muttai Poriyal Recipe

బీరకాయ కోడి గుడ్డు పొరుటు | బ్యాచిలర్స్ కి ఆఫీస్ వెళ్ళే వారికీ బెస్ట్ కర్రీ - రెసిపీ వీడియో

Ridged Gourd Scrambled Eggs | Turai Egg Bhurji Masala | Beerakaya Egg Burji | Peerkangai Muttai Poriyal Recipe

Bachelors Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms చెక్కు తీసిన లేత బీరకాయ ముక్కలు
  • 4 గుడ్లు
  • 2 ఉల్లిపాయ
  • 2 చీలికలు పచ్చిమిర్చి
  • 1 tsp అల్లం తరుగు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • 1 రెబ్బ కరివేపాకు
  • 2 tsp కొత్తిమీర
  • 1/4 tsp పసుపు
  • 1 tsp కారం
  • ఉప్పు
  • 1 tsp ధనియాల పొడి
  • గరం మసాలా- చిటికెడు
  • 1/4 cup నూనె

విధానం

  1. నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, అల్లం వేసి వేపుకోండి.
  2. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి పచ్చి వాసన పోయే దాక వేపి బీరకాయ ముక్కలు వేసి ఇందులోనే కారం, పసుపు, ఉప్పు బాగా కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలేదాకా మీడియం-ఫ్లేం మీద మగ్గించుకోండి.
  3. నూనె పైకి తేలగానే గుడ్లు కూర మీద కొట్టి కదపకుండా మూత పెట్టి మీడియం ఫ్లేం మీద కూర 3-4 నిమిషాలు మగ్గనివ్వండి
  4. 3 నిమిషాల తరువాత ముక్కలుగా గరిటతో కట్ చేసి బాగా కలిపి కూర లోంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి, ఈ కూర వేగి నూనె పైకి తేలడానికి పన్నెండు పదిహేను నిమిషాలు పడుతుంది.
  5. నూనె పైకి తేలగానే కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి కలిపి దిమ్పెసుకోవడమే!
  6. ఇది అన్నం, చపాతీ, పూరీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

Ridged Gourd Scrambled Eggs | Turai Egg Bhurji Masala | Beerakaya Egg Burji | Peerkangai Muttai Poriyal Recipe