గుత్తి కాకరకాయ/ నింపుడు కాకరకాయ | ఆంధ్రా స్టైల్ కాకరకాయ ఫ్రై

Curries
5.0 AVERAGE
6 Comments

"కాకరకాయ" అమ్మో చేదు..! అని మొహం చిట్లించే వాళ్ళు కూడా ఆంధ్రా స్టైల్ కాకరకాయ ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారు. తిన్న కొద్దీ తినాలనిపించే కాకరకాయ వేపుడు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.

కాకరకాయ వేపుడు చాలా తీరుల్లో చేస్తారు ప్రాంతాన్ని బట్టి. నేను ఆంధ్రులు చేసే కాకరకాయ వేపు రెసిపి చెప్తున్న. ఈ కాకరకాయ వేపుడు చేదుగా ఉండదు, వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా ప్రయాణాలప్పుడు, లేదా హాస్టల్స్ లో ఉండేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వేపుడు వారం రోజులైనా పాడు కాదు.

ఈ గుత్తి కాకరకాయ/నిమ్పుడు కాకరకాయ వేపుడు కనీసం వారం పాటు నిలవుంటుంది కూడా. ఈ కాకరకాయ వేపుడు ని కొన్ని ప్రాంతాల్లో గుత్తి కాకరకాయ ఇంకొన్ని ప్రాంతాల్లో నిమ్పుడు కాకరకాయ అని కూడా అంటారు. అలాగే ప్రాంతాన్ని బట్టి ఎన్నో రకాలుగా చేస్తారు తెలుగు వారు. కొందరు ధనియాల కారం, సెనగపిండి కారం, నువ్వుల కారం, సొంటి కారం ఇలా ఎన్నో. నేను కారంగా ఉండే కొబ్బరి కారం తో చేస్తున్నా. కారంగా ఉన్నా, కొబ్బరి ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది. కాకరకాయతో ఇది వరకు ఎన్నో రకాలు నేను చేశాను, అన్ని రెసిపీస్ లోనూ చేదు తెలియకుండా ఎలా చేసుకోవచ్చో వివరంగా టిప్స్ తో ఉంది చుడండి. ఈ గుత్తి కాకరకాయ మరో తీరులో చేస్తారు ఆ తీరు కూడా వివరంగా టిప్స్ లో ఉంది చుడండి.

Stuffed Bitter Gourd curry | Stuffed Karela | Gutti Kakarakaya |  How to make Stuffed Bitter Gourd curry / fry

టిప్స్

  1. అసలు ఈ రెసిపీ "చిట్టి కాకరకాయలు" అంటే దొండకాయ సైజు కాకరకాయలు వాడాలి. నాకు అవి దొరకలేదు కాబట్టి ఉన్న వాటిల్లోనే కాస్త చిన్నవి వాడాను. చిట్టి కాకరకాయలు అయితే లోపలిదాకా వేగి చాలా బాగుంటుంది వేపుడు.

  2. లేత కాకరకాయలు త్వరగా వేగి పోవడమే కాక చాలా రుచిగా ఉంటాయ్, ముదురు వాటికంటే.

  3. కాకరకాయల పైన చెక్కు తీసి ఉప్పు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించి 30 నిమిషాలు ఊరబెడితే చేదు దిగుతుంది.

  4. కాకరకాయ లోపలి గింజలు నేను తీసేసాను కొందరు గింజలు ఇష్టంగా తింటారు. వారు ఎండు మిరపకాయల్తో పాటు వేపుకుని పొడి చేసి వాడుకోవచ్చు

  5. కాకరకాయలు నూనెలో ఎర్రగా వేపి తీసి అందులో పొడి స్టఫ్ చేసాను. మీరు కావాలంటే కాకరకాయలు సగం పైన వేపి చల్లార్చి స్టఫ్ఫింగ్ కూరి మళ్ళీ వేపుకోవచ్చు. అలాగే మిగిలిన పొడి కూడా వేసి వేపుకోవచ్చు.

  6. నేను చేసిన తీరులో నూనె ఎక్కువగా అవసరం ఉండదు.

  7. పొడి మిగిలితే అట్టు ఇడ్లీ లేదా వేడి అన్నం లో వేసుకుని తినొచ్చు. నెల రోజులు నిలవ ఉంటుంది.

Stuffed Bitter Gourd curry | Stuffed Karela | Gutti Kakarakaya |  How to make Stuffed Bitter Gourd curry / fry

గుత్తి కాకరకాయ/ నింపుడు కాకరకాయ | ఆంధ్రా స్టైల్ కాకరకాయ ఫ్రై - రెసిపీ వీడియో

Stuffed Bitter Gourd curry | Stuffed Karela | Gutti Kakarakaya | How to make Stuffed Bitter Gourd curry / fry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 25 mins
  • Cook Time 20 mins
  • Total Time 50 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kilo లేత చిన్న కాకరకాయలు
  • 1/4 cup ఉప్పు
  • 1 tsp పసుపు
  • 2 ఎండు కొబ్బరి చిప్పల ముక్కలు
  • 15 ఎండుమిర్చి
  • 2 tsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 15 వెల్లూలి
  • 1 tbsp బెల్లం
  • 1.25 tsp ఉప్పు
  • 2 రెబ్బల కరివేపాకు
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. కాకరకాయల చెక్కు తీసి మధ్యకి చీరి లోపలి గింజలు తీసేయండి.
  2. ఉప్పు, పసుపు ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న ఉప్పుని కాకరకాయ లోపల బయట అన్ని వైపులా రుద్ది 30 నిమిషాలు వదిలేయండి.
  3. మూకుడులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలుపుతూ మంచి సువాసన వచ్చేదాకా వేపుకుని తీసి చల్లార్చుకోవాలి.
  4. అదే మూకుడులో ధనియాలు, జీలకర్ర, వెల్లూలి, కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే దాక లో- ఫ్లేం మీద కలుపుతూ వేపుకోవాలి.(నచ్చితే కాకరకాయ గింజలు కూడా వేసి వేపుకోవచ్చు).
  5. కొబ్బరి ఇంకా వేపుకున్న ధనియాల అన్నీ మిక్సీ లో వేసి అందులోనే ఉప్పు బెల్లం వేసి పొడి చేసుకోండి.
  6. ఊరుతున్న కాకరకాయలని గట్టిగా పిండితే చేదు దిగుతుంది.
  7. మూకుడులో నూనె వేడి చేసి అందులో పిండుకున్న కాకరకాయలు వేసి నూనె కాకరకాయల పైకి తోస్తూ ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
  8. చల్లారిన కాకరకాయల్లో కొబ్బరి కారం స్టఫ్ఫ్ చేసి అన్నం తో సర్వ్ చేసుకోండి.
  9. నచ్చితే కాకరకాయలు సగం పైన వేపుకుని తీసి, చల్లారిన తరువాత అందులో పొడి కూరి మళ్ళీ నూనె లో వేపుకోవచ్చు. ఆఖరున మిగిలిన పొడి వేసుకోవచ్చు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

  • V
    Venkataramaa
    Recipe Rating:
    Super kada, cheduga vundadu ila chesthe
  • R
    Ravali asuri
    Vismai food bro nenu mathram me recipes chusina tharavathey nenu cooking neruchukunna ... Me recipes nenu anni try chesey superb ga vacheye ... Ma mother aiyethey evala em special chayali antey nuv em aiyena chayu kani vismai foods ney follow aiye chayu antaru ... Ma mummy meku pedhe fan and me cooking kuda ... Me voice ki frist attract aiye cooking neruchukunna ... Thank u so much ... Bro .. and belated Happy rakshabandhan bro
  • U
    Udit Aggarwal
    Recipe Rating:
    This is a great recipe. Thank you for sharing!. Your recipes are always great.
Stuffed Bitter Gourd curry | Stuffed Karela | Gutti Kakarakaya |  How to make Stuffed Bitter Gourd curry / fry